సోమవారం, మార్చి 13, 2017

హవ్వారే హవ్వా హైలేసో...

బుద్దిమంతుడు చిత్రంలోని ఒక అల్లరి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

హవ్వారే హవ్వా హైలేసో హహ్హ
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో
హవ్వారే హవ్వా...

పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్
పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్

వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్
వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్

హవ్వారే హవ్వా...హైలేసో..లెస్సో...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో
ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో

టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టెక్కంతా ఎగిరి పోయి ఎక్కీ ఎక్కీ ఏడ్చెరోయ్ 
ఓయ్.. ఓయ్.. ఓయ్

హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్
చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్

జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరో
జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరో..

హవ్వారే హవ్వా హైలెస్సో అహ
హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...


2 comments:

అవును శాంతి గారు అల్లరి పాట :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.