మిత్రులందరకూ ఉగాది శుభాకాంక్షలు. కులదైవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కులదైవం (1960)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : సుశీల
ఆడిపాడేను నామది ఈవేళ
అరుదెంచె ఉగాది ఈ శుభవేళ
ఆడిపాడేను నామది ఈవేళ
అరుదెంచె ఉగాది ఈ శుభవేళ
కనువిందై ఈ జగమంతా
కలిగించు చక్కలిగింత
కనువిందై ఈ జగమంతా
కలిగించు చక్కలిగింత
మూగే ఎల తుమ్మెద రొదలు
మురిసే విరి బాల
మూగే ఎల తుమ్మెద రొదలు
మురిసే విరి బాల
ఉప్పొంగి ఉవ్విళ్ళూరే ఈ వేళ
మనసూగే మనసూగేను
పూవుల ఉయ్యాల
ఆడిపాడేను నామది ఈవేళ
అరుదెంచె ఉగాది ఈ శుభవేళ
కేరింతల చిలుకల బాటా
ఊరించే నన్నీ పూటా
కేరింతల చిలుకల బాటా
ఊరించే నన్నీ పూటా
చిరుగాలీ సందడి తేలే
చిన్నారి భావాలే
చిరుగాలీ సందడి తేలే
చిన్నారి భావాలే
మా సొంతము ఆనందాలే ఏచోటా
వయసూరే వయసూరే
వయ్యారపు అందాలే
ఆడిపాడేను నామది ఈవేళ
అరుదెంచె ఉగాది ఈ శుభవేళ
2 comments:
బిలేటెడ్ ఉగాది విషెస్ వేణూజీ..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.