గురువారం, మార్చి 02, 2017

రేపంటి రూపం కంటి...

మంచి-చెడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచి-చెడు (1963)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
 
రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి

నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ
నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ
ఈ రాగ సరళి తరలి పోదాం రమ్మంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

నీలోని మగసిరితోటి నాలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి...

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...
రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి


3 comments:

అద్భుతమైన గీతం.
కానీ ఈ‌పాటలో తరచుగా వినిపించే రేపంటి అన్న మాటకు అర్థం చాలామందికి సులభంగా తెలియదు. రేయి అంటే రాత్త్రి. ఈ‌ సంగతి అందరికీ‌ తెలుసు కదా. అలాగే పండు అంటే కూడా తెలియని వాళ్ళెవరూ‌ ఉండరు. ఈ‌రెండుపదాల కలయికతో ఏర్పడిన రూపం రేయి +‌పండు -> రేయిపండు ->‌రేపండు. అంటే రాత్రిపూట లభించే‌ పండు. అంటే చంద్రుడు. ఇలాగే‌ రేయిని రే అని క్లుప్తీకరించిన పదాలు రేరాజు రేరాణి రేవెలుగు వంటివి బహుప్రసిధ్ధమే. రేపండు అంటే చంద్రుడు కాబట్టి రేపంటి అనగా రేపండు యొక్క అని అర్థం. రేపంటి రూపం‌ అంటే చంద్రునివంటి రూపం‌ లేదా చంద్రుడి రూపం. రేపంటి వెలుగు అంటే చంద్రుడి వెలుగు అనగా వెన్నెల.

ఓపికగా వివరించినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారు.

సముచితము👌గా వివరించారు.
ధన్యవాదములు 🙏

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.