మంగళవారం, మార్చి 07, 2017

మురిపించే అందాలే...

బొబ్బిలి యుద్దం చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆదియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, సుశీల

సొగసు కేల్జడదాన .. సోగకన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన...
బంగారు జిగిదాన.. సింగారములదాన
నయమైన వయ్యారి నడలదాన...
తోరంపు కటిదాన ... తొణకు సిగ్గులదాన
పిడికిటనడగు నెన్నడుముదాన...

ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....ఆ...
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
నా దానవు నీవేలే... నీ వాడను నేనేలే...
ఆ....ఆ....ఆ...ఆ...
దరి చేర రావే... సఖి నా సఖీ...
ప్రేయసి సిగ్గేల...

మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
నిదురించే భావాల... కదిలించే ఈ వేళ...
ఆ....ఆ....ఆ...ఆ...
అదే హాయి కాదా.. సఖా నా సఖా..
 
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..

చెలి తొలి చూపే మంత్రించెనే
ప్రియసఖు రూపే మదినేలెనే
చెలి తొలి చూపే మంత్రించెనే
ప్రియసఖు రూపే మదినేలెనే
ఇది ఎడబాటు కనలేని ప్రేమా
ఇల మనకింక సురలోక సీమ
ఇది ఎడబాటు కనలేని ప్రేమా
ఇల మనకింక సురలోక సీమ

ఇదేహాయి కాదా... సఖా.. నా సఖా ...ఆ...ఆ...
 
మురిపించె అందాలే... అవి నన్నే చెందాలే

అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో
మధుమాధుర్యమే నిండిపొయే
హృదయానందమే పొంగిపొయే
మధుమాధుర్యమే నిండిపొయే
హృదయానందమే పొంగిపొయే
దరి చేర రావే ... సఖి..  నా సఖీ...

మురిపించే అందాలే అవి నన్నే చెందాలే

2 comments:

ఇలా వర్ణిస్తే ఇష్టపడని అమ్మాయుంటుందా..

అంతేకదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.