బుధవారం, మార్చి 08, 2017

లేచింది నిద్ర లేచింది...

మహిళా దినోత్సవం సంధర్బంగా మహిళామణులకు శుభాభినందనలు తెలుపుతూ గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం

ఎపుడో చెప్పెను వేమనగారు..
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు..
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా ఆ...
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు..
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు..
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల ఆ...
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు ...
నిరుద్యోగులను పెంచారూ...

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసీ
చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసీ

ఢిల్లీ సభలో పీఠం వేసీ..ఈ ...
ఢిల్లీ సభలో పీఠం వేసీ
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూ

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది.. నిద్ర లేచింది..
నిద్ర లేచింది మహిళాలోకం
 

2 comments:

థాంక్యూ వేణూజీ..ఫర్ ద పవర్ఫుల్ విషెస్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.