వాగ్ధానం చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే.. ఉత్త ఆడదానివే
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెంపట్టీ...కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే
అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
తూకంవేసీ....తూకంవేసి.. పాకంచూసి
డెందం ఒకరికె ఇవ్వాలి
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
అందం డెందం కలిపీ.. ఆనందం అర్థం తెలిపే
అందం డెందం కలిపీ.. ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు
అన్నీ ఉన్నవనుకోవాలి
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.