భలే రంగడు చిత్రం లోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భలే రంగడు--1969
సంగీతం : K V మహాదేవన్
సాహిత్యం : సినారే
గానం : ఘంటసాల, సుశీల
Hip Hip Hurray
ఓహో భలే
Hip Hip Hurray
ఒహో భలే
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
గెలుపే మెరుపై తెలిపెను తెలిసెను
బ్రతుకు బాటలో మలుపు
గెలుపే మెరుపై తెలిపెను తెలిసెను
బ్రతుకు బాటలో మలుపు
!! Hip Hip Hurray
ఒహో భలే !!
స్నేహం ఎంతో తీయనా
అది తెలిసిన మనసె చల్లనా
ఓ...ఓ... మ్మ్....మ్మ్...
ఓ...ఓ.....ఓ.....
స్నేహం ఎంతో తీయనా
అది తెలిసిన మనసె చల్లనా
తీయని చల్లని లేతమనసు నీ
స్నేహం వలన కమ్మనా...
నా తీయని చల్లని లేతమనసు నీ
స్నేహం వలన కమ్మన
!! Hip Hip Hurray
ఒహో భలే !!
నీ కన్నులు చెప్పే కథలూ
నా మదిలో చిలికెను సుధలు
నీ కన్నులు చెప్పే కథలూ
నా మదిలో చిలికెను సుధలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు
ప్రతినవ్వు కురిసెను తేనెలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు
ప్రతినవ్వు కురిసెను తేనెలు
ప్రతినవ్వు కురిసెను తేనెలు
!! Hip Hip Hurray
ఒహో భలే !!
పక్కన నీవే వుంటే
నే కంటా ఎన్నో కలలూ
ఓ...ఓ...మ్మ్...మ్మ్...
ఓ....ఓ......
పక్కన నీవే వుంటే
నే కంటా ఎన్నో కలలూ
పండిన కలలో పొంగే అలపై
తేలిపోవాలి మనము
పండిన కలలో పొంగే అలపై
తేలిపోవాలి మనము
!! Hip Hip Hurray
ఒహో బలే
చేయి చేయి కలగలపు
నీది నాది తొలి గెలుపు
Hip Hip Hurray
ఒహో భలే
Hip Hip Hurray
ఒహో భలే
Hip Hip Hurray
ఒహో భలే !!
2 comments:
పిక్ తమాషాగ ఉందండీ..బావుంది..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.