శుక్రవారం, మార్చి 31, 2017

చిలిపికనుల తీయని...

కులగోత్రాలు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా..
నిలుపుకొందురా వెల్గులమేడ


నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
మనసులోన కలలు పండెనూ . .
కనులముందు అలలు పొంగెనూ ..
ఓ . . .
మనసులోన కలలు పండెనూ . .
అలలే కలలై ..కలలే అలలై
అలలే కలలై ..కలలే అలలై
గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ . . .

చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ


కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కోరికలన్నీ బారులుతీరీ
కోరికలన్నీ బారులుతీరీ
గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ. . .


నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
నింగీ నేలా కలిసిన చోటా
నింగీ నేలా కలిసిన చోటా
నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ . . .

చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ


ఓ ఓ ఓ . . .
ఓ ఓ ఓ . . .
 

2 comments:

రసాలూరు సాలూరి వారి సంగీతం..యెప్పుడైనా మధురమే..

అవునండీ వారి సంగీతమే కాదు గళం కూడా మధురమే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.