మంగళవారం, మార్చి 14, 2017

ఎవరూ లేని చోటా...

మంచి కుటుంబం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచి కుటుంబం (1967)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..ఇంకా..
చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ..
చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ
పెంచి నన్ను వేదించకూ..ఊ..

ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ..
దాచి నన్ను దండించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ..
కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ
కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ..ఊ..

ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ...
చేసి మేను మరిపించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..
ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా..ఆ..ఆ..

2 comments:

హార్ట్ టచింగ్ సాంగ్..

అవును శాంతి గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.. :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.