ఆదివారం, మార్చి 26, 2017

చీరకు రవికందమా...

అత్తలూ కోడళ్ళు చిత్రంలోని ఒక సరదా అయినా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)
సంగీతం : కె. వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

చీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?
చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చీరకు రవికందమా?.. రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

పైటకొంగు చుట్ట చుట్టి పైటన్నం గంపనెట్టి
పైటకొంగు చుట్టచుట్టి పైటన్నం గంపనెట్టి

కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె
కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె

నడక అందమా ? ఆ నడుము అందమా ?
నడక అందమా ? ఆ నడుము అందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా


పైరగాలి వీస్తుంటే.. పంటచేలు వూగుతుంటే
పైరగాలి వీస్తుంటే, పంటచేలు వూగుతుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే


నువ్వు అందమా? నీ గర్వమందమా?
నువ్వు అందమా ? నీ గర్వమందమా ?


చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే

ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే

కోరికందమా? .. నీ కోపమందమా ?
నా కోరికందమా? .. నీ కోపమందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా
 చీరకు రవికందమా? .. రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 
 

2 comments:

యెంకి పాటల స్టైల్లో ఉందీపాట అనిపిస్తోంది...

అవునండీ సాహిత్యం అలాగే అనిపిస్తుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.