శనివారం, అక్టోబర్ 11, 2014

ఈ సంజెలో.. కెంజాయలో...

రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి... ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కానీ సుశీలమ్మ "ఈ సంజెలో..." అని మొదలు పెట్టగానే సగం అటెన్షన్ ఈ పాట వైపు పెట్టేసి ఆలకించే వాడ్ని. పాటంతా సుశీల గారు కష్టపడి పాడుతుంటే మధ్యలో బాలుగారు సరదాగా చిన్న చిన్న ఆలాపనలతోనే మార్కులు కొట్టేస్తారు. నాకు నచ్చిన ఈపాట మీరూ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మూగప్రేమ (1970)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, పి సుశీల

ఈ సంజెలో... కెంజాయలో....
ఈ సంజెలో కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో

ఈ సంజెలో.. కెంజాయలో..
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అ.అ.హహ.. ఈ సంజెలో.. 

ఆఆ..ఆహా....ఓఓ...ఓహో...
ఈ మేఘమే రాగ స్వరమో
ఆఆఆఆ...
ఆ రాగమే మూగ పదమో
ఆఆఆఆ...
ఈ మేఘమే రాగ స్వరమో
ఆఆహా....
ఆ రాగమే మూగ పదమో
ఈ చెంగు ఏ వయసు పొంగో
ఆఆఆఆ...
ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో
రెప రెప రెప రెప రెప రెప

ఈ సంజెలో..

మ్మ్..ఊహూ..ఆఅ..ఆహా..
పులకించి ఒక కన్నె మనసు
ఆఆఆఆ...
పలికింది తొలి తీపి పలుకు
మ్మ్మ్..మ్మ్మ్..
పులకించి ఒక కన్నె మనసు
ఆహాహా..ఆ...
పలికింది తొలి తీపి పలుకు
చిలికింది అది లేత కవిత
ఆఆఆఆ...
తొణికింది తనలోని మమత
మదిలో మమతలో
రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ

ఈ సంజెలో...

ఆఆ..ఆహా....ఓఓ...ఓహో...
నా కళ్లలో ఇల్లరికము
ఆఆఆఆ...
నా గుండెలో రాచరికము
ఆఆఆ...
నా కళ్లలో ఇల్లరికము
ఆహహహ...
నా గుండెలో రాచరికము
ఈ వేళ నీవేలే నిజము
ఆఆఆఆ...  
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కల కల కల కిల కిల కిల

ఈ సంజెలో.. కెంజాయలో..
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అ.అ.హహ.. ఈ సంజెలో.. 


శుక్రవారం, అక్టోబర్ 10, 2014

వందనాలు వందనాలు...

జేగంటలు సినిమాకోసం వేటూరి గారు రాయగా కె.వి.మహదేవన్ గారు స్వారపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. యూట్యూబ్ పని చేయని వారు ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జేగంటలు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు..
వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన..
నా స్వామికీ వందనాలు

 

ఊ..వందనాలు ..వందనాలు..
వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన...
నా దేవికీ వందనాలు...

ఊ..వందనాలు..వందనాలు..
వలపుల హరిచందనాలు

 
ఈ కన్నే కోపాలు.. వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు.. ఏ పొద్దు సగపాలు..
ఈ కంటి నీలాలు... ఆ కంట పోంగితే
సురగంగ నీరాల.. సరిగంగ తానాలు
 

ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ...
ఈ ఒక్కరాతిరి తొలి రాతిరవ్వనీ...

 కలలన్నీ కలయికలే ...
కలుసుకొనే కౌగిలిలో...
 

వందనాలు.. 
ఊ.. వందనాలు వందానాలు
వలపుల హరిచందనాలు...
వెన్నెలలో వేచి వేచి
వెచ్చనైన నా స్వామికి..
వందనాలు వందనాలు..
వలపుల హరిచందనాలు

 
సంపెంగ పూలలో ..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో ..ఈ నోము నోచాను
 

ఏకాంత సేవకే.. ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో.. నీ చెంత చేరాను
నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా

 ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే.. 

 వలపులనే వయసులలో
 
వందనాలు ..
ఊ..వందనాలు వందనాలు
వలపుల హరిచందనాలు

 కన్నులలో నీరు నిల్చి
చల్లనైన నా దేవికి 
వందనాలు... వందనాలు 
వలపుల హరిచందనాలు..
ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్

గురువారం, అక్టోబర్ 09, 2014

తం తననం తన...

కొత్త జీవితాలు సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట ఇది. సినిమాలో మాంటేజ్ సాంగ్ గా చిత్రీకరించిన ఈపాటను ఇద్దరితో పాడించాలనే ఆలోచన ఇళయరాజా గారిదో భారతీరాజా గారిదో కానీ అది మనకి వీనుల విందైంది. సుశీల గారు జానకి గారు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి పాడారీ పాటను. సినారే గారి అందమైన సాహిత్యానికి ఇళయరాజా గారి సంగీతం సొబగులద్దితే గాయనీమణులిద్దరూ ప్రాణం పోశారు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : కొత్త జీవితాలు (1980)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : సుశీల, జానకి 

 
తననం...తననం...తననం...తననం..త...
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ..
 

తం...తననం..తననం...తననం...తననం...
తం తన నంతన తాళంలో.. 

రస రాగంలో మృదునాదంలో..
నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో.. 

రస రాగంలో మృదునాదంలో.. 
నవ జీవన భావన పలికెనులే 
నవ భావనయే సుమ మోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ

తం తన నంతన తాళంలో..

రస రాగంలో.. మృదునాదంలో..
నవ జీవన భావన పలికెనులే


తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన..తనన తనన..

 

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే

 ఆ....ఆ...ఆ...ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే...

కన్నియ ఊహలు వెన్నెలలై...
కదలే కదలే విరి ఊయలలై

 పున్నమి వేసిన ముగ్గులలో...
కన్నులు దాచిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే...
చిరు మరులను చిలుకగ

తం తన నంతన తాళంలో..
రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే


ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..


పొంచిన మదనుడు పువ్వుల బాణం...
నాటెనులే.. ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పొంచిన మదనుడు పువ్వుల బాణం...
నాటెనులే.. ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై...
మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల చుక్కల పందిరిలో...
వెన్నెల రాయని కౌగిలిలో

ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే...
మధుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో...
రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే...

నవ భావనయే సుమమోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...


తం తన నంతన తాళంలో..
రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే


తం తననం తననం తననం తననం తననం


బుధవారం, అక్టోబర్ 08, 2014

రామా హై రామా...

వీడెవడండీ బాబు సినిమాలో ఒక సరదా అయిన పాట ఈరోజు మీకోసం. పాట మెలోడియస్ గా స్వరాలతో చక్కగా ఉంటే చిత్రీకరణ మాత్రం చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూసీ వినీ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : వీడెవడండీ బాబు (1997)
సంగీతం : సిర్పి 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : మనో, గీత 

రామ హై రామా నిన్నే వేడుతున్నా 
భామా ఓ భామా అంటూ పాడుతున్నా 
బదులు రాని ప్రేమ కీర్తన
రామ హై రామా నిన్నే వేడుతున్నా 
ఆ రామదాసు గానం వినలేదా 
ఈ ప్రేమదాసు రాగం ఏం చేదా హో.. 
ఆమెదాకా చేర్చు రామా హా..

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

ఏ కన్నులలో నా కల ఉందో 
తెలిసే దాకా కునుకే రాదే 
నీరెప్పలనూ బంధించావని 
ఒక చిరుగాలి కబురిచ్చింది 
పైటను మీటుతున్న నా పాటను పోల్చుకో 
తలుపులు తీసి నన్ను నీ గుండెలో చేర్చుకో
విరహమింక ఎన్ని నాళ్ళనీ..

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

చెంపకు చారెడు కన్నులు ఉన్నా
వాటికి నేనూ కనపడలేదా
ఆరడుగులతో ఎదురుగ ఉన్నా 
ఆమెకి నేను సరిపడలేదా 
మరీ పేద వాడ్ని కానులే ప్రేమకు నేను 
వరించాను అంటే చాలులే తరించనా నేను 
ఎలా నీకు విన్నవించనూ.. 

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

మంగళవారం, అక్టోబర్ 07, 2014

కవ్వించే కళ్ళల్లో ఏవో ఏవో...

ఈ సినిమా పేరు మాత్రమే చెబితే మీలో చాలా మంది గుర్తించలేరేమో కానీ ఈపాట విన్నపుడు మాత్రం "అరే చాన్నాళ్ల తర్వాత విన్నామే... ఇంత మంచి పాటను ఎలా మర్చిపోయాం" అని ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. నాకైతే ఎప్పుడో ఎనభైల్లో రేడియోలో మాత్రమే విన్న గుర్తు మళ్ళీ మొన్న ఏదో పాట గురించి వెతుకుతుంటే ఇది కనిపించి ఆశ్చర్యపరచింది. ఇళయరాజా గారు క్లాసికల్ స్టైల్లో కంపోజ్ చేసిన ఈ చక్కని పాటను మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పంచభూతాలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..
ఆ.ఆ..ఆ..

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
 

ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా

 ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా

 సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును
మరుల విరులు కురియగ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ

 లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.
నవ వికచ కుసుమ ముఖ
ముఖర భ్రమర రుతిలో..ఓఓ..
వనమే వధువై మనువే వరమై
పులకించే ఈ వేళా

 ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..
చల చల్లగా జల్లుగా కవితలల్లగా
ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట
రత్నాల పల్లకి నిలుపగా

 

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా



సోమవారం, అక్టోబర్ 06, 2014

తొలిసారి తలుపులు తీసి...

రహమాన్ తన ప్రైమ్ టైమ్ లో ట్యూన్ చేసిన ఒక చక్కని మెలోడీ ఇది. తన సంగీతం, సిరివెన్నెల గారి సాహిత్యం, చిత్రీకరణ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉంటాయి. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు కానీ కొంతకాలానికి మరుగున పడిపోతాయి. మళ్ళీ కొన్నాళ్ళకు ఉన్నట్లుండి ఏ ప్రశాంతపు సాయంత్రమో హఠాత్తుగా గుర్తొచ్చి కొన్నాళ్ళు అలా స్మృతిపథంలో తరచుగా మెదులుతూ ఉంటాయి. ఒక రెండు వారాలుగా నాకీపాట అలా పదే పదే గుర్తొస్తుంది. మీరూ ఈ అందమైన పాట చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమంటే ప్రాణమిస్తా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర 

ఆ...తొలిసారి తలుపులు తీసి 
పిలిచిందీ మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..
మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ చేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్ !

నువ్వు నేనే లోకం .. నవ్వులోనే స్వర్గం ..
ఆరారు ౠతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం .. సంబరాలే సాక్ష్యం ..
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..

ఏనాడు మన ఏకాంతం జంటను వీడదూ..
మనతోట విరులకు బరువై ఎన్నడు వాడదూ..
ఇటు రారే ఎవ్వరూ..ఇటుగా చూసేదెవ్వరూ..
ఈ భావనలో శ్రుతి మించిన స్వరఝరి 
చల్ చల్ చల్ అంటే..
అయ్యయ్యో వెల్లువ ఈ వన్నెల జిలుగులలో..
నవ యవ్వన లీలలో.. మనసెటు పయనించునో..

కడలి చేరే ఏరే చెలి చిందులూ..
మొలక నవ్వే ఎదకీ గిలిగింతలూ..
దాహం తో దాడి చేసి..మేఘాన్ని వేడి చేసి..
దివి గంగై ప్రణయం రాదా రాదా 
రాదా రాదా..రాగం తీసీ..

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..
మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్ !

నువ్వు నేనే లోకం .. నవ్వులోనే స్వర్గం ..
ఆరారు ౠతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం .. సంబరాలే సాక్ష్యం ..
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే !

కనికట్టే కట్టీ కట్టీ ముడి వేసే చూపూ..
పసిపెట్టే రహస్యమేదో నాక్కూడా చెప్పూ..
ఆ చూపుల్లో మెరుపూ..కాలానికి మైమరపూ..
తన కళ్ళెదుటే జత వేడుక సాగుతూ..
నిలూ నిలూ నిలూ అంటే..
ఆహాహ అంటూ కాలం శిలగా మారినదా..
మన కథగా ఆగినదా..
వింతగ అనిపించదా..

ప్రణయగీతం అంటే జలపాతమే..
శిలను సైతం మీటే అనురాగమే..
అడుగడుగూ పూల పొందు..
హృదయం లో వలపు వాగు..
ప్రతి సంధ్యా మన్నూ మిన్నుల వలపే పాడూ..

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

ఆదివారం, అక్టోబర్ 05, 2014

జాలి జాలి సందె గాలి...

చక్రవర్తి గారి సంగీత సారధ్యంలో ఒక పిల్లతెమ్మెర లాంటి హాయైన పాట ఈ రోజు మీకోసం. సినిమా విజయంతో పని లేకుండా కొన్ని పాటలు అలా గుర్తుండి పోతాయి కారణమేదైనా కావచ్చు ఒకసారి కనెక్ట్ అయితే ఆ పాటలను మరువలేం.. ఇదీ అలాంటి పాటే. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యుద్దభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా 
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. 
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు 

సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. 
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు 

పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా 
తారకల్లు ఆకసాన దీపమెట్టినా 
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా 
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా 
ఆగదు అందదు మనసు ఎందుకో 
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి 
కంటి మీద కునుకురాని కొంటె కోరిక 
తెలుసుకో ఇక....! 

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
 
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా 
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా 
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా 
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా 
తీరని తీయని మనసు ఏమిటో 
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక 
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక 
తెలుపుకో ఇక... 

సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. 
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు 

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా 
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. 
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు 

శనివారం, అక్టోబర్ 04, 2014

ఇన్నాళ్లకి గుర్తొచ్చానా...

వర్షం సినిమాలోని ఈ అందమైన వాన పాట ఈరోజు మీకోసం... దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంటుంది, ఇక సిరివెన్నెల గారి కలం వానకీ అమ్మాయికీ మధ్య స్నేహాన్ని గురించి ఎంత అందంగా వర్ణించిందో చెప్పడానికి మాటలు చాలవు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వర్షం(2003)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర, రకీబ్ ఆలం 

 
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో 

 
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన

ముద్దులొలికే ముక్కుపుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా
చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా
వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
 
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఆహా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా..

చిన్న నాటి తాయిలంలా
నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా
 
నువ్వొస్తానంటే ఆ.. నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా


శుక్రవారం, అక్టోబర్ 03, 2014

శివానీ భవానీ...

మిత్రులందరకూ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తారు నైవేద్యంగా పులిహోర కానీ లేదా లడ్డూలు కానీ సమర్పించుకోవాలిట. ఈ సందర్బంగా స్వాతికిరణం సినిమాలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ముందు పాడే "శివానీ భవానీ" అనే పాటను తలచుకుందామా. నాకు చాలా ఇష్టమైనదీ పాట బాలు గారు పాడే విధానం దానికి మమ్ముట్టీ అభినయం రెండూ బాగుంటాయి. ఎంబెడ్ చేసిన ఫైల్ లో రెండునిముషాల వద్ద బాలుగారి వర్షన్ మొదలవుతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

శివానీ... భవానీ... శర్వాణీ...
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ...


శృంగారం తరంగించు సౌందర్య లహరివని... ఆ....
శృంగారం తరంగించు సౌందర్య లహరివనీ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని... ఆ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని...
కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియనీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ... 

 
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ
 
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...


గురువారం, అక్టోబర్ 02, 2014

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి...

ఈ రోజు అష్టమి నవమి ఒకేరోజు రావడంతో అమ్మవారు ఉదయం దుర్గాదేవి రూపంలోనూ సాయంత్రం మహిషాసుర మర్ధిని రూపంలోనూ దర్శనమిస్తారు. ఉదయం చక్కెర పొంగలి లేదా బెల్లం పాయసం సాయంత్రం క్షీరాన్నం లేదా పాల పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు సప్తపది సినిమాలోనీ ఈ మధురమైన పాటను తలచుకుందామా. ఓంకార పంజర సుఖీం అంటూ ప్రశాంతంగా మొదలై నెమ్మదిగా వేగాన్ని అందుకుంటూ చివరికి అమ్మ విశ్వరూప సందర్శనమైనంతగా ఉత్తేజపరుస్తూ ముగిసే ఈపాట సంగీత సాహిత్యాలు నాకు చాలా ఇష్టం. ఎప్పుడు విన్నా పూర్తిగా వినకుండా ఫార్వర్డ్ చేయలేనీ పాటను. ఈ బ్లాగ్ లో ప్రచురించే పాటలన్నీ నాకు ఇష్టమైనవే అయినా కొన్ని పాటలు లిరిక్స్ కోసం నూరుశాతం ఆస్వాదిస్తూ వింటాను అలాంటి వాటిలో ఈ పాట ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఓంకార పంజరశుకీం
ఉషనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం
అంతర్విభావయేత్ గౌరీం 

తాం తకఝం తరితా 
తధికిటతోం తకతరి ఝంతరితా
తధికిటతోం తాంతకఝం
తకతరిఝం తఝ్ఝం 
తధికిటతోం తధికిటతోం తధికిటతోం 

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

తాం తద్ధీం తద్ధీం
తకధిమి తకఝణు
తకధిమి తకఝణు
తాం తద్ధీం తద్ధీం
తకధిమి తకఝణు
తకధిమి తకఝణు
తాం ధీం తోం నం 
తరికిటతోం తరికిటతోం తరికిటతోం

శుభగాత్రి గిరిరాజపుత్రి  
అభినేత్రి శర్వార్థగాత్రి
శుభగాత్రి గిరిరాజపుత్రి 
అభినేత్రి శర్వార్థగాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి 
చంద్రప్రభా ధవళకీర్తి 
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి
చంద్రప్రభా ధవళకీర్తి  
చతుర్బాహు సంరక్షిత శిక్షిత
చతుర్దశాంతర భువనపాలినీ
కుంకుమరాగ శోభినీ
కుసుమబాణ సంశోభినీ 
మౌనసుహాసిని గానవినోదిని
భగవతి పార్వతిదేవి
 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తధీంతత్తఝ్ఝం తకఝం తకఝం 
తరికిటతోం.. తరికిటతోం..
తధీంతత్తఝ్ఝం తకఝం తకఝం 
తరికిటతోం.. తరికిటతోం.. 
తకధీంత తకధీంత 
తకతధీంతాంత తకధిమి తఝ్ఝణుతాం..

శ్రీహరి ప్రణయాంబురాశి 
శ్రీపాద విచలిత క్షీరాంబురాశి 
శ్రీహరి ప్రణయాంబురాశి 
శ్రీపాద విచలిత క్షీరాంబురాశి 
శ్రీ పీఠ సంవర్థినీ డోలాసురమర్దినీ  
శ్రీ పీఠ సంవర్థినీ డోలాసురమర్దినీ
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మిదేవి  
 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

తకధిమి తకధిమి తకఝణు 
తకధిమి తకధిమి తకఝణు తా..
తకఝణు తకధిమి 
తకఝుణు తకధిమి తోం..

ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే 
ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే 
శుకశౌనకాది వ్యాస వాల్మీకి
మునిజన పూజిత శుభచరణే
 
శుకశౌనకాది వ్యాస వాల్మీకి
మునిజన పూజిత శుభచరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే
తక తధీం ధీంత 
సరస సాహిత్య తకిట ధిమి స్వరస సంగీత 
తకఝణుత తధిమిత స్తన యుగళే తకఝణుత
వరదే అక్షర రూపిణే
శారదే దేవి

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 

వింధ్యాటవీ వాసినే
యోగ సంధ్యా సముద్భాసినే 
సింహాసన స్థాయినే
దుష్టహర రంహక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే 
సర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే
హే విలంబిత కేశపాశినే 
మహిష మర్దన శీల మహిత గర్జనలోల
భయద నర్తన కేళికే కాళికే
దుర్గమాగమ దుర్గవాసినే దుర్గేదేవి

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.