మంగళవారం, ఏప్రిల్ 15, 2014

శ్రీ రామ నామాలు...

హనుమజ్జయంతి శుభాకాంక్షలు..
రమేష్ నాయుడి గారి సంగీత సారధ్యంలో సుశీలమ్మ గానం చేసిన ఈ "శ్రీరామ నామాలు" పాట సాంఘీక చిత్రం కోసం తీసినదైనా చిత్రీకరణ మధ్యలో కాస్తంత విసిగించినా వినడానికి మాత్రం ఒక దివ్యమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి. ఎంబెడ్ చేసిన వీడియో ఫోటోలతో చేసిన ప్రజంటేషన్ (మొదటిసారి మూవీమేకర్ నేర్చుకుని మరీ ఈ వీడియో చేసిచ్చిన ఓ ఫ్రెండ్ కు మెనీ థాంక్స్). ఈ పాట సినిమాలోని చిత్రీకరణ ఎలాఉందో చూడాలంటే వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటలో ఇక్కడ లేదా రాగా లో ఇక్కడ వినవచ్చు. మిత్రులందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.



చిత్రం : మీనా (1973)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : ఆరుద్ర
గానం : పి.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు..
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు
కోతిమూకలతో.. ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు
కోదండరామయ్య రణధీరుడు..రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు..
పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి.. 
 

సోమవారం, ఏప్రిల్ 14, 2014

అంతా రామ మయం...

చిన్ని కృష్ణయ్య లీలలు కథలు కథలుగా చెప్పుకుంటారు కానీ రాములవారి బాల్యం గురించి అంతగా వినిపించదు కదా, కానీ సీతా కళ్యాణం సినిమా కోసం చిత్రీకరించిన ఈ పాటలో చిన్నారి రామయ్య గురించీ, చిన్నారి సీతమ్మ గురించీ బాపూ గారు ముచ్చటగా చూపించారు. దశరథ మహారాజుకి కైకకీ అంతా రామమయమేనట జాబిల్లిని కోరిన రామయ్యని అమ్మ ఎలా బుజ్జగించిందో మీరే చూడండి. అంతేకాదు శివధనుస్సు గురించిన కథ కూడా ఆసక్తిగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సీతాకళ్యాణం (1976)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, పి.బి. శ్రీనివాస్‌, రామకృష్ణ, పి.సుశీల, వసంత

అంతా రామమయం, దశరథనృపతికి - అంతా రామమయం.
రాముని తోటిదె లోకం, రామునిపైనే ప్రాణం
రాముని పేరే వేదం - రూపే మోదం
పలుకులె మోహన గానం, 
కన్నది మాత్రం కౌసల్యయినా కైకే రాముని తల్లి, 
అరక్షణమైనా రాముని విడిచి బ్రతకదు రెండవ తల్లి, 

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

విద్దెము విద్దెములాడే రాముని ముద్దులు చూడాలి
ముద్దిమ్మంటే ముందుకు ఉరికే మురిపెం చూడాలి
అడిగినదేదో ఇవ్వకపోతే - అల్లరి చూడాలి
మరి పంతాలు పెట్టేవేళ మారాం చూడాలి
పట్టిన పంతం చూడాలి బెట్టూ బింకం చూడాలి
కోరిన కోరిక తీరేవేళ గోమును చూడాలి గోమును చూడాలి..
అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి
చంద్రుని చూచి నవ్వే యింకో చంద్రుని చూడాలి
రామచంద్రుని చూడాలి 

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

ఏదీ ఏదీ, ఇంతటి వరకూ యిచటే వున్నది
ఇంతలో ఏమైనదమ్మా, ఏదీ ఏదీ ఏదీ - సీతమ్మ
చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మ, 
అవును అవును అందాల రాశి కామునిగన్న మాయమ్మ, 
అల్లన మెల్లన పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మ, 
ఘల్లు ఘల్లు గజ్జెలమోత చల్లని గానమె అవునమ్మా, 
అహరహము పూజాగృహమున హరి మనోహర విగ్రహమునె
బాల జానకి తనివితీరా చూసుకుంటుంది
ఆ నీలవర్ణుని పొందు ఎపుడని ఎదురుచూస్తుంది.

జానకి రాముల కలిపే విల్లు, జనకుని ఇంటనె ఉన్నది
ఆ యింటికి ఆ వింటికి, ఘనమగు కథ యొకటున్నది
తారకాసురుని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు
విపరీతమ్మగు వరములు పొంది, కట్టిరి త్రిపురములు
ఆ కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు
ఎదురు లేదని చెలరేగిరి - ఆ త్రిలోక కంటకులు
దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు
హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు
సర్వదేవమయ సర్వమహేశ్వర - శరణు శరణు శరణు
శత్రుభయంకర పాప లయంకర శరణు శరణు శరణు
పాహిమాం పాహిమాం పాహిమాం.. 
గర్వాంధులు ఆ త్రిపురాసురుల - కడతేర్ప నిదే అదను
పాహిమాం పాహిమాం పాహిమాం, 
పాహిమాం పాహిమాం పాహిమాం, 

మేరు పర్వతము వింటిబద్దగా ఆదిశేషుడే వింటి నారిగా, 
నలువరాణియే వింటి గంటగా నారాయణుడే వింటి శరముగా, 
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు, 
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు, 

చండ ప్రచండ అఖండ బలుండగు గండరగండడు శివుడు, 
కొండరథముపై కొండవింటితో దండిమగల చెండాడె.
దండిమగల చెండాడె.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

పైపాటలో దశరథ మహరాజుకి అంతా రామమయం అంటే ఈ పాటలో రామదాసుకి ఈ జగమంతా ఎలా రామమయంగా కనిపిస్తుందో ఎంత బాగా చెప్పారో చూడండి. రాఘవేంద్రరావు గారు తీసిన భక్తి సినిమా పాటల చిత్రీకరణలో కాస్త చక్కగా చిత్రీకరించారు అనిపించిన పాట శ్రీరామదాసు సినిమాలోని ఈ అంతా రామమయం పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.




చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామదాసు, పోతన
గానం : బాలు 

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు

అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. 
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ 
 

ఆదివారం, ఏప్రిల్ 13, 2014

రామ చంద్రుడితడు రఘువీరుడు

సుశీలమ్మ గానం చేసిన ఈ అన్నమయ్య కీర్తన నేను చాలా రోజులనుండి వింటూన్నాను కానీ ఇది ఏదో పాత సినిమాలోని పాట అనే భ్రమలోనే ఉన్నాను. ఈరోజు పబ్లిష్ చేద్దామని ప్రయత్నించినపుడు ఇది శ్రీ రామ గానామృతం అనే ప్రైవేట్ ఆల్బమ్ లోని పాట అని తెలిసింది. ఈ ఆల్బమ్ లో బాలు గారితో పాటు వీరు పాడిన మరికొన్ని మంచి పాటలు కూడా ఉన్నాయి. సంగీతం కె.వి.మహదేవన్ అని కొన్ని చోట్ల పుహళేంది అని ఉంది ఈ అల్బమ్ గురించి మరిన్ని వివరాలు తెలిసినవారు ఇక్కడ కామెంట్ రూపంలో పంచుకోగలరు. నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట మీరూ విని ఆస్వాదించండి.  ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ కీర్తనపై చక్కని విశ్లేషణను ఇక్కడ చదవండి.



ఆల్బమ్ : శ్రీ రామ గానామృతం
సంగీతం : పుహళేంది
సాహిత్యం : అన్నమయ్య 
గానం : పి.సుశీల 

రామచంద్రుడితడూ రఘువీరుడూ
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు


గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలి యిహపర దైవము

రామచంద్రుడితడూ రఘువీరుడూ
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడూ రఘువీరుడూ


పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము
నిరతి విభీషణుని పాలి నిధానము
గరిమ జనకు పాలి ఘన పారిజాతము

రామచంద్రుడితడు రఘువీరుడు

తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవెంకటాద్రి విభుడీతడు

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికీ
రామచంద్రుడితడు రఘువీరుడు 

 

శనివారం, ఏప్రిల్ 12, 2014

శ్రీ రఘురాం జయ రఘురాం

సాంఘీక చిత్రంలోనిదే అయినా మరో మంచి రాముల వారి పాట నాకు నచ్చినది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శాంతినివాసం (1960) 
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల(జూనియర్)
గానం : నాగయ్య/పిబిశ్రీనివాస్ ?, పి.సుశీల

శ్రీ రామ చ౦ద్రః ఆశ్రిత పారిజాతః
సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతా ముఖా౦బోరుహ చ౦చరీకః
నిర౦తర౦ మ౦గళమాతనోతూ..
ఆ..ఆ..ఆ...

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్


అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా ఆఆఆఆ
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా

త౦డ్రి మాటను నిలుపుటకైన
ధరలోమీరే దశరధరామ్ 

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్

వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి

వెలసి మాగృహ౦ శా౦తినివాస౦
సలుపవె శుభ గుణ శోభితరామ్

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్ 

 

శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

రామ నీల మేఘ శ్యామా..

రామ భక్త హనుమాన్ గానం చేసిన పాటకన్నా గొప్ప రాముని పాట ఏముంటుంది చెప్పండి కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలోని ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఈలపాట రఘురామయ్య గారి గళం నిజంగా ఆంజనేయుడే పాడుతున్నాడా అన్నట్లుంటుంది, మీరూ చూసీ విని తన్మయత్వాన్ని పొందండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : శ్రీరామాంజనేయ యుద్దం (1974)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : గబ్బిట వెంకటరావు
గానం : కే.రఘురామయ్య (ఈలపాట)

జయతు జయతు మంత్రం  
జన్మ సాఫల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
రామ్ రామ్ రామ్ 
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం

రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్

తల్లి తండ్రి గురువు నీవే  తోడు-నీడ  నీవే
తల్లి తండ్రి గురువు నీవే  తోడు-నీడ  నీవే
ధరణి ఎల్ల పాలన జేసె  పరంజ్యోతి వే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమా రాఘవ

రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ

నీల మేఘ శ్యామా


రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదమూ
రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదము
కోతి నైన జ్ఞానిని జేసె నీ నామము
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవ

రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ

నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్ 

 

గురువారం, ఏప్రిల్ 10, 2014

శ్రీ రామ జయ రామ...

బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమా కోసం ఆరుద్ర గారు రాయగా బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఈ పాట నాకు ఇష్టమైన రాముడి పాటలలో ముందు ఉంటుంది. మహదేవన్ గారి సంగీతం బాలమురళి గారి గాత్రం మనసును ఆనంద డోలికలూగిస్తాయి. కింద ఎంబెడ్ చేయబడినది పాట ప్లస్ ఫోటోలతో కూడిన ప్రజంటేషన్. సినిమాలో టైటిల్స్ కి నేపధ్యంగా వచ్చే ఈ పాట చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 



చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలమురళీకృష్ణ

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘు కులాన్మయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.

శ్రీరామ జయ రామ సీతారామా
శ్రీరామ జయ రామ సీతారామా
కారుణ్యధామా కమనీయనామా
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామా
నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా

శ్రీరామ జయ రామ సీతారామా

చరణాలు కొలిచే నగుమోము చూచే
చరణాలు కొలిచే నగుమోము చూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా

శ్రీరామ జయ రామ సీతా రామా
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామా

నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్యగరిమ

శ్రీరామ జయ రామ సీతారామా
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామా 
 

బుధవారం, ఏప్రిల్ 09, 2014

ఊరికే కొలను / రామయ తండ్రీ...

రాముల వారికోసం శబరి ఎంత ఆర్తిగా ఎదురు చూసిందో రామకథ తెలిసిన మనందరికీ తెలుసు కానీ తనతో పాటు ఆ వనంలోని ప్రకృతి కూడా రాములవారికోసం ఎలా ఎదురు చూస్తుందో ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాత్రమే ఊహించగలరేమో. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం చిత్రం కోసం వారు రాసిన ఈ పాట ఎంత బాగుందో చూడండి. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు లేదా ఎంబెడ్ చేయబడిన సినిమాను 1h:39m:15s వరకూ ఫార్వర్డ్ చేసి చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : సుశీల

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది

అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో

అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ
నీల మేఘమోహనము నీ మంగళ రూపము

కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు.. 
పుట్ట తేనె రసాలు
దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని
ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా...
విందుగా అందీయనా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే సినిమాలో గుహుడు పాడే ఈ పాట తెలియని తెలుగువారుండరేమో కదా, రాముడి పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట. గుహుడు అమాయకమైన మాటలతో శ్రీరాముని కీర్తించడాన్ని కొసరాజు గారు భలే రాశారు. చిత్రీకరణ సైతం నాకు చాలా ఇష్టం చివరిలో పడవవేగానికి తుళ్ళిపడిన జానకమ్మని సముదాయించి రాములవారు నిదానించమని గుహుడికి సైగ చేయడం ఆపై తాళం మార్చి నిదానంగా హైలేస్సా అంటూ తెడ్డువేయడం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

 
 
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, కోరస్

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి

తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి

ఆగు బాబూ ఆగు!
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ
నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నాకు తెలుసులే!
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట

రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి

హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా

హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా ఓహోహో..ఓఓఓఓ

హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా 
 
  

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

రాముని అవతారం...

భూకైలాస్ సినిమాలో రామాయాణాన్నంతటిని ఒక్క పాటలో గానం చేసిన ఈ పాట అద్భుతంగా ఉంటుంది ఘంటసాల గారి స్వరంలో పాట వింటూ మైమరచిపోతామనుకుంటే చిత్రీకరణ సైతం పరమాద్బుతంగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

ఈ రోజు రామనవమి సంధర్బంగా మిత్రులందరకూ హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం మీ పై సదా ఉండాలని కోరుకుంటున్నాను. రామనవమికి వేసే పందిళ్ళు గుర్తున్నాయా... ఒకప్పటంత కాకపోయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదా. వాటిని గుర్తుచేసుకుంటూ ఈరోజునుండి తొమ్మిది రోజుల పాటు ఈ బ్లాగ్ లో రాముని పాటలు తలచుకుందాం.



చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
సాహిత్యం :  సముద్రాల (సీనియర్)
గానం :  ఘంటసాల

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ...
రాముని అవతారం... రవికులసోముని అవతారం....

రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం

సుజనజనావన ధర్మాకారం.. .దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం

దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా
 
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
చదువులునేరుచు మిషచేత... చాపముదాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట ... యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము

అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం ...

రాముని అవతారం...రవికులసోముని అవతారం

  
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యాసంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో...
దనుజులు కలగను సుఖగోపురమో...

విరిగెను మిథిలానగరమునా
 
రాముని అవతారం రవికులసోముని అవతారం
 
కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం... లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం... పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం... పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం... గురుజనసేవకు ఆదేశం
 
రాముని అవతారం రవికులసోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింకా... 

అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా... 

హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం... ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత...
సమయును పరసతిపై మమకారం...వెలయును ధర్మవిచారం
 
రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం 

 

సోమవారం, ఏప్రిల్ 07, 2014

మంచు కొండల్లోన చంద్రమా...

బహుముఖ ప్రజ్ఞాశీలి భానుమతి గారినీ, కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన జానకమ్మగారిని మినహాయిస్తే, తెలుగులో సంగీత దర్శకత్వాన్నే కెరీర్ గా ఎంచుకున్న తొలి మహిళగా ప్రత్యేకతను సంతరించుకున్న ఎం.ఎం.శ్రీలేఖ గారి మొదటి సినిమా తాజ్ మహల్ లో నాకు నచ్చిన పాట ఇది అప్పట్లో చాలా వినేవాడ్ని. చాలా సింపుల్ ఆర్కెస్ట్రేషన్ ఆహ్లాదకరమైన బాణి ఈ పాట సొంతం మీరూ ఆస్వాదించండి. ఈ పాటలు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : తాజ్ మహల్ (1995)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు, చిత్ర

మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా
అందమంత అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం
కొత్తదాహంలో వింతమోహంలో
మనదిలే సంబరం

పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా
వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం

ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు

నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని
ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంటా ఏకం కమ్మంటా 
వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని
తరగని ప్రేమలలో


పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో


వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే
నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి

చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలుదాటిన
అల్లరి ప్రేమలలో

మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో

పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం 
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం 

 

ఆదివారం, ఏప్రిల్ 06, 2014

చందమామ కధలో చదివా...

చంద్రబోస్ గారి సాహిత్యం, కీరవాణి గారి సంగీతం, సునీత గాత్రం వెరసి ఇలా ఓ చక్కని పాటగా రూపుదిద్దుకుంది. అచ్చంగా కలల రాకుమారుడి గురించి కలగనే సగటు పదారణాల తెలుగు పడుచు పాడినట్లే ఉంటుందీ పాట. నాకు చాలా ఇష్టం మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.




చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు(2003)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కళ్యాణి మాలిక్, సునీత

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోనా.. రతనాల తోటలోన
వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన
విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా

అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో


నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవి కి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.