గురువారం, ఫిబ్రవరి 13, 2014

నాలో ఊహలకు / నాలో నేనేనా..

నిన్న తొంభైలలో పాటలు విన్నారు కదా ఇంకో ఇరవై ఏళ్ళు ముందుకు వస్తే ప్రస్తుత కాలంలో వస్తున్న పాటలలో ఈ రెండు పాటలూ చాలా బాగుంటాయ్. ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన కె.ఎమ్.రాధాకృష్ణ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటకు ఆషా భోంస్లే స్వరం ప్లస్ తన ఉచ్చారణే ఒక సొగసును అద్దాయి అనిపిస్తుంది. తెలుగు భాషాప్రేమికులకు ఈ మాటలు మింగుడు పడకపోవచ్చు కానీ కాజల్ కు ఈ వైవిధ్యమైన స్వరంతో ఇలా పాడడం చాలా చక్కగా సూట్ అయిందని నా అభిప్రాయం. ఈపాట చిత్రీకరణ కూడా కృష్ణవంశీ శైలిలో చాలాబాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ 
సాహిత్యం : అనంత శ్రీరామ్ 
గానం : ఆషా భోంస్లే, కె.ఎం. రాధాకృష్ణన్

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

ఆ ఆ ఆ ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మణిశర్మ స్వరసారధ్యంలో అభిరుచి ఉన్న దర్శకుడు చైతన్య దర్శకత్వంలో వచ్చిన బాణం చిత్రంలోని "నాలో నేనేనా.." పాట కొత్తపాటలలో ది బెస్ట్ పాట, చాలా బాగుంటుంది. సోలో లాగా అనిపించే ఈ డ్యూయెట్ ని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఈ పాట గురించి గతంలో సినిమా విడుదలైనపుడు నేను రాసుకున్న టపా ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : బాణం(2009)
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

ఔనూ కాదు తడబాటునీ.. 
అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ.. 
పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..


నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ 
చిగురై పోనీ శిశిరాన్నీ..
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలూ..
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా..
మనమే సాక్ష్యం... మాటే మంత్రం
ప్రేమే.. బంధం..

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

నిన్న ఈ కలవరింత / ఊసులాడే ఒక జాబిలట

నిన్న ఒకప్పటి ప్రేమగీతాలెలా ఉండేవో విన్నారు కదా.. కొన్నేళ్ళు ముందుకు వస్తే డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు ఈ నెలరోజుల్లోనూ చాలా వినేశాం కనుక తొంభైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో ఈ రోజు చూద్దాం. ఈ అమ్మాయికి కొత్త కలవరింత ఏదో కలిగిందట దానినే ప్రేమ అని ఎలా గుర్తించిందో మీరే చూడండి. రహమాన్ కెరీర్ మొదట్లో స్వరపరచిన ఈ పద్మవ్యూహం సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి. ప్రేమ గురించి చెప్పే ఈ పాట మరి కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హారిక

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...

దైవం ఉందంటినీ అమ్మనెరిగాకనే.. 
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం.. 
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే 
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే 
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా... 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే బొత్తిగా నెమ్మదస్తుడు, మౌనంగా ప్రేయసిని ఆరాధించడమే తప్ప ఎన్నడూ ఆమెకు కూడా తనమనసులో మాట చెప్పి ఎరుగడు. అలాటిది స్టేజ్ పై పాట పాడవలసిన అవసరం వచ్చింది, అంతలో ఎదురుగా ప్రేయసి సాక్షత్కరించింది ఇకనేం గుండెలో గూడుకట్టుకున్న ప్రేమనంతా పాటగా మార్చి ప్రేయసి మనసునే కాదు స్టూడెంట్స్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇళయరాజా గారి స్వరకల్పనలో రాజశ్రీ గారు రాసిన ఈ పాట అప్పట్లో కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన పాట, మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం: హృదయం (1992)  
 సంగీతం : ఇళయరాజా
 సాహిత్యం :రాజశ్రీ
గానం : బాలు

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట 

 ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట


అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేనూ జపించేను రోజూ
ననే చూసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!
 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

 
నాలో నువు రేగే నీ పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో..


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం!


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

అందాలే చిందే చెలి రూపం నా కోసం

మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

వినిపించని రాగాలే / నీలి మేఘమాలవో

తరాలు ఎన్ని మారినా సినిమా తీయడంలో నైపుణ్యత ఎంత మారినా ఎన్ని కొత్త టెక్నాలజీలు అందుబాటులో కొచ్చినా మారనిది ప్రేమ ఒకటే. నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు ఆ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కొత్త ప్రేమకథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఒకనాటి ప్రేమ గీతాలు అంటే మరీ సినిమా మొదలైన ముప్పై, నలభైలలో కాకున్నా అరవైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో మచ్చుకి ఈ రెండు పాటలలో చూడండి. "వినిపించని రాగాలే కనిపించని అందాలే" అంటూ కథానాయిక ప్రేమ గురించి ఎంత అందంగా పాడుతుందో మీరూ చూసి విని ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం:  సుశీల

ఓహో..ఓ...ఓ...ఆహాఅ..ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే.. ఏ ఏ...

తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే ఏ ఏ...
వలపే వసంతములా పులకించి పూచినది
వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే..ఏఏ...
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
 
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే ఏఏ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఇది ఒక ప్రియుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాడుతున్న మధురగీతం. ఫేమస్ "చౌద్వీకా చాంద్" కు తెలుగు రీమేక్, సంగీతం సాలూరు వారో రాజన్-నాగేంద్ర గారో చిన్న సంశయం ఉంది ఐతే పి.బి.శ్రీనివాస్ గారి గళం మాత్రం చాలా చాలా చక్కగా అమరింది. చిత్రీకరణ కాస్త నిరాశపరిచింది కానీ వినడానికి మాత్ర్రం ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మదనకామరాజు కథ(1962)
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
సంగీతం : సాలూరు రాజేశ్వర రావు / రాజన్-నాగేంద్ర
గానం : పీ బీ శ్రీనివాస్

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

 నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో

నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
 
నీలి మేఘమాలవో..ఓఓ...
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
 
నీలి మేఘమాలవో..ఓఓ..

రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమే జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో...

సోమవారం, ఫిబ్రవరి 10, 2014

ఓంనమః నయన శ్రుతులకు

ఈ పాట దీనికి వచ్చే లీడ్ సీన్స్ నాకు మణిరత్నంపై అభిమానం కొండంత పెరిగిపోవడానికి గల కారణాలలో ఒకటి. ఈ సీన్స్ లో పొగమంచుని తను ఉపయోగించుకున్న తీరు అద్భుతం, ఐలవ్యూ చెప్పిన తర్వాత వచ్చే ఇళయరాజా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం, నిద్రపోదామని ప్రయత్నించినా కూడా పొగమంచులా తన ఆలోచనలు గీతని ఎలా కమ్ముకున్నాయో అవి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూపించడం అద్భుతం. 

తరువాత సీన్ లో గీత తలుపు తీసుకుని ఎంటర్ అయినపుడు తను పిలవకుండానే మెత్తగా తాకిన పొగమంచు చల్లదనానికి నాగ్ వెనకకి తిరిగి చూడడం అద్భుతం, గుండె కొట్టుకునే శబ్దంతో శ్రుతిచేసి పాటని ప్రారంభించడం అద్భుతం, వేటూరి గారి సాహిత్యం అద్భుతం. ఇన్ని అద్భుతాలు కలిసిన ఆ సీన్ ప్లస్ పాట మీరుకూడా చూసేయండి మరి. 

ఎంబెడ్ చేసిన వీడియోలో ముందు చెప్పిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, కేవలం పాట మాత్రమే చూడాలంటే కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ లేదా చిమటాలో ఇక్కడ వినండి.



చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి

ఓంనమః నయన శ్రుతులకు
ఓంనమః హృదయ లయలకు ఓం...
ఓంనమః అధర జతులకు
ఓంనమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో... ఓఓఓఓ..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం...

ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగా మారనా..
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి...ఓం..

ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం....
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో..

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

సుందరి నీవూ.. సుందరుడేనూ..

ఇళయరాజా స్వర పరచిన మరో అందమైన మెలోడి ఇది. మైఖేల్ మదన కామరాజు సినిమా కామెడీ ప్రధానమే అయినా పాటలు కూడా బాగుంటాయ్... మెలోడియస్ గా సాగే ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఎంబెడెడ్ వీడియో టైటిల్ చూసి గాభరా పడకండి అది తెలుగు ఆడియో ఉన్న వీడియోనే. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మైఖెల్ మదన కామ రాజు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ   
గానం : బాలు, చిత్ర

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

మాటలకందని రూపం వర్ణించలేనీ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బంధం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ..

సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం

ఆమని పండుగ చేసె స్వప్నాల లోకము విరిసె
ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసే మనకొక లోకం..ఆ..ఆ..

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

శనివారం, ఫిబ్రవరి 08, 2014

సరికొత్త చీర ఊహించినాను..

Painting by Rajdev
పెళ్ళిపుస్తకం సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూసి ఉంటానో ఇంకా ముందు ముందు ఎన్నిసార్లు చూడబోతానో లెక్కేలేదు. నా టీనేజ్ చివరిదశలో చూశానేమో మనసులో అలా ముద్రించుకు పోయింది. బుడుగు తప్ప ముళ్ళపూడి వారి సాహిత్యం గురించి పెద్దగా పరిచయంలేని సమయంలో బాపురమణలిద్దరినీ దేవుళ్ళుగా ఆరాధించవచ్చు అని అనిపించిన సినిమా. ఇందులో ఇల్లు, పెరడు, ఆ మొక్కల మధ్య అరుగు నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను.

కొత్త దంపతులకి ఇవ్వగలిగిన అపురూపమైన బహుమతులలో ఒకటిగా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన సినిమా. ఈ సినిమా విడుదలయ్యాక ఇందులోని "శ్రీరస్తూ శుభమస్తూ" అన్న పాట నేపధ్యంగా వాడని పెళ్ళి వీడియో ఆంధ్రాలో లేదనడం అతిశయోక్తి కాదు. ఇందులోని "సరికొత్త చీర" పాట దానికి ముందు సన్నివేశంలో హీరో పెళ్ళి గురించి చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం. మీరూ ఆస్వాదించండి. పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 
"అమ్ముకుట్టీ.. నీకు కోపం వచ్చింది కన్నీళ్ళు కదిలాయ్.. నాకు గర్వంగా ఉంది, ఇంత గట్టి పెళ్ళాం దొరికినందుకు. ఇంత మంచి ఫ్రెండ్ ని కాదని నేను మరో పిల్లకేసి చూసినా... ఒకవేళ చూస్తే నవ్వితే షేక్ హ్యాండిస్తే.. అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలియదా.. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమనీ చీటికీ మాటికి పైకి చెప్పుకుంటామా.. 

అమ్ముకుట్టీ.. పెళ్ళంటే పాలల్లో పాలలా కలిసిపోవడం పంచదారలా కరిగిపోవడం పెళ్ళంటే నమ్మకం, ఆ నమ్మకం తిరుగులేనిది.. అదీ దీపం లాంటిది దానిమీద అనుమానపు నీడలు పడవు... అనుమానం ఉన్నచోట నారాయణ అన్నా బూతులా వినిపిస్తుంది నమ్మకం ఉన్న చోట బూతుకూడా నారాయణ అన్నట్లే వినిపిస్తుంది..."
--ముళ్ళపూడి వెంకట రమణ. 



చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

సరికొత్త చీర ఊహించినాను 
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక 
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత...


ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు 
ముల్లూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు 
అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కలబోశా... 
నీ కొంగుకు చెంగున ముడివేస్తా
ఈ అందాలన్నీ కలబోశా... 
నీ కొంగుకు చెంగున ముడివేస్తా

ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత

చురచుర చూపులూ ఒకమారు 
నీ చిరుచిరు నవ్వులూ ఒకమారు
మూతివిరుపులూ ఒకమారు 
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే 
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కళనున్నా మాబాగే 
ఈ చీర విశేషం అల్లాగే

సరికొత్త చీర ఊహించినాను 
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక 
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
హ...నా.. వన్నెలరాశికీ.. సిరిజో..త...

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

తీగనై మల్లెలూ పూచినా వేళ..

కాస్త విషాద ఛాయలు కనిపించినా కూడా ఇళయరాజాగారు కంపోజ్ చేసిన ఈ అందమైన మెలోడీ నాకు చాలా ఇష్టమైన ప్రేమ గీతాలలో ఒకటి. మీరూ ఆస్వాదించండి ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.


చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు, జానకి

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా చేయి చేయి కలిసేనా

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
 

గురువారం, ఫిబ్రవరి 06, 2014

ఏదో తెలియని బంధమిది

ఒకప్పటి గీత రచయితలు డబ్బింగ్ పాటలలో కూడా అందమైన తెలుగు పదాలు ఉపయోగించి అద్భుతంగా రాసేవారు, ఇళయరాజా, మణిరత్నం అలా రాయించుకునే వారు కానీ ఈ మధ్య పాటలలో లిప్ సింక్ అండ్ ట్యూన్ పై తప్ప తెలుగు మాటల గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లుగా కనిపించట్లేదు. నాయకుడు లోని ఈ పాట చూడండి, విన్నవాళ్ళెవరికైనా ఇది ఒక డబ్బింగ్ గీతమని అనిపించనే అనిపించదు. ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన మరో మేలిముత్యం ఇది, మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి / రాజశ్రీ ?
గానం: బాలు, శైలజ

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది

పూజకు నోచని పువ్వును కోరి
వలచిన స్వామివి నువ్వేలే...
రూపం లేని అనురాగానికి
ఊపిరి నీ చిరు నవ్వేలే...
కోవెల లేనీ....
కోవెల లేని దేవుడవు...
గుండెల గుడిలో వెలిశావు...ఊ..
పలికే జీవన సంగీతానికి
వలపుల స్వరమై ఒదిగావు...
తనువూ మనసూ ఇక నీవే...

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది

వేసవి దారుల వేసటలోన
వెన్నెల తోడై కలిశావు...
పూచే మల్లెల తీగకు నేడు
పందిరి నీవై నిలిచావు...
ఆశలు రాలే...ఏ..ఏ
ఆశలు రాలే శిశిరంలో...ఓ..
ఆమని నీవై వెలిశావు...ఊ..
ఆలుమగల అద్వైతానికి
అర్థం నీవై నిలిచావు...
తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది హా..ఆ..

బుధవారం, ఫిబ్రవరి 05, 2014

వయ్యారి గోదారమ్మ

వంశీ ఇళయరాజా ల మరో మాయాజాలం ప్రేమించు పెళ్ళాడు చిత్రంలోని ఈ "వయ్యారి గోదారమ్మ" పాట, నాకు చాలా ఇష్టమైన పాట.. ఈ పాట ప్రారంభంలో బాలుగారి నవ్వు చాలా బాగుంటుంది. వీడియో కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆహాహాహా.. ఉసురుకారాదా.. ఆహా
మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా 

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే హా..ఆఅ
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే హా..ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

ఆ కనులలో కలల నా చెలీ

ఇళయరాజా వంశీల కలయికలో రూపుదిద్దుకున్న మరో అద్భుతమైన పాట... నాకు చాలా చాలా ఇష్టమైన పాట తన చెలిగురించి కథానాయకుడు సినారే గారి సాయంతో వర్ణించే తీరు దానిని చిత్రీకరించిన వైనం అద్భుతం. మీరూ చూసి ఆనందించండి ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా  
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

ఆఆ...ఆఆఆఆ..ఆఅ...ఆఆ ఆఆ ఆఆ...
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై 

దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక

ఆ..ఆఅ.ఆఅ.ఆ..
దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు
తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట 
తకిట తకిట తకిట తకధిమి 

నిదురించు వేళ ..దసనిస దసనిస దనిదనిమ
హృదయాంచలాన..ఆ..ఆ..ఆ..ఆ
అలగా పొంగెను నీ భంగిమ..గగసనిస.
అది రూపొందిన స్వర మధురిమ
సనిదనిస..
ఆ రాచ నడక రాయంచ కెరుక
ఆ రాచ నడక రాయంచ కెరుక
ప్రతి అడుగూ శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన

ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

మగసా.. ఆ.ఆఆ. 
సనిదమగ మగసా.. ఆ.ఆఆఅ.
గసనిదమ దనిసా.. ఆఆఆఅ.. మదని.. ఆఆఆ.. 
సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని

నీ రాకతోనె ఆ.ఆఆఅ ఆఅ . 
ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా..
అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ..ఆఆ
మబ్బులు తేలెను పలువన్నెలై..ఆఆఆ
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన

ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.