ఆదివారం, అక్టోబర్ 20, 2019

ఎంకమ్మా... ఓ నా ఎంకమ్మా..

శ్రీదేవి అనిల్ కపూర్ ల చాందినీ పాటకు పేరడీగా వచ్చిన ఈ బ్రహ్మానందం పాటను ఈ రోజు తలచుకుని నవ్వుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళామా మజాకా (1993)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సాహితి
గానం : మనో , శైలజ

ఎంకమ్మా .. ఓ నా ఎంకమ్మా..
ఏందమ్మో ఆ నడకా
పడిచస్తానే నీ ఎనకా
నీకూ నాకూ బిగుసుకు పోయే లింకమ్మో
ఎంకమ్మా ఓ నా ఎంకమ్మా..
ఏందమ్మో ఆ నడకా
పడిచస్తానే నీ ఎనకా
నీకూ నాకూ బిగుసుకు పోయే లింకమ్మో
ఎంకమ్మా ఓ నా ఎంకమ్మా..

ఓ ఎంకమ్మా.. ఓ నా ఎంకమ్మో..

ఏయ్ మా అయ్యకి కాబోయే అల్లుడూ
అయ్యాకే ఈ గిల్లుడూ..

ఆడాడో నువు గిల్లితే
ఏడేడో జిల్ జిల్లురా
అలానే ఓ గిల్లెయ్ మాకా ఆగాగు
చీటికి మాటికి గిల్లావో
గుంజీలే తప్పవులే
గుంజీలే తప్పవులే
గుంజీళ్ళే వద్దమ్మా
గిల్లికజ్జాలే ముద్దమ్మా
వంటరి తుంటరి వయసే ఆగదే

ఎంకమ్మో ఓ నా ఎంకమ్మా

గుండెలకే గురి చూడకూ
చూపులు సూటిగ నాటకు
చెప్పేది నీకే.. ఏటీ.. చూపు తిప్పుకో..
చలిగా ఉన్నది మావయ్యో
దుప్పటి నువ్వే కావయ్యో
దుప్పటి నువ్వే కావయ్యో . ఎయ్
దుప్పటిని నేనేలే
ఎప్పటికీ నువు నాలోనే
నువ్వు నేను ప్రేమకి లింకమ్మో

ఎంకమ్మా ఓ నా ఎంకమ్మా..
ఏందమ్మో ఆ నడకా
పడిచస్తానే నీ ఎనకా
నీకూ నాకూ బిగుసుకు పోయే లింకమ్మో
ఎంకమ్మా ఓ నా ఎంకమ్మా..
ఎంకినీ నేనే నీ ఎంకిని
ఎంకులు.. ఓ నా ఎంకులు..
ఎంకినీ నేనే నీ ఎంకిని 


శనివారం, అక్టోబర్ 19, 2019

ఆడ్డవే మయూరే...

చెల్లెలి కాపురం చిత్రంలోని "చరణ కింకిణులు" పాటకు పేరడీగా ఇంకా చెప్పాలంటే సంగీతకారులమని చెప్పుకునే కొందరు నాదబ్రహ్మలు పాటలను ఎలా ఖూనీ చేస్తారో చూపిస్తూ చిత్రీకరించిన శుభాకాంక్షలు సినిమాలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభాకాంక్షలు (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం :
గానం : మనో 

చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన
కర్ర కంకణము గల్లలాడగా
ఇనీల కచభర ఇలాస బంధుర
తన్నులతిక చంచలించిపోగా
ఆడ్డవే మయూర్రే..
నటనమాడ్డవే మయ్యూర్రేయ్..
నీ కులుకులు గని నా పలుకులిరవ
నీ నటనలు గని నవ కవిత ఎలవగా
ఆడవే మయూరె.. మయూరె..మయూరే..

పాల నేత్ర సంప్రభవ జ్వాలలు
ప్రశవ శరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి
దుఃఖితమతియై రోధించగా

హిమగిరీంధ్ర
శిఖరాగ్ర తాండవత్
ప్రమధ గణము కనిపించగా
ప్రమద నాద కర
బాంకజ భ్రాంకుత
ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల
సంచలిత భయంకర
జలదరార్భకుల
చలిత దిక్దటుల
చకిత దిక్కరుల
వికృత ఘీంకృతుల
సహస్ర ఫణి
సంచలిత భూకృతుల

కళ్ళలోన
కనుబొమ్మలోన
అదరాలి లోన
బెదరాలి పైన
గళ సీమ లోన
కటి దోమ లోన
కరయుగములోన
నీ మొగములోన
నీ ఒంటిలోని
ప్రతి ఇంచి లోన
అనంత ఇదములు
అభినయించి
ఇక ఆడ్డవే.. ఆడ్డవే.. ఆడ్డవే...

 

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ఓ సీతా నీవంటి స్వీటు...

మాయాబజార్ లో రేలంగి గారి మీద చిత్రీకరించిన "సుందరి నీవంటి" పాటకు పేరడీగా సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో వచ్చిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓ సీతా హల్లో మై సీతా చెలి
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఊరంత సెర్చిన మాయే కదా
నన్నూరించి గిల్లేది నీవే కదా.
ఓ సీతా చెలి యు సీతా హల్లో మై సీతా
నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

సీతా శారీ పేరట్టువో ఆంధ్రా ఫేమస్ పెసరట్టువో
ఐసు నేను కొట్టేవేళా క్రీమై పోయే నా ప్రేమే
ట్వింకిల్ ట్వింకిల్ స్టారువో చందా అంకుల్ లైటువో
సైటు నీకు కొట్టే వేళా నైటైపోయే డే టైమే
ఓ మిస్సా ఓ యస్సు అనరాదా
అదిచేదా ఓ కిస్సు కొడితే 
నే యుఎస్ లో పడతానే

ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

ఐసా పైసా తేల్చుకో వీసా తెచ్చి ఇచ్చుకో
వాషింగ్టన్ను తాలూకాకే తాశీల్దారైపోతానే
వైటు హౌసు తోటలో నైటు క్వీను కోటలో
ఎంకి పాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా
ఉసిమీద ఉన్నానే శశిరేఖా అన్నానే
రేలంగి మోడల్లో రెచ్చి పోతున్నానే

ఓ సీతా హల్లో మై సీతా చెలి
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఓ సీతా నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
ఊరంత సెర్చిన మాయే కదా
నన్నూరించి గిల్లేది నీవే కదా.
ఓ సీతా చెలి యు సీతా హల్లో మై సీతా
నీవంటి స్వీటు స్వరూపము
వేర్వేరు సెర్చిన నోయే కదా.
వేర్వేరు సెర్చిన నోయే కదా.

గురువారం, అక్టోబర్ 17, 2019

జగమే మాయ బ్రతుకే మాయ...

జగమే మాయ అన్న మాట వినగానే దేవదాసు సినిమాలో ఘంటసాల గారు పాడిన ఈ పాట గుర్తొస్తుంది. దీనికి పారడీగా సంసారం ఒక చదరంగం చిత్రంలో బాలు గారు పాడిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంసారం ఒక చదరంగం (1987)
సంగీతం : కె. చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా

ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు
ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా
పాశమనే ఎదముల్లూ యమబాధమ్మా
ఆశ పాశాలు మాసే వర్ణాలే
కలగంటే తప్పు నీదేనమ్మా ఈ బాదేనమ్మా

భార్యా పుత్రులనే వలలో పడకోయి
కాసులకే నీ సుతుడు అంకితమోయి
కాసులకే నీ సుతుడు అంకితమోయి

నాది నాది అనే బంధం వలదోయి
నీ గుటకే నిర్మాలానందమోయ్
నిముషమానంద మోయ్

నీతులు చెబుతుంటే కూతురు వినదోయి
తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
కట్టే బట్టైన మాటే వినదోయి
కాబట్టే మందు కొట్టానోయి జో కొట్టానోయి

ఇల్లూ వాకిలీ పిల్లా మేకని
బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి
శ్రమపడితే మిగిలేది బూటకమోయి
బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ


బుధవారం, అక్టోబర్ 16, 2019

మాయదారి వాన...

బంగారు మొగుడు సినిమాలోని ఒక సరదా పేరడీ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేడా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బంగారు మొగుడు (1994)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : ??
గానం : ??

మాయదారి వానజల్లు ఈడనో జెప్పలేను
ఆడనో జెప్పలేను యాడనో కొట్టినాదిరా..
చమత్కారి ప్రేమ ముల్లు ఈడనో జెప్పలేను
ఆడనో జెప్పలేను యాడనో గుచ్చినాదిరా..
బులినాయుడో బుగ్గందుకోరా
జల్సాకునువ్ దంచిప్పుడే మల్లా పిల్లడా

లటుకు లటుకు లటకం చేసేద్దాం
చటుకు చటుకు పిటకం పెట్టేద్దాం
ఎగుడు దిగుడు గగనం చూసేద్దాం సొగసరి
చిటుకు చిటుకు చించిం చీకట్లో
హటుకు బుటుకు ట్రంపెట్ మ్రోగిద్దం
ఉడుకు వయసు భరతం పట్టేద్దాం పదమరి
నీ కత్తెర చూపుల ఊపులో
నీ అత్తరు పూసిన పైటలో
పొంగెత్తిన ఆశలు తీరని గుణవతి రంపంపం
చిటుకు చిటుకు చించిం చీకట్లో
లటుకు లటుకు లటకం చేసేద్దాం

మావలూ మావలూ మావలూ సయ్యా సైసై
మావలు సయ్యా సై మరదలు సయ్యా సై
మావలు సయ్యా సై మరదలు సయ్యా సై
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
మావలు సయ్యా సై మరదలు సయ్యా సై
రింబోలా రింబోలా రింబోలా
బెంగేలా బెంగేలా బెంగేలా

కాదనకు అది లేదనకు బులిపించు నన్ను భామ
కాదనను అది లెదనను విడలేదు చిక్కు మామ
వెన్నెలలో విరిసిన మల్లెలలో
వెన్నెలలో విరిసిన మల్లెలలో
మొగ్గగనీ మోవి గని మోజు పడిన వేళలో
రమ్మనకోయ్ అది ఇమ్మనకోయ్ ఓద్దొద్దు నాటు ప్రేమ
కాదనకు అది లేదనకు బులిపించు నన్ను భామ

హోయిరబ్బా హోయిరబ్బా
ఈ పూటకి నేనే మేస్తిరీ.. అతికిస్తా లవ్ పాలస్త్రీ
ప్రేమా గీమా తెలియని వాళ్ళకి ఖబడ్దారు నేనె
నేనే ముఠామేస్తిరి నేనే జమాజంగిరి
చటాక్ చటాక్ ఛా.. 


మంగళవారం, అక్టోబర్ 15, 2019

వారెవ్వ ఏమి...

ఎవడిగోల వాడిది చిత్రంలోని ఒక పేరడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిచిత్రం : ఎవడిగోల వాడిది (2005)
సంగీతం : కమలాకర్ 
సాహిత్యం : ??
గానం : ??

వారెవ్వ ఏమి ఫిగరు
ఏపిల్ పండల్లె ఉంది కలరు
గ్లామర్ లో నీ సాటి లేరు
నిన్ను చూస్తేనే హాలంత అదురు

రమ్యను స్టారును చేసిన దర్శకేంద్రునివా
రంభను పరిచయం చేసిన ఈవీవా
ఏవరనుకోనూ నువ్వు ఎవరనుకోనూ
సర్వం నీకూ సమర్పించుకోనా

తూనీగ తూనీగ ఆ వైపుకు వెళ్తున్నావా రావే నా వంక
ఆ వంక వెళ్ళొద్దూ ఆ మాటలు నమ్మద్దూ
ఎగరేసుకు పోతాడే నువ్వు దెబ్బై పోతావే

భద్రం బీకేర్ ఫుల్ ర ఓ కొడకా
భర్తగ మారరా నో అనకా
శాదీ వద్దంటే గనుక
ఖూనీ చేస్తాడుర కనక

ఎదట ఎవ్వడున్నా భయపడను
మనసులోని మాట చెబుతాను
ప్రేమలేని చోటా పెళ్ళెందుకు దండగ
చంచంచం చంచం
ఉన్న మాట వినరా బక్కన్నా
బిపి పెంచుకోడం తగదన్నా
పెళ్ళమంటే నాకు ఈ పిల్లే ష్యూరుగా
మీ పాపకు నాకు కుదరదు
నీ బలవంతం ఇక జరగదు
మాలవ్వుకు నువ్వు అడ్డురాకు
ఇంకా రంపంపం

గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు
నాకు తగ్గ సైజులో ఉంటాడూ
మీసముండదు రోషముండదు
ఏమి తిట్టినా తనకి గుర్తుండదు
బెల్ బోయ్.. హైట్ లో వెయిట్ లో
నాకు తగ్గ జోడులే
బెల్ బోయ్... ఓయ్...

నాకొక పెళ్ళాం కావాలిరా
ఈ ఫ్యాక్షన్ పోరీ బావుందిరా
నీ ఫిగరుని చూస్తే నాకు మోజే కదా
నీ సైజుని చూస్తే నాకు లూజె కదా
నాకు నువ్వే కావాలె.

జీవితమంటే పోరాటం చూసేస్తాలే నీ అంతం
నా పేరే బక్కన్నా కడపలొ నేనే పెద్దన్నా
నువ్వు రావే రెడ్డెమ్మా పెడతా నీ ఖర్మా

కొడితే కొడతానురా తొడకొడతాను
పడితే పడతానురా కత్తి పడతాను
బండనైనా గానీ నా ముందు నత్తింగూ
కాదంటేనే నేను చేస్తాను ఫైటింగూ
గన్ను గిన్ను అక్కర్లేదు చెయ్యి చాలురా

ఎవరికోసం... దేనికోసం.. ఈ తొడలు కొట్టడం
ఈ తలలు నరకడం ఈ వేట కత్తులు ఈ నాటుబాంబులు
ఎవరి కోసం ఎవరికోసం దేని కోసం

నువ్వు తొలిసారిగా కలగన్నది అతడే కదా
నీ కళ్ళేదురుగా నించున్నది అతడే కదా
న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువు కోరడం

ఈ గన్ను నాదిరో ఆ డెన్ను నాదిరో
నీ బాసు నేనురో వాళ్ళంతు చూడరో
అరె దమ్ముకొడత మందుకొడత
బీటు కొడత జారి పడత హై..
పెళ్ళామేందిరో దాని పీకుడేందిరో..

అ అంటే అరవద్దని ఆ అంటే ఆగు అని
హే అంటే టైగరనీ నాతొ నువ్వు పెట్టుకుంటే డేంజర్ అని
మాతో పెట్టుకుంటే నీకూ మడాతే పడిపోద్ది
నీ తోలు తీయనా నా దమ్ము చూపనా నాకడ్డురాకురా.. 
 

సోమవారం, అక్టోబర్ 14, 2019

ఇంత కూరుంటెయ్యమ్మో...

బొంబాయి సినిమాలోని ’అది అరబిక్ కడలందం’ పాటకు పేరడీగా వచ్చిన ఈ పాట నవ్వించినంతగా అప్పట్లో మరే పాట నవ్వించుండక పోవచ్చు. ఒరిజినల్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. పిట్టలదొర చిత్రంలోని ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : పిట్టలదొర (1996)
సంగీతం : రమణి భరద్వాజ్ 
సాహిత్యం : పోలిశెట్టి లింగయ్య ?
గానం : ??

ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా
తల్లో దండం బెడుతా

అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో

వంకాయ కూరా ఔకారమొస్తది
ఒద్దు నా తల్లో
వంకాయ కూరా ఔకారమొస్తది
ఒద్దు నా తల్లో
బీరకాయ కూరా బోరే గొట్టుతది
ముద్దే బోదు తల్లో
అరె మటన్ పులుసులో
సింగిల్ పీసేన మరీ బ్యాడ్ తల్లో
మటన్ పులుసులో
సింగిల్ పీసేన మరీ బ్యాడ్ తల్లో
వట్టి చేపలైనా చికెన్ పీసులైన
ఉంటే వెయ్యమ్మో

అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో

వెజిటేరియన్ ఫుడ్డంటేనే
అసలే పడదమ్మో
వెజిటేరియన్ ఫుడ్డంటేనే
అసలే పడదమ్మో
వీక్ లో త్రైసైనా చికెన్ కర్రేయమ్మో
బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో 
బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో 
స్పెషల్ కుక్కును నాకై పెట్టిన
నీ బాధే తప్పేనమ్మో 

అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో

సంక్రాంతి పండక్కి సరికొత్త
వంటలు వండి పెట్టమ్మో
సంక్రాంతి పండక్కి సరికొత్త
వంటలు వండి పెట్టమ్మో
ఎగ్గు మసాలా కర్రంటే
నాకెంతిష్టమో తల్లో
అయ్యగారిదేదైన పాత
సూటుంటె పడేసి పో తల్లో
అయ్యగారిదేదైన పాత
సూటుంటె పడేసి పో తల్లో
ఎగస్ట్ర షూ జత ఏదైన ఉంటే
ఇటు ఇసిరేసి పో తల్లో

అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో

ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో
ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా
తల్లో దండం బెడుతా

అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా
అమ్మా.. అమ్మా.. అమ్మా..
అమ్మ అమ్మ అమ్మా.. తల్లో


ఆదివారం, అక్టోబర్ 13, 2019

పాడు కబురు వినగానే...

కిడ్నాప్ చేసి ఇలా పేరడీ పాటల రూపంలో టెన్షన్ పడి నవ్వించడం వర్మ స్కూల్ కే చెల్లింది. ఆ సరదా క్రైమ్ కామెడీని  మీరూ విని చూసీ నవ్వుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీమూర్తి (శ్రీ)
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : మనో, జె.డి.చక్రవర్తి, చిత్ర

(మావి చిగురు తినగానే)
 పాడు కబురు వినగానే..ఏ..
పైకం తెస్తాడా..ఆ.. పైకం తెస్తాడా
ఎవ్వడి బాబు సొమ్మంటూ
వైఫు గొంతు కోస్తాడా
ఏమో ప్లానేశాం గానీ
పార్టనరూ డబ్బురా
పాడు కబురు వినగానే
పైకం తెస్తాడా..అయ్యయయ్యో..
పైకం తెస్తాడా...

(జామురాతిరి జాబిలమ్మ)
నోరు మూయరా పిరికి పంద
శుభం పలకవా.. ఊహూ..
ఆది లోనే హంస పాదా
రేయ్.. ఆశ లేదా.. ఏంటీ.. ఊహూ..
సపోజ్ ఖర్మ కాలిపోతే
సడన్ గ దారి మారిపోతే
పదేళ్ళు కఠిన ఖైదు అంతే..

(ఇంతేనయా తెలుసుకోవయా)
ఇదిగో మనీ ఎటున్నా విని
ఇలారా కిడ్నాపరూ
రా..రా..రాఅ..రా...రా.. హహ
వదిలేయ్ మరి నా ఇల్లాలిని
నా ఇంటికి చిరుదివ్వెనీ
ఆస్థీ పాస్థీ బలాదూరేరా
నా దేవేలే మిన్నా...
బం చిక్ బంబం బబుచిక్ బంబం
బాబా బీబీబాబాబీబి.బా..

ఓయే ఓయే ఓయేఓయే
ఓయేఓ ఊవ్వా..

(నీ జత లేక పిచ్చిది కాదా)
ప్రాణాలైనా ఇస్తాకానీ మానేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
ప్రాణం కన్నా పెళ్ళాం మిన్నా అంతేగా
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. ఆఅ..
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. హహహ..

(యురేకా సకామికా)
యురేకా సకామికా 
తొక్కింది నక్కతోకా
నెగ్గింది చిట్కా పండూ..
దక్కింది చక్కా ఫండూ
దొరికెరా ఈజీ ఫినాన్సు
జరుపుకో క్రేజీ రొమాన్సు
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా

(ముద్ద బంతి పూలు పెట్టి)
పెళ్ళి ఈడు పిల్ల ఉండీ
కళ్ళముందే అల్లుడుండీ
అల్లుడుండీ
టైమ్ వేస్ట్ చేస్తారేంటి
మావయ్యా.. ఫాదరిన్లా..
మా మ్యారేజికి
లేటవుతుంది నీవల్లా

(ఎన్నాళ్ళో వేచిన ఉదయం)
ప్రాపర్టీ పైసా లేదే
పోషించే పథకం లేదే
పెళ్ళానికి ఫుడ్డేమిట్రా
పచ్చగడ్డి పెడతావా
పోరా సోంబేరి గాడా
నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకె ఓ కంత లేదే
నీ మెడలో డోలొకటా

(వాన జల్లు గిల్లుతుంటే)
కన్నెగానే ఉండిపోనా కన్నతండ్రీ
పెళ్ళి ఊసే మరిచి పోనా పిచ్చితండ్రీ
ముల్లె తెచ్చాడుగా పిల్లడూ
ముళ్ళు వేయించవా ఇప్పుడే 
 
(థమ్సప్ యాడ్)
రూపాయ్ లొచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
పాపాయ్ నిచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
సొమ్మొకళ్ళదీ సోకొకళ్ళదీ
గప్ చుప్ గప్ చుప్
రిఫ్రెషింగ్ కోలా
రిఫ్రెషింగ్ కోలా థమ్సప్.. 


శనివారం, అక్టోబర్ 12, 2019

నిలువరా వాలు కనుల వాడా...

జంబలకిడిపంబ సినిమాలో ఈవీవీ గారు చేసిన గందరగోళం గురించి తెలియని తెలుగు వారెవరు. మరి ఆ సినిమా కాన్సెప్ట్ కి తగినట్లుగా ఫేమస్ డ్యుయెట్స్ కి కట్టిన పేరడీలు వినీ చూసి నవ్వుకోండి ఈ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జంబలకిడి పంబ (1992)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : భువన చంద్ర
గానం : మనో, రాధిక

నిలువరా వాలు కనుల వాడా
వయ్యారి హంస నడక వాడా
నీ నడకలో హొయలున్నవి చూడా
నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే
నిలువదు నా మనసు
ఓ గురుడా అది నీకే తెలుసు
నిలువరా వాలు కనుల వాడా
వయ్యారి హంస నడక వాడా

ఆఆ...ఆఅ....ఆఆఆ...
పిలువకుమా... అలుగకు మా..
నలుగురిలో నను ఓ రాణీ
పిలిచిన పలుకనులే
పిలువకుమా... అలుగకు మా..
నలుగురిలో నను ఓ రాణీ
పిలిచిన పలుకనులే

గుడిలోన నా దేవి కొలువై ఉన్నాదీ
సేవకు వేళాయెరా చెలికాడా
సేవకు వేళాయెరా
గుడి ఎనక నా రాణి
గుడి ఎనక నా రాణి
గుర్రమెక్కి కూకున్నాది
దాని సోకు చూసి
గుండెల్లో గుబులాయెరా
అబ్బాబ్బా ఒళ్ళంత ఏడెక్కెరా
అయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెరా
అయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెరా

చెట్టులెక్క గలవా ఓ చెంచిత పుట్టలెక్కగలవా
చెట్టులెక్క గలవా ఓ చెంచిత పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఓ చెంచిత చిగురు కోయ గలవా

చెట్టులెక్కగలనోయ్ ఓ నరహరి పుట్టలెక్కగలనోయ్
చెట్టులెక్కగలనోయ్ ఓ నరహరి పుట్టలెక్కగలనోయ్
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనోయ్
ఓ నరహరి చిగురు కోయగలనోయ్

ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా
ఆడది లేడూ మగాడు లేదూ మాడ్ మాడ్ లోకమయా

ఓహోహో..హో... ఓహో.హో..హో..ఓఓఓఓఓఓ
వగల రాజువి నీవే సొగసు గత్తెను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను బండి దిగి రారా
వగల రాజువి నీవే సొగసు గత్తెను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను బండి దిగి రారా

భామా భామా భామా.. ఏరా ఏరా మావా
పట్టుకుంటె కందిపోవు పిల్లగాడు పక్కనుంటె
చుట్టు చుట్టు తురుగుతారు మరియాద
తాళి కట్టకుండ ఒప్పుకుంటె తప్పుగాదా
భామా భామా భామా.. ఏరా ఏరా మావా
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి
ప్రేమ లోకి దింపు వాళ్లు మీరు కాదా
చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా
ఏరా ఏరా మావా భామ భామా భామా..

ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓరోరి మురిపెముగా ఆడుదమా
కలకల కిల కిల నవ్వులతో
పంచెలు రెపరెపలాడా
ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓరోరి మురిపెముగా ఆడుదమా
కలకల కిల కిల నవ్వులతో
పంచెలు రెపరెపలాడా


శుక్రవారం, అక్టోబర్ 11, 2019

నువ్వు నా ముందుంటే...

వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన "శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సినిమాలోని ఈ పాట లిరిక్స్ పరమైన పేరడీ కాకపోయినా టేకింగ్ పరంగా మ్యూజిక్ పరంగా పేరడీగా తీస్కోవచ్చు. ఒరిజినల్ పాట ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
 
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని
చిలిపి సైగలే చేసేవు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి
నా సిగ్గు దొంతరలు దోచేవు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.