ఆదివారం, జూన్ 10, 2018

కరవాలమ నీ శూరత...

ఆధునిక యుగంలో అహింసకు ప్రాధాన్యత నిస్తూ కత్తి కన్నా కలం గొప్పదని తీర్మానించేశారు కానీ రెండిటిలో ఏది గొప్పదనే వాగ్వాదం ఇప్పటిది కాదు, ఐతే రెండిటిలో దేని గొప్పదానిదేనంటూ ఒకదానికొకటి సహకరించుకోవాలనీ, ఐకమత్యమే లోక సౌభాగ్యమని చాటే ఈ చక్కని నృత్యరూపకం సంఘం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : పి.సుశీల, టి.ఎస్.భగవతి

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కాదా
పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కదా
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
మహరాజు సేయునే
మహరాజు సేయునే
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
దశదిశలకు నేనొసగిన సందేశము నిడుమా
సందేశము నిడుమా సందేశము నిడుమా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
సౌఖ్యం నాట్యం చేయిస్తాం

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే


కత్తిలో బలమును తెలియకనే డంబాలు పలికేవే పో పో పో

బుద్ధిలో బలమును తెలియకనే గొప్పలేల పల్కేవే పో పో పో
బాలచంద్ర పాపారాయుల
బాలచంద్ర పాపారాయుల
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ


నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
సహకరించి జయము పొందరే
సహకరించి జయము పొందరే 




 

శనివారం, జూన్ 09, 2018

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ...

బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ గురజాడ వారు రచించిన ఈ నృత్యరూపకం కథ మహిమో, వారి పదజాల మహత్యమో, ఘంటసాల గారి గాన మహిమో కానీ విన్న ప్రతి సారీ కంట తడి పెట్టించక మానదు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : గురజాడ
గానం :  ఘంటసాల, బృందం

ఆఆఆ.. పుత్తడి బొమ్మా...ఆఆఆఆ..
పూర్ణమ్మా... పూర్ణమ్మ... ఔనూ..
మేలిమి బంగరు నెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథను..
విన్నారమ్మా ఈ కథను..

మేలిమి బంగరు నెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథను..
విన్నారమ్మా ఈ కథను..


హోయ్ కొండల నడుమను కోనొకటుంది ఉందీ..
కోనకి నడుమ కొలనొకటుంది.. ఓఓఓఓఓ..
హోయ్.. కొండల నడుమను కోనొకటుంది
కోనకి నడుమ కొలనొకటుంది
కొలని గట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మా
వెలసెను బంగరు దుర్గమ్మా
ఔనూ.. ఔనౌను..

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
 అన్నదమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది...
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా


యేయేవేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితో కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

ఆఅ.. అందాలకి చందమావలా ఆఆఆఆ..
గుణాలకి రత్నాల రాశిలా
ఆఆఆఆ.. 
 నలుగురి కన్నుల్లో కనుపాపై
నట్టింట దీపమై వెలుగుతున్న పూర్ణమను
అయ్యో..ఓఓఓఓ...
అప్పుడేం చేశారయ్యా అంటే..

కాసుకు లోనై తల్లీ దండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసిరి
అయ్యో పాపం
ముదుసలి మొగుడుకు ముడివేసిరి
ముదుసలి మొగుడుకు ముడివేసిరి


ముద్దు నగవులు మురిపెంబు మరి
పెనిమిటి గాంచిన నిముషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మును
కన్నుల గ్రమ్మెను కన్నీరు.. ఓఓఓఓ..

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాతయని గేలించ
మొగుడు తాతయని గేలించ
ఆటల పాటల కలియక పూర్ణమ
దుర్గను చేరి దుఃఖించే
దుర్గను చేరి దుఃఖించే
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓఓ

తల్లిదండ్రులు గట్టిన గుదితాడు
విప్పడానికి వశమా తప్పడానికి వశమా
గొల్లు గొల్లున ఏడ్చింది.. అయ్యో
గుండె రాయి చేసుకుని ఓర్చింది..
పుత్తడి బొమ్మా... ఆఆఆఅ...
పుత్తడి బొమ్మా.. పూర్ణమ్మ..

అయ్యో...

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరలు,సొమ్ములు చాలగా తెచ్చెను.
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
పుత్తడి బొమ్మకు పూర్ణమకు

అయ్యో అప్పుడేం చేసిందయ్యా అంటే
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ
తల్లి దండ్రీ దీవించిరి
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ
తల్లి దండ్రీ దీవించిరి


నీ కడుపు చల్లగా పదిమంది బిడ్డల తల్లివై
పసుపు బొట్టూ పెట్టుకు
పది కాలాలా పాటు వర్ధిల్లమ్మా అంటే..ఏఏఏ..

దీవెన వింటూ ఫక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ
దీవెన వింటూ ఫక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ 
చిన్నల నందరి కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరు..
ఓఓఓఓఓ...ఓఓఓఓఓ

అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ


అన్నల్లారా! తమ్ముల్లారా!
అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండీ!
అమ్మను అయ్యను కానండీ!
బంగరు దుర్గను భక్తితో 

కొలువండమ్మల కమ్మా దుర్గమ్మా!
అమ్మల కమ్మా దుర్గమ్మా!

 అమ్మల కమ్మా దుర్గమ్మా!
 
 నలుగురు కూర్చుని నవ్వే వేళల
నాపేరొకతరి తలవండి
నాపేరొకతరి తలవండి
మీ మీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి
ప్రేమను నా పేరివ్వండి
అన్నల్లారా.. అయ్యో!
తమ్ముల్లారా.. అయ్యో!

బల బల కన్నుల కన్నీరొలికెను ఓఓఓఓ
బల బల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు
పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు
కన్నులు తుడుచుకు కల కల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

 
వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడి పెట్టెన్ ఓఓఓ
కాసుకు లోనై అల్లుని తలచుకు ఔరౌరౌరా...
కాసుకు లోనై అల్లుని తలచుకు
ఆనందించెను అయ్యొకడె..ఏఏ..
అయ్యొకడే...ఏఏఏఏ...

 
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరి గూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
వొంటిగ పోయెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా.. ఆఆ.. పూర్ణమ్మా..

ఆవులు మదవులు మందలు చేరెను
పిట్టలు చెట్లను గుమికూడెన్
పిట్టలు చెట్లను గుమికూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ ఇంటికి రాదాయె
పూర్ణమ ఇంటికి రాదాయె ఓఓఓఓ
పూర్ణమ ఇంటికి రాదాయె ఓఓఓఓ
పూర్ణమ ఇంటికి రాదాయె...

కన్నుల కాంతులు కలవల చేరెను.. ఓఓఓఓ...
మేలిమి చేరెను మేనిపసల్
.. ఓఓఓఓ...
 హంసల జేరెను నడకల బెడగులు .. ఓఓఓఓ...
దుర్గను జేరెను పూర్ణమ్మ
.. ఓఓఓఓ...
 పుత్తడి బొమ్మా.. పూర్ణమ్మా.. ఓఓఓఓ...

 

శుక్రవారం, జూన్ 08, 2018

లేవోయ్ చిన్నవాడా...

దొంగరాముడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొంగ రాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : జిక్కీ

లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదుర లేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా

లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదుర లేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా

పొడిచింది చందమామ...
చేరి పిలిచింది వయ్యారి భామా
ఆఆఅ.. పొడిచింది చందమామ...
చేరి పిలిచింది వయ్యారి భామా

కురిసింది వెన్నెల వానా...
ఆహా.. విరిసింది పన్నీటీ వాసన

లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదురలేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా

కన్నుల్లో కళమాసెనేలా
నీ మదిలో మబ్బు మూసె నేల
కన్నుల్లో కళమాసెనేలా
నీ మదిలో మబ్బు మూసె నేల
వెత చెంది సుఖపడలేవురా
నీ బతుకల్లా కలయైపోవురా

లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదురలేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా

నిన్న కలసి మొన్న లోన
ఉన్న నేడు రేపు సున్న
నిన్న కలసి మొన్న లోన
ఉన్న నేడు రేపు సున్న
ఉన్ననాడే మేలుకో
నీ తనీవి తీరా ఏలుకో

లేవోయ్ చిన్నవాడా
లేలేలేవోయి చిన్నవాడా
నిదురలేవోయి వన్నెకాడా
నిదురలేవోయి వన్నెకాడా


గురువారం, జూన్ 07, 2018

విన్నావ యశోదమ్మా...

చిన్ని కృష్ణుని లీలలు ఎన్ని సార్లు విన్నా తనివితీరునా. ఆ నల్లనయ్య అల్లరులను అద్భుతంగా వర్ణించిన ఈ చక్కని నృత్యరూపకం మాయా బజార్ చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. కలర్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957) 
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
గానం : పి.లీల, సుశీల, స్వర్ణలత(సీనియర్)
 
గోపికలు : విన్నావ యశోదమ్మా..విన్నావ యశోదమ్మా
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మ

యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా


గోపికలు : ఆ..మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
పాలన్నీ తాగేశనమ్మా
పెరుగంతా జుర్రేశనమ్మా
వెన్నంతా మెక్కేశనమ్మా

కృష్ణుడు : ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?
కలదమ్మా..ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా..విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ..

 
గోపికలు : ఆ..ఎలా బూకరిస్తున్నాడో
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా
భామలందరొక యుక్తిని పన్ని 
గుమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ

ఆహా...ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛెంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా

కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే 

యశోద : మరి ఎక్కడున్నావు?
 

కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచానే..గోవుల చల్లగ కాచానే..
గోవుల చల్లగ కాచానే
 
ద్రౌపది : హే కృష్ణా..హే కృష్ణా
ముకుందా మొరవినవా
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా..కృష్ణా కృష్ణా కృష్ణా


బుధవారం, జూన్ 06, 2018

ఉందిలే మంచి కాలం...

మనిషి ఆశాజీవి రానున్నవి మంచిరోజులు అనుకుంటూ ఉండకపోతే జీవించలేడు, మరి అలాంటి మంచి రోజులు ఎలా ఉంటాయో అవి రావాలంటే ప్రజలేం చేయాలో వివరించే ఈ చక్కని నృత్యరూపకం రాముడు భీముడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్ లో క్లియర్ ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : శ్రీశ్రీ
గానం :  ఘంటసాల, సుశీల

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఉందిలే

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ
ఎందుకో.. సందేహమెందుకో
రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఎందుకో.. సందేహమెందుకో
రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..ఆ...ఆ..
నీవే రాజువట..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఉందిలే

ఏమిటేమిటేమిటే.. మంచి కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో ఇశదంగా చెప్పూ

దేశ సంపద పెరిగే రోజు
మనిషి మనిషిగా బ్రతికే రోజు
దేశ సంపద పెరిగే రోజు
మనిషి మనిషిగా బ్రతికే రోజు
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో

భలే భలే..బాగా చెప్పావ్..
కాని.. అందుకు మనమేం చెయ్యాలో
అది కూడా నువ్వే చెప్పు

అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ..
నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ..
అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
 
ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా
ఆకాశవీధుల ఎదురేలేకుండా ..ఆ..ఆ..
ఎగురును మన జెండా..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందనా..ఆ..
ఉందిలే

మంగళవారం, జూన్ 05, 2018

సరిగంచు చీరకట్టి...

ఆలుమగలు ఒక్కటిగా సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, జల్సాల వైపు మొగ్గుచూపే మగని నిలువరించడంలో స్త్రీ పాత్ర ఎంతో చక్కగా చూపించిన ఈ నృత్య రూపకం వెలుగు నీడలు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వెలుగునీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, పి.సుశీల 

సరిగంచు చీరకట్టి
బొమ్మంచు రైక తొడిగి
సరిగంచు చీరకట్టి
బొమ్మంచు రైక తొడిగి
జలసాగ నాతో రాయే
వయ్యారి ముద్దులగుమ్మ
సినిమాకు పోదం లేవే
గయ్యాళి రంగులబొమ్మ
నిలపర చిన్నోడో నీ సోకు నీ ఠీకు
ఏడనేర్చినావురో ఈ నీటు ఈ గోటు

మింగమెతుకు లేదాయె
మీసాలకు సెంటాయే
ఏటేటా బిడ్డాయె ఓపిక ఉడిగీ పోయే
ఇంట్లో ఈగలమోత
బయట పల్లకిమోత

నిలపర చిన్నోడో నీ సోకు నీ ఠీకు
ఏడనేర్చినావురో ఈ నీటు ఈ గోటు

సంపాదన జేసుకోను సత్తావున్నాదీ
సక్కనైన సుక్కనాకు పక్కనున్నాదీ
సంపాదన జేసుకోను సత్తావున్నాదీ
సక్కనైన సుక్కనాకు పక్కనున్నాదీ
సామి సల్లగా జూసి సంతువున్నాదీ
ఇంతకన్న సొర్గమంటె ఎక్కడున్నదీ

నిలపవె నారాణీ నీకేల భయమింక
ఆపవె బఠాణీ అల్లిబిల్లి కూతలింక

కనంగానె ఏమాయె
గాలికి వదిలావాయె
కనంగానె ఏమాయె
గాలికి వదిలావాయె
బిడ్డలంటె పట్టదాయె
చదువుగొడవ ఎత్తవాయె
బండ చాకిరీతో వాళ్ల
బతుకే తెల్లారిపోయె

నిలపర చిన్నోడో నీ సోకు నీ ఠీకు
ఏడనేర్చినావురో ఈ నీటు ఈ గోటు

సంతానం పెరక్కుండ సూసుకుందామె
సంసారం సాగుమానం సేసుకుందామె
సంతానం పెరక్కుండ సూసుకుందామె
సంసారం సాగుమానం సేసుకుందామె
సిల్లరంత కూడబెట్టి దాచుకుందామె
పిల్లగోళ్ళ సదువులకు వాడుకుందామె
నిజమేనే రాణి నువ్వు చూపిన బాట
ఇంటానులేవే ఇక మీద నీమాట

సంతోషమే… సంతోషమే…
సింతలేని కాపురమే శ్రీరంగమే
ఆలుమగలు ఒక్కటైతే ఆనందమే

సంతోషమే… సంతోషమే…
సింతలేని కాపురమే శ్రీరంగమే
ఆలుమగలు ఒక్కటైతే ఆనందమే


సోమవారం, జూన్ 04, 2018

టౌను పక్కకెళ్ళొద్దురా...

టౌనుకెళ్ళి రిక్షా తొక్కైనా సరే డబ్బులు సంపాదించి జల్సాచేయాలనే మగడి ఆత్రానికి ఈ అమ్మడు కళ్ళెమెలా వేసిందో తోడికోడళ్ళు చిత్రంలోని ఈ చక్కని నృత్యరూపకంలో చూద్దామా.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సరిగమ వారి క్లియర్ ఆడియో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : తోడి కోడళ్ళు (1957)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : ఘంటసాల, జిక్కి

'మూటా ముల్లె కట్టూ..'
'ఎక్కడికీ ?'
'బస్తీకి !'

తింటానికి కూడు చాలదే జాంగిరీ
ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

రెక్కలన్నీ ఇరుసుకుంట
రిక్షాలు లాక్కుంట
రెక్కలన్నీ ఇరుసుకుంట
రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట
సినీమాలు చూసుకుంట

షికార్లు కొడదామే పిల్లా
జలసా చేద్దామే
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

కూలి దొరకదు నాలి దొరకదు
గొంతు తడుపుకొన నీరు దొరకదు
కూలి దొరకదు నాలి దొరకదు
గొంతు తడుపుకొన నీరు దొరకదు
రేయి పగలు రిక్షా లాగిన అద్దెకుపోను
అణా మిగలదు
గడప గడపకూ కడుపు పట్టుకొని
ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు
కుక్కలనీ ఉసిగొల్పిస్తారు

'చాల్లెహే..'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

ఫాక్టరీలలో పని సులువంట
గంటైపోతే ఇంటో ఉంటా
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీతోటే గడపచ్చంట
కబుర్లు చెప్పుక బతకచ్చంట

'అట్టాగా...'

చూడ చిత్రమంటా
పిల్లా చోద్యమవుతదంటా
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

పిప్పై పోయే పిచ్చి ఖర్చులు
పోకిరి మూకల సావాసాలు
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు
పోకిరి మూకల సావాసాలు
చీట్లపేకలు..సిగ సిగ పట్లు..
తాగుడు వాగుడు తన్నులాటలు
ఆ!.. హు!...
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులో మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతలికీడ్చే దిక్కే ఉండదు

'అయ్యబాబోయ్ !'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

ఏలి కేస్తె నువు కాలికేస్తవు
ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏలి కేస్తె నువు కాలికేస్తవు
ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏదారంటే గోదారంటవు
ఇరుకున పెట్టి కొరుక్కు తింటవ్
దిక్కు తోచనీయవే పిల్లా తిక మక చేసేవే

బస్తీకి నే బోను నీతో ఉంటానే
రాణి నా రంగసానీ !

గొడ్డూ గోదా మేపుకుందాం
కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరా నారా జరుపుకుందాం
పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూసుకుందాం
తలో గంజియో తాగి పడుందాం

టౌను పక్కకెళ్ళొద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరో డౌనైపోతారూ
తానే తందన్న తాన..
తందన్న తాన.. తందన్న తానా!

 

ఆదివారం, జూన్ 03, 2018

అమ్మా నొప్పులే...

పరీక్షలు తప్పించుకోవడానికి ఓ అల్లరి పిల్లవాడు వేసిన ఎత్తును వాళ్ళమ్మ ఎలా చిత్తు చిత్తు చేసిందో పెళ్ళిచేసి చూడు చిత్రంలోని ఈ చక్కని నృత్యరూపకం లో చూద్దామా. ఈ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : పెళ్ళిచేసిచూడు (1952)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి
గానం : కె.రాణి, ఉడుతా సరోజిని, ఏ.పి.కోమల

పరీక్షలు పరీక్షలు పరీక్షలు..
పాడు పరీక్షలు...
పాఠాల్రాకపోయినా
పరీక్షలొచ్చి కూర్చున్నాయ్
ఇపుడు పరీక్షకెట్లా ఎగ్గొట్టడం..
ఆఅ... కడుపులో నొప్పొచ్చిందని..
వంక పెట్టేస్తాను..


అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..
అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..
ఫస్టుక్లాసులో ప్యాసవుదామని
పట్టుబట్టి నే పాఠాల్ చదివితే
ఫస్టుక్లాసులో ప్యాసవుదామని
పట్టుబట్టి నే పాఠాల్ చదివితే
పరీక్షనాడే పట్టుకొన్నదే
బడికెట్లానే వెళ్ళేదే..

అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..

బాబూ లేవరా..
ఈ మందూ తాగరా..
పరీక్ష కోసం దిగులు పడకురా
వచ్చే ఏటికి ప్యాసవుదువులే
పరీక్ష కోసం దిగులు పడకురా
వచ్చే ఏటికి ప్యాసవుదువులే
నువు బాగుంటే మాకు చాలురా
నిక్షేపంగా ఇంట నుండరా...
బాబూ లేవరా..
ఈ మందూ తాగరా..


చిల్లూ గారెలా..
అయ్యయ్యో బూరెలా..
పరిక్షలిచ్చే పాపకోసమని
కమ్మ కమ్మగా నేను చేస్తినే
అయ్య నోట శని పట్టెను ఏమో
మాయల మారి నొప్పులొచ్చెనే
అయ్యో గారెలా..
అయ్యయ్యో బూరెలా..


అమ్మా ఒక్కటే
అమ్మమ్మా ఒక్కటే
అమ్మా ఒక్కటే
అమ్మమ్మా ఒక్కటే
బుద్ది వచ్చెనా నీకు బుద్ధి వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మ బుద్ది వచ్చెనే
లెంపలేసుకో ఐతె లెంపలేసుకో
వేసుకొంటినే అమ్మ ఒక్కటివ్వవే
బుద్ది వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మ బడికి పోదునే
బాగ చదువుకుందునే.. 

 

శనివారం, జూన్ 02, 2018

చక్కనైన బోయారాజుని...

ఈ రోజు వైజయంతీ మాల గారు నర్తించిన  జీవితం చిత్రంలోని చక్కనైన బోయారాజు అనే పాట తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్. సుదర్శనం
సాహిత్యం : తోలేటి 
గానం : టి.ఎస్.భగవతి, ఎం.ఎస్.రాజేశ్వరి

చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

చక్కనైన బోయారాజుని
ఎక్కడైన చూశారా
మీరెక్కడైన చూశారా
అతను ఎవరో చెప్పమ్మా
ఆనవాళ్ళు చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
ఒక చేతిలో అమ్ము
ఒక చేత విల్లయ్యా
సిగ పక్కన చుట్టూతాడయ్యా
అది చూసే నా వాడయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
ఎటు పోయెనో ఏమో
గుట్టూ నాకు తెలీదయ్యా
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా వాని
అందచందమన్నీ చూసి
ఆశ పొందుతారయ్యా
నన్ను చూసి పోయినాడయ్యా
నా దోసమేమి లేదయ్యా

ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా
ఎటువంటి వాడమ్మా
ఎటు పోయే చెప్పమ్మా నీవు
అతడేనయా నా జతగాడయా
ఆహా... నిజమేనయా..

ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
ఛంగున ఏ సింగమైన
లొంగదీసేవాడయ్యా
పలు హంగులున్న వాడయ్యా
నా బంగరు బావా వాడయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా
ఎంతెంతో తిరిగీ చూసీ
అంతు తెలియా లేదయ్యా 
 
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
పిక్క లాంటి అందగాడూ
ఈ పక్కకొచ్చినాడమ్మా
ఇక్కడే ఉన్నాడమ్మా
ఇతడేన చూడమ్మా
ఇతడేన చూడమ్మా
 

శుక్రవారం, జూన్ 01, 2018

రానంటే రానే రానోయ్...

నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించిన సావిత్రమ్మ గారి బయోపిక్ ’మహానటి’ పుణ్యమా అని యువతరంతో సహా ప్రేక్షకులంతా బ్లాక్ అండ్ వైట్ సినిమాల వైపు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, అప్పటి సినిమాల్లో ఉన్న కొన్ని నృత్య రూపకాలను ఈ నెలంతా తలచుకుందాం. ముందుగా పాతళభైరవి చిత్రంలో సావిత్రమ్మ మొదటి సారి తెరపై కనిపించిన పాట చూద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాతాళభైరవి (1950)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి
గానం : పిఠాపురం, ఏ.పి.కోమల

రానంటే రానే రానోయ్
ఇక రానంటే రానే రానోయ్
మన ఋణమిక యింతేనోయ్
ఇక రానంటే రానే రానోయ్


ఓ.. మనకూ మనకూ తీరని ఋణమే

ఆఆ...మనసే చెడెనిక ఎక్కడి ఋణమోయ్

చీటికి మాటికి మనసులు చెడితే..
ఏ..హే.. చీటికి మాటికి మనసులు చెడితే 
ఈ కాపురమెటులె.. దిత్తాం..దిత్తై.. 
తకిట దిత్తాం.. తకిట దిత్తై.. 
తకిట ఈ కాపురమెటులె 
ఈ కాపురమెటులె...

ఎవరికి తెలుసును పో...

తప్పంతా.. ఇక తప్పంతా..
ఈ తప్పంతా నాదేననుకో
నా మెప్పంతా.. 
నా మెప్పంతా నీదేననుకో
నా వయ్యారి భామా రావే..



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.