శనివారం, మార్చి 22, 2014

మనసా వాచా...

వేటూరి గారు, శేఖర్ కమ్ముల, రాధాకృష్ణ కలిస్తే సంగీతాభిమానులకు సంబరమే కదా.. నాకెంతో ఇష్టమైన పాట. మీరుకూడా తనివితీరా ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా 
నడిచా నేనే నీడలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా.. 
మూగైపోయా నేనిలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఆఅ... 
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా 
రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

శుక్రవారం, మార్చి 21, 2014

పున్నమిలాగా వచ్చిపొమ్మని...

కె.వి.మహదేవన్ గారి అసిస్టెంట్ గా అందరికీ తెలిసిన పుహళేంది గారు స్వరపరచిన పాట ఇది. పాట చాలా సార్లే విన్నాను కానీ సంగీతం పుహళేంది గారని ఇప్పటివరకూ తెలియదు. మీరూ వినండి. ఈ పాట చిమటాలో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ లింక్ కూడా కేవలం ఆడియో మాత్రమే.



చిత్రం : జడగంటలు (1984)
సంగీతం : పుహళేంది
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆ..ఆ...ఆ...
లలలలలలలల.. లాలాలా... లాలాలా...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

నువ్వు రావాలా... పువ్వు పూయాలా... రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

లలల ఆ..
లలలలల లాలలలా..

పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా.. ఆఆఆ..
పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా... గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా..
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

లలలల లాలాలా... లలలల లాలాలా

పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా..ఆఆఆ..
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా..ఆ..
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా.. రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...

ఆ... ఆ... ఆ...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది...

గురువారం, మార్చి 20, 2014

ఎడారిలో కోయిలా తెల్లారనీ

బాలుగారి కోసం ఈ పాట ఎన్నివందల సార్లు అయినా వినవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా..
తెల్లారనీ రేయిలా...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే..

ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

బుధవారం, మార్చి 19, 2014

ఓహో లైలా ఓ చారుశీలా...

బాలు గారు ఒక మాంచి స్టైల్ తో పాడిన పాట ఈ పాట. సినిమాకూడా అప్పట్లో వైవిధ్యంగా కార్ రేసుల నేపధ్యంతో తీసిన సినిమా బాగుంటుంది కాకపోతే కాన్సెప్ట్ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయినట్లు లేరు బహుశా ఏదైనా ఇంగ్లీష్ సినిమా నుండి డైరెక్ట్ లిఫ్ట్ ఏమో కూడా తెలీదు. ఇళయరాజా గారు స్వరపరచిన ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాగానే ఉంటాయి. మీరూ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. 



చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళా


విశాఖలో నువ్వు నేనూ వసంతమే ఆడాలా
ఉషారుగా చిన్నాపెద్దా షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాలా
వరించినా వలపుల్లోనే విరించిలా రాయాలా
అందచందాల అతివల్లోనా కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోనా తప్పనీ తాళమా
చాల్లేబాల నీ ఛాఛఛీలా సంధ్యారాగాలాపనా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా.. హ..

జపించినా మంత్రం నీవే తపించిన స్నేహంలో
ప్రపంచమూ స్వర్గం నీవే స్మరించినా ప్రేమల్లో
చెలీ సఖీ అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో
ఇదీ కథా అన్నీ తెలిసీ క్షమించవే ప్రాయంతో
కాళ్ళ బేరాలకొచ్చాకైనా కాకలే తీరవా
గేరు మార్చేసి పాహీ అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించు గోల ప్రేమిస్తున్నా ఘాటుగా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
ఒరె..మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుసల తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళా..ళా.ళ్ళా..ళ..ళ..

మంగళవారం, మార్చి 18, 2014

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు...

సిరివెన్నెల గారి మరో అందమైన పాట ఓ అల్లరి అమ్మాయి గురించి... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి చిత్రీకరణ సైతం చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : జోష్(2009)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు 
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు 
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నువ్వేం చూస్తున్నాఎంతో వింతల్లే అన్నీ 
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఎదో ఘనకార్యం లాగే 
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
 
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


సోమవారం, మార్చి 17, 2014

హోలీ శుభాకాంక్షలు..

ఇళయరాజా గారి అద్భుతమైన మ్యూజికల్ హిట్ "అభినందన" సినిమాలోని ఈ కలర్ ఫుల్ పాట హోలీ సందర్బంగా మీకోసం. హోలీ అనగానే ఉన్న నాలుగైదు పండగకి సంబంధించిన పాటలనే రొటీన్ గా షేర్ చేసుకునే బదులు రంగులమయమైన ఈ పాట షేర్ చేద్దామనిపించింది చూసి ఆనందించండి.

మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు.. 
 సహజసిద్దమైన రంగులు వాడడానికి ప్రయత్నించండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

ఆఆఆఅ..ఆఆఆ.ఆఅ 
మ్.హుహు..ఊహూహూహు..
మ్.హుహు..ఊహూహూహు..
ఊహు..మ్ఊఊ.. ఊహు.. ఊహూహూ..
ఆఆఅ.ఆఅ..ఆ.. లాలలాలలాల.. 

రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో.. 
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. ఆఆ
ఆమని పూచే యామినివో..ఆఅ
మరుని బాణమో.. ఆహా మదుమాస గానమో ఆహ్హా..
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై...


ముంతాజు అందాల అద్దానివో.. 
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
ప్రణయ దీపమో.. ఆహా నా విరహ తాపమో.. ఆహా
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో

రంగులలో కలనై లలలా లలలా 
యద పొంగులలో కళనై లలలా లలలా
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

హోలీ ఎంతైనా నార్త్ ఇండియాలో ఎక్కువ జరుపుకునే పండగ కదా కనీసం ఇపుడైనా ఒక హిందీ పాట పంచుకోకపోతే ఎలా అందుకే హోలీ పాటలలో ఆకట్టుకునే ఈ శాంతారామ్ గారి పాట చూడండి 'నవరంగ్' సినిమాలోనిది ఎంత బాగుందో.. ఈ పాట వినాలంటే ఇక్కడ వినవచ్చు.



Movie/Album: नवरंग (1959)
Music By: सी.रामचंद्र
Lyrics By: भरत व्यास
Performed By: चितलकर, महेंद्र कपूर, आशा भोंसले

अटक-अटक झटपट पनघट परचटक मटक इक नार नवेली
गोरी-गोरी ग्वालन की छोरी चली
चोरी चोरी मुख मोरी मोरी मुसकाये अलबेली
कँकरी गले में मारी कंकरी कन्हैये ने
पकरी बाँह और की अटखेली
भरी पिचकारी मारी
भोली पनिहारी बोली

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे

 मुझे समझो न तुम भोली भाली रे

आया होली का त्योहारउड़े रंग की बौछार
तू है नार नखरेदार मतवाली रे
आज मीठी लगे है तेरी गाली रे

तक तक ना मार पिचकारी की धार
..
तक तक ना मार पिचकारी की धार
कोमल बदन सह सके ना ये मार
तू है अनाड़ी, बड़ा ही गँवार
कजरे में तूने अबीर दिया डार
तेरी झकझोरी से, बाज़ आयी होरी से
चोर तेरी चोरी निराली रे
मुझे समझो ना तुम भोली भाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
मुझे समझो न तुम भोली भाली रे

धरती है लाल आज, अम्बर है लाल  
धरती है लाल आज, अम्बर है लाल 
उड़ने दे गोरी गालों का गुलाल
मत लाज का आज घूँघट निकाल
दे दिल की धड़कन पे, धिनक धिनक ताल
झाँझ बजे शँख बजे, संग में मृदंग बजे
अंग में उमंग खुशियाली रे
आज मीठी लगे है तेरी गाली रे
 

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे 

मुझे समझो न तुम भोली भाली रे

హోలీ శుభాకాంక్షలు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే చివరిగా ఈ వీడియో ఒకటి చూడండి ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటూ అమెరికాలో జరుపుకుంటున్న హోలీని చాలా చక్కగా ప్రజంట్ చేశారు. ఒక్కసారిగా రంగులు గాలిలోకి ఎగరడం చిత్రీకరించిన విధానం నాకు చాలా నచ్చింది అంతేకాక ఈ ఫెస్టివల్ లో ఉపయోగించేవి అన్నీ సహజ సిద్దమైన రంగులట. 



ఆదివారం, మార్చి 16, 2014

అందాలొలికే సుందరి...

ఈ సినిమా విడుదలైనపుడు ఈ పాటలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో మాటలలో చెప్పడం కష్టమేనేమో... మొత్తం స్టేట్ అంతటినీ ఒక ఊపు ఊపేసిన పాటలు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన టి.రాజేందర్ ఒక ముఖ్యపాత్ర కూడా పోషించారు. ఎవరా రాజేందర్ అంటారా ధైర్యమున్నవాళ్ళు ఈ ఫైట్ సీన్ చూసి తెలుసుకోండి. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ పాటతో పాటు ఈ సినిమాలోని మరికొన్ని పాటలు కూడా బాగుంటాయి. రేపు హోలీ సెలెబ్రేషన్స్ మొదలెట్టే ముందు ఈ కలర్ ఫుల్ పాట చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలనుకున్న వాళ్ళు ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. 



చిత్రం :  ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, శైలజ

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు 
చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల 
దోర పెదవులే పలికే..ఏ..ఏ...
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే
మరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..

మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి 
చెలి స్నేహం ఆ..ఆ..
పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ
పలవరింతలు రేపెను కోటి ..ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను

ఆఆఆ..రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ.. 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అన్నట్లు రేపు హోలీ కదా రంగులు సిద్దం చేసుకున్నారా.. లేకుంటే సహజ సిద్దమైన రంగులు (నాచురల్ కలర్స్) ఎలా తయారుచేస్కోవాలో ఈ వీడియోలో చూడండి. బీట్ రూట్, కాఫీ/టీ పొడి, ఆకు కూరలు, పసుపు + సెనగపిండి, కుంకుమ పువ్వు, బట్టలకు పెట్టే నీలిరంగు + సెనగపిండి లతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. 


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ వీడియోలో నాచురల్ కలర్ పౌడర్స్ ఎలా తయారుచేస్కోవచ్చో చూపించారు, ఫుడ్ కలర్స్ ని వైట్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ తో కలిపి చేయచ్చట. మీకు ఇంకేవైనా తెలిసినా ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. 

శనివారం, మార్చి 15, 2014

శశివదనే శశివదనే...

కొన్ని పాటల గురించి ఎక్కువ మాట్లాడకూడదు జస్ట్ విని ఆస్వాదించాలంతే... ఇదీ అలాంటి పాటే మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఇద్దరు (1997)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీమది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
చందనం కలిసినా ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా 
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె
అమృతం కురిసిన రాతిరి ఓ జాబిలి హృదయం జతచేరే

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
ఆ... ఆ... నీదా...ఆ... ఆ... నీదా... ఆ... ఆ... నీదా...

శుక్రవారం, మార్చి 14, 2014

నిగ్గదీసి అడుగు...

కాస్త పెసిమిస్టిక్ గా అనిపించినా ఇరవై ఏళ్ళ క్రితం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నేటికీ వర్తిస్తుంది క్యాలెండర్లు మారుతున్నాయే కానీ పరిస్థితులు మారట్లేదు. సమాజం ఉన్న పరిస్థితిని స్పష్టంగా కళ్ళముందు నిలిపే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటని సిరివెన్నెల గారిపై చిత్రీకరించాలనుకోవడం ఒక మంచి ఐడియా కవి ఆవేశాన్ని మరింత ప్రభావవంతంగా నేరుగా ప్రేక్షకులకు చేరవేయగలిగాడు దర్శకుడు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 


చిత్రం : గాయం (1995) 
సంగీతం : శ్రీ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
 
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం


పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

రాజకీయ రంగప్రవేశం గురించి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూన్నాను. తరచుగా తన మాటలలో వినిపించే నీతి నిజాయితీలు తన చేతలలో కూడా కనిపించాలనీ, పార్టీ ప్రారంభిస్తే అది ఆరంభ శూరత్వంలా కాక తన ఆశయాలకు తగిన స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి వాటిని తూచ తప్పక ఆచరించాలని కోరుకుంటున్నాను.

గురువారం, మార్చి 13, 2014

పున్నమి పున్నమి వెన్నెల

ఇటీవల వచ్చిన పాటలలో ఓ మంచి మెలొడి ఇది, చిత్రీకరణ కూడా చిత్రంగా ఉంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : లవ్ జర్నీ(2012)
సంగీతం : సతీష్ చక్రవర్తి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : విజయ్ ఏసుదాస్, శ్వేత
 
పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
ఎందరొ ఎందరొ ప్రేమికులున్నా
ఎన్నో ఎన్నో కలలను కన్నా
ప్రాణం ఇచ్చే ప్రేమే నాదీ ఓఓఓఓ

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

కావ్యాల్లాంటీ కథలను ఎన్నో భూమే చూసినది
నా ఎద కోరే మన కథ కూడా చరితై ఉండమనీ..
నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను
ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

ఏవో కలలే అలలై వచ్చీ తీరం చేరినవీ..
ఏవో కథలే ఎదనే గిచ్చీ విరహం పెంచినవీ
నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది
ఆశలు తీరే ఆమని లాగా బతుకే నేడు మారింది మారింది

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నీ చెలి
పువ్వులు పూచిన నవ్వే నీ చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.