సోమవారం, మార్చి 10, 2014

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే..

జానపద ఛాయలుంటే చాలు ఆ పాట సొగసు చెప్పడానికి మాటలు దొరకవు అలాంటిది ఇక ఆ బాణి ఇళయరాజాదైతే ఇదిగో ఈ పాటలా సొగసుగా తయారయి ఎన్ని ఏళ్ళైనా అలా గుర్తుండి పోతుంది. ఈ పాటనీ అందులోని పండు వెన్నెలనీ మీరూ ఓ సారి పలకరించి రండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.



చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ ??
గానం : బాలు, జానకి

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

మనసున సెగ యెగసే ఏ మాయో వెలుపుల చలి కరిచే 

వయసుకు అదివరసా వరసైన పిల్లదానికది తెలుసా

మాపటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా

ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కోడితే తుమ్మెద కూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...ఊహూ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని 

కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

పొద్దు ఉంది ముద్దులివ్వనా.. ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. చూశాక నూటొకటి లెక్క చెప్పనా
నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంతా డూపు

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

 

ఆదివారం, మార్చి 09, 2014

ముకుందా ముకుందా కృష్ణా

దశావతారంలోని ఈ ముకుందా.. ముకుందా పాట నేను తరచూ వినే పాటలలో ఒకటి. ఇదికూడా చక్కని సంగీత సాహిత్యాల మేళవింపు. ఆడియో క్రింది ప్లగిన్ లో లేదా ఇక్కడ వినండి.


 వీడియో ఇక్కడ చూడండి. 


చిత్రం : దశావతారం 
సంగీతం : హిమేష్ రేష్మియ 
సాహిత్యం : వేటూరి
గానం : సాధనసర్గమ్
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

వెన్నదొంగవైనా..మన్నుతింటివా..
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా..
 
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

 
జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే..
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. 
సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..

నీలాల నింగికింద తేలియాడు భూమి..
తనలోనే చూపించాడు..ఈ కృష్ణ స్వామి..
పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి..
నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు...
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమే ఇక.. 
అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ..
అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం..
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం..
వేదాల సారమంతా వాసుదేవుడే..
రేపల్లె రాగం తానం రాజీవమే..
 
హే..ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా...


మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి..
కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే..
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే..
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ..
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు..
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు..
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా..ఆధారం నేనై..
నీ ఒరవడి పట్టా..ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే..
మదిలోని ప్రేమ నీదే మాధవుడా..
మందార పువ్వే నేను మనువాడరా..
 
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...


శనివారం, మార్చి 08, 2014

భారత వీర కుమారిని నేనే

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా ఒకనాటి మేటి గీతాన్ని తలచుకుందామా. అంటే మహిళాభ్యుదయాన్ని ప్రోత్సహిస్తూ వచ్చే గీతం కాకపోయినా ఆ పాత్ర తీరుతెన్నులు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో కూడిన నాయికని పరిచయం చేస్తూ సాగే ఈ పాట వింటున్నపుడు అసలే రక్షణ అంతంత మాత్రమవుతున్న ఈరోజుల్లో మహిళలంతా ఇదే ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. సంఘం సినిమాలోని పాటలలో "సుందరాంగ మరువగలేనోయ్", "పెళ్ళీ" పాటలు కూడా నాకు ఇష్టమైనప్పటికీ ఈ పాట కొంచెం ఎక్కువ ఇష్టం. ఆడియో ఎంత బాగుంటుందో వైజయంతిమాల గారిపై చిత్రీకరించిన విధానం వలన కూడా మరింత బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 

ఈ సినిమాలో వైజయంతిమాల గారిలా మహిళలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.



చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి
గానం : పి.సుశీల

ఆఆఆఆఆఆ... 
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లాలల లాలల లా లల్లల్లా...

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..

స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
కర్షక సౌఖ్యం...
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం.. 
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆఆఅ..
కలిగే మార్గం చూపిస్తా...

రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రణ తిక్కన భార్యా సతి మాంచాల
తిక్కన భార్యా సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే.. 

భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆఆఅ...
ఆహో..ఆఆఆఆఆ...
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

శుక్రవారం, మార్చి 07, 2014

నీ రూపం చిత్రిస్తూనే..

విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట చాలా బాగుంటుంది, సినిమా మాంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అవడంతో అందరూ మెచ్చుకున్నవారే కానీ థియేటర్లో చూసినవారు తక్కువే దాంతో ఈ పాట కూడా పెద్ద ఆదరణకు నోచుకోలేదు. మీరూ చూసి ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సత్యమే శివం (2003)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం :  బాలు, గోపికాపూర్ణిమ

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే

ఆ గీతమే తియ్యగా పాడనా..ఆఆఆ..

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా

చుక్కలన్నీ ఒక్కటైతే చిత్రము
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కావ్యము
గీతలన్ని చిత్రమందు భాగమే
మాటలన్నీ ప్రేమ ముందు మౌనమే

ఆ నింగి రంగు నీలమంటా
మన ప్రేమ రంగూ ఎమిటంటా
నీ కుంచెలకే చూపొచ్చి
రేఖలకే రూపొచ్చి
మన ప్రేమను చిత్రించేనా 

 
నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా..

చిత్రమందు జీవమెక్కడున్నది 

చెలియ సోగ కళ్ళలోనే వున్నది
తనువులోన ప్రేమ ఎక్కడున్నది 

చూపు పడని చోట దాగి వున్నది
నీ చిత్రమందు ఓ చిత్రముంది
నీ మాటలోన మధుమంత్రముంది

తెలిమబ్బు తేరెక్కి ఇల చేరే జాబిలివా
జత చేర చెలియా నువ్వు రా..ఆఆ..

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే 

ఆ గీతమే తియ్యగా పాడనా ఆఆ...

గురువారం, మార్చి 06, 2014

ప్రాణమా ప్రాణమా

రెహమాన్ ఫాస్ట్ బీట్ పాటలు ఎంత బాగా కంపోజ్ చేయగలడో మెలోడీస్ అంతకన్నా గొప్పగా కంపోజ్ చేయగలడు అలాంటి ఓ అద్భుతమైన మెలొడీ తెనాలి సినిమాలోని ఈ ప్రాణమా ప్రాణమా పాట. వెన్నెలకంటి గారి సాహిత్యం కూడా బాగుంటుంది ఇక చిత్రగారు ప్రాణమా ప్రాణమా అని అంటూంటే మన పంచప్రాణాలు ఎవరో పట్టి లాగేస్తున్నట్లుగా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదేమో :-) ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు (పోస్టర్ చూసి కన్ఫూజ్ అవకండి అవి తెలుగు పాటలే).



చిత్రం : తెనాలి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

ఎదను దోచి ఏదో చేసి హిహిహి
కళ్లనిండా కలలే దాచి చెంతకీ..

ఎదను దోచి ఏదో చేసి 
కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి హిహిహి
కళ్లనిండ కలలే దాచి
చెంతకీ చేరకా ఊరింతువేలా..
ప్రాణమా... ప్రాణమా..

ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ప్రాణమా… ప్రాణమా…
ప్రాణమా… ప్రాణమా…

ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
చెంతకీ చేరకా ఊరింతువేలా..
ప్రాయమా.. ప్రాయమా..
ప్రాయమా.. ప్రాయమా.. 
నన్ను చూసి నన్నే చూసి కళ్లతోటి కలలే దోచి
తీయని మోహాల మరిగింతువేలా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా

కలిసిన కళ్లే కలలకు ఇళ్లై
వయసును గిల్లే మన్మధ విల్లై
కలిసిన కళ్లే కలలకు ఇళ్లై
వయసును గిల్లే మన్మధ విల్లై
హాయిగా ఊగే ఊయలలూగే
అందం ఎరవేసే చందమేదో సాగే
ఆశల గోదారి ఎగిసినదంటా
తారల పువ్వులన్నీ
కోసుకుందుమంటా
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే 
ప్రాణమా… ప్రాణమా…

హృదయాన మోగే ఈ రాగహేల
మధురం కదా ఇక మన రాసలీల
రెక్కలు తొడిగీ తలపులు చాలా
దిక్కులు దాటే ఎద ఈ వేళా
ఎదవీణ దాచే మౌన గీతం నేనే
పున్నాగ విరుల సన్నాయి నీవే
జత నీవనీ నిన్నే వలచి వచ్చానే
ప్రాణమా… ప్రాణమా…

ఎదను దోచి హిహి..
ఎదను దోచి ఏదో చేసి
కళ్లనిండ కలలే దాచి

ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా

ఎదనే నిదురించవా ప్రాణమా…  
ఎదురై మురిపించవా ప్రాణమా…
పాటే పలికించవా తోడై పులకించవా

ప్రాణమా…ఆఅ..అ..

బుధవారం, మార్చి 05, 2014

మనసా తుళ్ళిపడకే..

అతని అందం, అమాయకత్వం, మంచితనం, కట్నంవద్దనే ఆదర్శం ఇవన్నీ చూసి తనకు తెలియకుండానే మనసిచ్చేసింది ఆ అమ్మాయి. కానీ అతనికి తను సరిజోడవగలనో లేదో మనసుకు భంగపాటు తప్పదేమో అనే సందేహంతో తొందరపడవద్దని తన మనసుకు ఈ పాటతో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది . రమేష్ నాయుడు గారి సంగీతంలో అమ్మాయి మనసును తనదిగా చేసుకుని వేటూరి గారు రాసిన ఈ పాట ఎంత చక్కగా ఉందో మీరే చూడండి. ఈ పాట మంచి క్వాలిటీ(HD) వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ లింక్ పనిచేయనివారు క్రింది ఎంబెడ్ వీడియో  చూడచ్చు. ఆడియో హై క్వాలిటీ ఇక్కడ వినవచ్చు. ఆడియో వినాలంటె రాగాలో ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ
వస్తాడు నిన్ను వలచీ..
ఏమంత సిరి ఉంది నీకనీ
మురిసేను నిన్ను తలచీ..
చదువా.. పదవా.. ఏముంది నీకు
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ
దొరికేను ఆ ప్రేమఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

మంగళవారం, మార్చి 04, 2014

చందమామ కథలు..

ఆడియో కూడా విడుదలవకముందే మీడియాలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన చందమామ కథలు సినిమాలోని టైటిల్ సాంగ్ ఇది చాలా బాగుంది. మిక్కీ జె మేయర్ మెలోడీస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయనిపించినా అవే పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది. ఈ పాటని కళ్యాణి పాడిన తీరు కూడా నాకు చాలా బాగానచ్చింది. మీరూ ఆస్వాదించండి యూట్యూబ్ పని చేయని వాళ్ళు రాగాలో ఇక్కడ వినవచ్చు. 

అలాగే ఆసక్తి సమయం ఉన్నవారు ఈ యూట్యూబ్ ఛానల్ పై క్లిక్ చేస్తే ఆడియో ఫంక్షన్ వివరాలు, మొత్తం పాటల జ్యూక్ బాక్స్, ఈ సినిమాలో చెప్పబోయే ఒకో కథ పరిచయం చేసే ట్రైలర్స్ ఆయా పాత్రల మేకింగ్ వీడియోలు, పాటల ప్రోమోస్ అన్నీ చూడవచ్చు. 'LBW', 'రొటీన్ లవ్ స్టోరీ' లాంటి సినిమాలు తీసిన ప్రవీణ్ అచ్చతెలుగు పేరుతో పేరుతగిన కథలతో తీస్తున్న తరువాత సినిమాగా కాస్త మంచి అంచనాలు ఉన్న సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఆ అంచనాలని మరింత పెంచింది ఆ ట్రైలర్ ని ఈ పోస్ట్ చివరలో ఎంబెడ్ చేశాను చూడండి.  



చిత్రం : చందమామ కథలు (2004)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కళ్యాణి

కలనీ ఇలనీ కలిపిన వారధులూ..
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ...
ఇపుడే భువిలో ఇవి జనపదులూ..
చందమామ కథలు 
సాటివారి ఎదలు దాచు మేడలూ..
చందమామ కథలూ 
వారివీరి సొదలూ తమ పునాదులూ..

ఇవాళ ఇలాగ నీముందు ఉన్నది 
ఇలాగే ఇలాగే రేపుండదోయనీ 
నిజంలో బలాన్ని చూపిస్తు ఉన్నదీ
కొన్నాళ్ళు వెలుగులలో 
కొన్నాళ్ళు మసకలలో 
వందేళ్ళు గడపమనీ అన్నాయి 

కలనీ ఇలనీ కలిపిన వారధులు 
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ..
ఇపుడే భువిలో ఇవి జనపదులూ
చందమామ కథలు..
సాటివారి ఎదలు దాచు మేడలూ
చందమామ కథలూ..
వారివీరి సొదలూ తమ పునాదులూ

ఆఆ..ఆఆ..ఆఆఆ...హాఅ..హాఅ...ఆఆ..ఆ..

తపించే గుణాన్ని నీడల్లే మార్చుకో 
శపించే క్షణాన్ని ఓడించి వంచుకో 
నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో 
అదిచాలు తరువాతా 
మిగిలింది తలరాత 
అనుకుంటు బతకమని అన్నాయి

కలనీ ఇలనీ కలిపిన వారధులు 
కలిమి లేమి కలిగిన సుధలూ..
ఎపుడేమైనా తరగని సంపదలూ..
ఇపుడే భువిలో ఇవి జనపదులూ..
చందమామ కథలు.. 
సాటివారి ఎదలు దాచు మేడలూ
చందమామ కథలూ.. 
వారివీరి సొదలూ తమ పునాదులూ

సోమవారం, మార్చి 03, 2014

పరువాలు కనివిని

కమలహాసన్ అమల నటించిన "సత్య" సినిమా కోసం ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఓ అందమైన పాట, ఇంచుమించు ఇదే లైన్స్ లో నిర్ణయం సినిమా కోసం "ఎపుడెపుడెపుడని అడిగెను" అనే పాట కూడా కంపోజ్ చేశారు. ఈ పాట చిత్రీకరణ సైతం సురేష్ కృష్ణ చాలా చక్కగా తీశారు. ఈ అందమైన పాటను మీరూ అస్వాదించండి, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సత్య (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ (??)
గానం : బాలు, సుశీల 

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


కలలూరించనీ నీకళ్ళు చెలరేగించనీ పరవళ్ళు
నీచూపులో వుంది మందారం 
అది నాకు కావాలి సింధూరం
రాగాల నీ నవ్వులోన రతనాలు నేనేరుకోనా
ఊరింత కవ్వింత పులకింత కలిగేను 
కరిగేను నీ చెంత ఒళ్ళంతా

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణ
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో

లాలలాలలాలా..లాలా..మ్.ఊఊఊ..
లాలలాలలాలా..లాలా..హే...
లాలాలాలాలలా..లాలాలాలాలలా..

అపురూపం కదా నీ స్నేహం 
అనురాగానికే శ్రీకారం
అణువణువు నీలోన వున్నానే
అనుబంధమే పంచుకున్నానే
నీ కంటి పాపల్లె నేను.. 
వుంటాను నీ తోడు గాను
నీ మాట నా పాట కావాలీ 
నీ వెంట ఈ జంట కలకాలం సాగాలి

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో 
 
ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
 
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

ఆదివారం, మార్చి 02, 2014

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..

అనూప్ రూబెన్స్ సంగీతంలో కొన్ని పాటలు భలే ఉంటాయి అదీ శ్రేయ పాడిందంటే ఇక మాట్లాడడానికి ఏముంటుంది పాట వింటూ మైమరచి పోవడం తప్ప :-) శ్రీమణి సాహిత్యం కూడా బాగుంటుంది. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.




చిత్రం : సుకుమారుడు (2013)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : శ్రీమణి
గానం : శ్రేయ ఘోషల్

అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓహోహో..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓఓఓ..అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..

సరదాకైనా ఏ ఆడపిల్లైనా.. నిను చూస్తుంటే ఉండగలనా
నిన్నే దాచేసి లేవు పొమ్మంటా.. నీకే నిన్నే ఇవ్వనంటా
అరె.. నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేరే..
హా..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

ఓఓఓ..రహదారుల్లో పూలు పూయిస్తా.. నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా.. నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

శనివారం, మార్చి 01, 2014

ఊఁ అన్నా.. ఆఁ అన్నా..

మొన్న విజయభాస్కర్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు తలచుకుంటుంటే ఈ పాట గుర్తొచ్చింది. వేటూరి, ఏసుదాసు గారు తోడవటంతో ఈ పాట కొత్త అందాన్ని సంతరించుకుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. కింద పోస్టర్ చూసి కూడా వీడియో చూసే ధైర్యమున్న వాళ్ళు ఎంబెడ్ చేసిన వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు :-)



చిత్రం : దారి తప్పిన మనిషి (1981)
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్, సుశీల

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న తలపు వలపైనప్పుడు ..కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే.. కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో.. తొలి వలపో.. మరుపో.. మైమరుపో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న కనులు రెండే అయినా.. కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా.. ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే.. కలలు పండి నిజమౌతాయి
కల అయినా.. నిజమైనా.. కలదు కదా కథ తరువాయి
కలయో.. ఇది నిజమో.. కథయో.. వైష్ణవమాయో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

నిదురించిన తూరుపులో నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా.. నేవిన్నా.. ఔనన్నా.. కాదన్నా
అవునంటే నీతో ఉన్నా... కాదన్నా నీలో ఉన్నా

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు

ఆహాహాహహా...  ఆహాహాహహా

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.