గురువారం, జులై 20, 2017

చక్కనైన ఓ చిరుగాలి...

ప్రేమ సాగరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...


మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నా హృదయం 
కరువైపోయే ఆనందం
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అయిపోయె చెరసాల

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం..

నా ప్రేమ రాగాలు కలలాయె
కన్నీటి కథలన్ని బరువాయే
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం
వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను..

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం.
..

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను.. ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం..
ఈ  నా ప్రేమ సందేశం

 

బుధవారం, జులై 19, 2017

మల్లెపూల చల్లగాలి...

మౌనరాగం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే.. ఈనాటికీ.. మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా

తామరలపైనా నీటిలాగా
భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ
సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా ప్రేమ బంధాలు లేకా
మోడంటి జీవితం ఇంకేలా ! హ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో .. ఏల ఈవేళ

వేదికై పోయే మన కధంతా
నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే హృదయమంతా
బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం పంచవేలా సుగంధం
నా గుండె గుడిలో నిలవాలీ .. రా !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే ఈనాటికీ మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా 

 

మంగళవారం, జులై 18, 2017

ఈదురుగాలికి మా దొరగారికి...

కటకటాల రుద్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు
రచన : వేటూరి
గానం: బాలు, సుశీల

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగింది..
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

హహ..ఉ హు ఉహు....
హహా..ఉహూ..ఉహు ఉహు..

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..
హహ...ఉ హు ఉహు..
హహా..ఉహూ..ఉహు ఉహు..
లల లలా..హుహు హుహూ

తడిసినకొద్ది..బిగిసిన రైక 
మిడిసి మిడిసి పడుతుంటే..
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే....

తడిసే వగలు రగిలే సెగలు 
చిలిపి చిగురులేస్తుంటే..
నా కలలు నిదుర లేస్తుంటే..
నీ కళలు గెలలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

లల లలా.. ఉహు ఉహూ
హెహె హెహే.. ఉహు ఉహూ

కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే 
కౌగిలి కోరుతు ఉంటే
నా పెదవులెర్రబడుతుంటే
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో 
ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే..
నీ హొయలు లయలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది

హహ హహా..ఉహు ఉహూ
హహ హహా..ఉహు ఉహూ
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ


సోమవారం, జులై 17, 2017

గంధపు గాలిని...

ప్రియురాలు పిలిచింది చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రియురాలు పిలిచింది(2000)
సంగీతం : రెహమాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : శంకర్ మహదేవన్

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే 

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ....
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగె చెలీ....
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
 
తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ....
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ....
విశ్వ సుందరీమణులె వచ్చి
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
న్యాయమా... న్యాయమా
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
మౌనమా... మౌనమా
ఏమి చేయమందువే
 

ఆదివారం, జులై 16, 2017

వసంతాల ఈ గాలిలో...

ఇది మా అశోగ్గాడి ప్రేమ కథ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో దొరకలేదు, ఎంబెడెడ్ వీడియో ఆడియో జ్యూక్ బాక్స్ మాత్రమే అది ఇక్కడ కూడా చూడవచ్చు.


చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం : ఆనంద్ మిలింద్
సాహిత్యం : వేటూరి
గానం : అభిజిత్

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాలనీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు
వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ ఈ పూల గంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమలే

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


ప్రేమించినా కళ్ళకూ నిదురన్నదే రాదులే
ప్రేమించినా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే
ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ
వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ
అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు

 

శనివారం, జులై 15, 2017

జివ్వుమని కొండగాలి...

లంకేశ్వరుడు సినిమాలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : దాసరి 
గానం : మనో, జానకి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చనీ.. కోరికా.. రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తియ్యనీ.. కానుకా.. దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది 
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో..
కాశ్మీర వాగుల్లో పరుగులకే
కొత్త అడుగుల్ని నేర్పావో..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లొ పూలన్ని పానుపుగా
మన ముందుంచే పూలగాలీ..
 
పూవుల్లొ దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది


శుక్రవారం, జులై 14, 2017

పిల్లగాలి అల్లరి...

అతడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రేయాఘోషల్

పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి,ఝల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో, వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన

మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల వొడిలో ఈళ్ళని మురిపించగా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం

నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోదా హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

 

గురువారం, జులై 13, 2017

చలిగాలి కొట్టిందమ్మ...

ఖైదీ నంబర్ 786 చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖైదీ నంబర్ 786 (1988)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, జానకి

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో

ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో 
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో 
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో
ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో 
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

నా సలహా ఒకటే చలి వేళా
ఓం నమః ఒడిలో చదవాలా
నీ తరహా తెలిసే పిలగాడా
యం యమః కలిశా కసితీరా
ఆస్తో పాస్తో చదివించుకో కాస్తో కూస్తో కవ్వించుకో
జోడు కుంపట్లు కావాలా ఈడె తంపట్లు వెయ్యాలా
ఒకటే దుప్పట్లో దూరాలా
నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల
ఓ..ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో.. ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో.. ఎందిట్లో

నా నడుమే కసిగా ఊగాలా
నీ నడకే ఉసిగా సాగాలా
నీ రుచులే ఒడిలో చూడాలా
నా పెదవే తడిగా మారాలా
పిచ్చో వెర్రో ప్రేమించనా గిల్లో గిచ్చో వేధించనా
ఊరే పొద్దెక్కి పోవాలా ఈడే తెల్లారి పోవాలా
చల్లో కొంకర్లు పోవాలా
ఈ కొండకోనల్లో తుళ్ళింతలాడాలా
ఓ...ఓ..ఓ... ఓ... ఓ.. ఓ... ఓ.. ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో

ఎందిట్లో ఏమౌతాదో అందిట్లో ఏమౌతాదో
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ..


బుధవారం, జులై 12, 2017

చెప్పవే చిరుగాలి...

ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత 

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో
అడుగే అలై పొంగుతుందీ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ చుట్టూ ఇంకా రేయున్నా
అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ 
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతు 
ఉంటే ఆపగలవా షికార్లు
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
 
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కధ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ
చెవిలో సన్నాయి రాగంలా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏటిని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా
పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ
హో చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో
 చూపదా వసంతాల కేళీ


చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ

చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

 

మంగళవారం, జులై 11, 2017

పూచే పూలలోన...

గీత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో అలభ్యం, ఎంబెడ్ చేసినది ఈటీవీ స్వరాభిషేకంలో బాలుగారు పాడినది ఇక్కడ చూడచ్చు.


చిత్రం: గీత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జి.కె.మూర్తి
గానం: బాలు

పూచే పూలలోనా.. వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే..
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ .... ఓ చెలీ ....

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే.. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ... ఓ చెలీ...

ఎన్నో జన్మల బంధము మనదీ..
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ..
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.