సోమవారం, జులై 20, 2015

కొండా కోనల్లో లోయల్లో...

పచ్చదనంలో ఏకమైన ఈ చిన్నవాడు గానాన్ని తనకి వరంగా ఇచ్చింది అందమైన ప్రకృతే అని తెలుపుతూ ఆ ఆనందాన్ని ఒక అందమైన పాటగా కూర్చి తోటి కుర్రాళ్ళతో ఎలా ఆడీ పాడుకుంటున్నాడో మీరూ చూసీ విని ఆనందించండి. సిరివెన్నెల గారి తేట తెలుగు సాహిత్యం అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వాతి కిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీ జయరాం, కోరస్

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా
 
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా..
ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ
ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఆ..
గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా
చెట్టుపుట్టా నెయ్యంగా  ఆ.. చెట్టాపట్టాలెయ్యంగా హా..
చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఓఓ..
లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో..
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ....


ఆదివారం, జులై 19, 2015

గోదారి రేవులోన...

గోదావరి ఒడ్డున పెరిగిన ఈ అమ్మాయి గొప్పలూ కాబోయే వాడి గురించి మనసులో ఉన్న కోరికలూ కలిపి ఒక హుషారైన పాటకట్టి వినిపిస్తోంది. ఆ సందడేమిటో మీరూ వినండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రుక్మిణి (1997)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : సుజాత 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..
ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..
పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే 
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే 
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి 
చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు....
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె....

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే 
ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ 
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు
ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


శనివారం, జులై 18, 2015

భద్రుని చరితం.. / కురిసే వెన్నెల్లో...

గోదావరి మహా పుష్కరాల సంధర్బంగా పాటలను తలచుకుంటూ గోదావరి ఒడ్డున కొలువైన భద్రాద్రి రాముడ్ని తలచుకోకుంటే ఎలా అందుకే ఆ భద్రుని చరితం ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అందాల రాముడు (1973)
సాహిత్యం : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : రామకృష్ణ, రాఘవులు,  
వంగల పట్టాభి భాగవతార్(వచనం)

మా తల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా ఓఓహో..ఓహో

ఏవిటోయ్ ఆ మహిమలు ?

శ్రీ మద్రమారమణ గోవిందో హారి
భక్తులారా.. సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున..
పావన గోదావరీ తీరంబున ఒకానొక గిరిని
పరికించి, దానిపై సుంత
విశ్రమించినంత, ఆ కంధరమ్మొక సుందర
పురుషాకృతి దాల్చి.. ఏమనినాడనగా..

ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
మేరు గిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భధ్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ..
కారుణ్యాలయ కామితమీడేర్చ
కలకాలము నిను కొలచెదనూ
ధన్యుడ.. ధన్యుడ...
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా

అని భద్రుడు ప్రార్ధించిన స్వామివారేమన్నారనగా..
వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు
మా తండ్రిమాట చెల్లించవలయును గదా
ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను..
అని వెడలిపోయిరి.. అంతట...

వెడలిన రాముడు వెలదిని బాసి
ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి
కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి
కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా
ఎదురుచూస్తూ ఏవిధముగా శోకించినాడనగా

వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచ్చిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్ము నొందిరి... అపుడు..

కదలెను శ్రీ మహా విష్ణువు
కదలెను భక్త సహిష్టువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖ చక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఎక్కకా
వడివడి కదలెను శ్రీ మహా విష్ణువు
ఆహా కదలెను భక్త సహిష్టువు

శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

గజేంద్ర మోక్ష సన్నివేశంబుకై వడి
స్వామి వారు ఆ విధమ్ముగా కదలగా..

తన వెంటన్ సిరి
లచ్చి వెంట నవరోధవ్రాతమున్
దాని వెన్కను పక్షీంద్రుడు
వాని పొంతను ధనుఃకౌమోదకీ
శంఖ చక్ర నికాయంబునూ

హుటాహుటిని రాగా తొందరయందు
అపసవ్యంబుగా ఆయుధములు ధరించి
స్వామివారు దర్శనంబీయ 
ఆ భక్తశిఖామణి ఏమన్నాడు..

ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్ను బ్రోచు నారాముడవు గావు
నాటి రూపు చూప నమ్మగలను

అని భద్రుడు కోరగా – శ్రీ మహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు, 
ఆ తీరుగనే చేతుల నిల్చెను..
భద్రుడు మహదానంద భరితుడై

ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకుల సోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్య క్షేత్ర లలామా

శభాష్..

అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసిరి.
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను. భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై..
ఒక నాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క
అను భక్తురాలి స్వప్నమ్మున సాక్షాత్కరించి
ఆ వైనమ్ము తెలుపగా ఆయమ భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను.

కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడి కట్టలేని ఈ బడుగు పేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధి వక్రించి నీకే వాసమ్ము కరువా

తాటాకు పందిరే తాటకాంతక
నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను.
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన
కంచెర్ల గోపన్న ఏవిధముగా 
ఆలయ నిర్మాణము గావించెననగా..
ఏవిధముగానా ! అప్పుజేసి..
తప్పునాయనా! గోపన్న చరితములోక విఖ్యాతము..
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
జై.. శ్రీమద్రమారమణ గోవిందో... హారి !

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈచిత్రంలోనిదే పూర్తిగా గోదావరిపైని లాంచీలో చిత్రీకరించిన మరో అందమైన యుగళ గీతాన్ని కూడా తలచుకుందామా... ఈ ప్రేమజంట ఎంత చక్కగా పాడుకుంటున్నారో మీరే చూసీ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

  
చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల

మ్.మ్.ఊ..ఊ..

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ
 

ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

 

ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ.. అమ్మో..
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది

ఇంతకూ..అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు..

పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉబికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏవిటది?

ఎవరమ్మా.. ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ
 

అంతేనా ?
ఇరుగట్లూ ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ
 

ఆపైన ?
అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను

కానీ..చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ

ఎవరమ్మా ఇతగాడెవరమ్మా




శుక్రవారం, జులై 17, 2015

కొండగాలి తిరిగిందీ...

గోదావరిలో పడవ ప్రయాణం.. ఒడ్దున తుళ్ళుతూ పరుగులెత్తే ప్రేయసి.. ఆ ప్రియుడి మనసు మౌనంగా ఊరుకుంటుందా.. కోరిక వరద గోదారై ముంచేయదూ. అచ్చంగా మలయ మారుతంలా హాయిగా సాగే ఈ పాట విని పులకరించని మది ఉండదేమో. మీరూ ఆస్వాదించండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఉయ్యాల జంపాల (1965)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

కొండగాలి తిరిగిందీ......
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..

పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ....
ఆ..ఆ..ఆ..
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికింది
గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
ఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ
ఆఆ..ఓఓ..ఆఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగిందీ ఆ.. గుండె వూసులాడింది
ఆ..ఆ..
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ
 
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ..ఈ..ఈ.
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లి పూలతో నల్లని జెడ నవ్వింది
ఆ..ఆ..ఆ
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ఆ..ఆ ..ఆ..
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
ఆ..ఆ..

కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ


గురువారం, జులై 16, 2015

వయ్యారి గోదారమ్మ...

కొండలు గుట్టల నడుమ ఎన్నో ప్రాంతాలనుండి పారే గోదావరి పొయినన్ని హొయలు ఒంపులు ఇంకెవరికి సాధ్యమవదేమో.. అందుకే ఈ ప్రేమికుడు తన ప్రేయసిని వయ్యారాల గోదావరితో పోలుస్తూ ఎంత చక్కటి పాట అందుకున్నాడో మీరే చూసీ వినీ ఆనందించండి. ఈ పాట వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. హై-క్వాలిటీలో ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ వీడియో లో లిరిక్ చూస్తూ ఇక్కడ వినవచ్చు, సౌండ్ క్లౌడ్ లో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆహాహాహా.. ఉసురుకారాదా.. ఆహా
మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా 

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే హా..ఆఅ
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే హా..ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని 
యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
 
 

బుధవారం, జులై 15, 2015

గోదారి గట్టుంది.. / నాపాట నీనోట..

అసలు గోదావరి పాటలనగానే మొదట గుర్తొచ్చే పాట ఇదే అనచ్చేమో... గోదావరి ఒడ్డున పెరిగే మగువ మనసులోని లోతుల గురించి వివరిస్తూ సాగే ఈ హుషారైన పాట చూసీ వినీ మీరూ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మూగ మనసులు (1964)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల

ఓహూ ఓ ఓ హోయ్
ఓహొహూ ఓ ఓ ఓ
గోదారి గట్టుంది.. గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్
గోదారి గట్టుంది.. గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్

వగరు వగరుగ పొగరుంది.. పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగ పొగరుంది.. పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగ సొగసుంది.. సొగసుని మించె మంచుంది
తీయ తీయగ సొగసుంది.. సొగసుని మించె మంచుంది ఈ ఈ

గోదారి గట్టుంది.. గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్

ఎన్నెల వుంది.. ఎండ వుంది.. పూవు వుంది ముల్లుంది
ఎన్నెల వుంది.. ఎండ వుంది.. పూవు వుంది ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో.. ఇడమరిసే.. ఆ.. ఇది వుంది

గోదారి గట్టుంది.. గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్

పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో.. ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో.. ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ

గోదారి గట్టుంది.. గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే సినిమాలోని ఓ అందమైన జానపదం ఈ పాట. పడవ నడిపే వాడిగా ఏ ఎన్నార్ గారి అమాయకమైన అభినయం కాలేజి అమ్మాయిగా సావిత్రి గారి నటన ఇద్దరికిద్దరే అన్నట్లుంటుంది ఇక ఆత్రేయ గారి సాహిత్యం గురించి చెప్పనే అక్కర్లేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మూగ మనసులు (1964)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల, పి.సుశీల

నా పాట నీ నోట పలకాల సిలక
నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

నా పాట నీ నోట పలకాల చిలక
పలకాల సిలక..
పలకాల చిలక..
యహా... చి కాదు.. సి.. సి.. సిలక
పలకాల సిలక..
ఆఁ..
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
నీ పైట నా పడవ తెరసాప కావాల.. ఆ.. ఆ.. ఆ..
ఆ..ఆ.. అ.. ఓ.. ఓ.. ఓ..
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
సూరేచంద్రుల తోటి సుక్కల్ల తోటి
సూరేచంద్రుల తోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము ఆడనే ఉందాము
ఆటాడుకుందాము ఆడనే ఉందాము

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా.. ఆ.. ఆ..

మంగళవారం, జులై 14, 2015

వేదంలా ఘోషించే గోదావరి...

నేటినుండే పుష్కరాలు మొదలు కదా మరి ఈ సంధర్బంగా గోదావరీ ఆ ఒడ్డునే ఉన్న రాజమండ్రి గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక చక్కని పాటను తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆంధ్రకేసరి (1983)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ
మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు
తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే...

ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి 



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎమ్మెస్ విశ్వనాథన్ గారి జ్ఞాపకాలతో వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 




చిత్రం : గుప్పెడు మనసు [1979]
సంగీతం : ఎం. ఎస్ విశ్వనాధన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : మంగళంపల్లి బాల మురళీ కృష్ణ

మౌనమె నీ భాష ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
 
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా

కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు వున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
 
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా
 


సోమవారం, జులై 13, 2015

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట...

గోదావరి గట్టు మీద ఆ నది నడకలకు ధీటుగా హొయలు పోతూ నడిచే ముద్దుగుమ్మని చూస్తే కుర్రకారు ఆగుతారా మరి, ఈ జంట హుషారుగా ఎలా ఆడి పాడారో మీరే చూడండి. నాకు రేడియో పరిచయం చేసిన పాటల్లో ఈ పాట ఒకటి చాలా ఇష్టం.. ఏఎన్నార్ గారి స్టైల్లో రివ్వుమంటే జివ్వు మంది లాంటి పదాలు మళ్ళీ మళ్ళీ పాడుకునేవాళ్ళం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం :  గోపాల కృష్ణుడు  (1982)
సంగీతం :  చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం :  బాలు, సుశీల

అరే...గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ..ఏం సొగసో.. ఏం వయసో.. 

గోదారి గట్టంట నా దారినెళుతుంటే 
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
గోదారి గట్టంట నా దారినెళుతుంటే 
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అహా.. ఎంత గడుసో..ఏం మడిసో..

బేరమాడ వచ్చానే ఓలమ్మీ
బెంగపడిపోయానే ఓలమ్మీ
బేరమాడ వచ్చానే ఓలమ్మీ
బెంగపడిపోయానే ఓలమ్మీ
ముద్దు నాకు ముదిరెనే... నిద్దరంత కరిగెనే...
రాత కొద్ది దొరికినాడే.. రాతి గుండె కదిపినాడే
పూటపూటకు పూతకొచ్చిన పులకరింత కోరినాడే
అబ్బ... ఏం మడిసో... ఏం వరసో..
అహా.. ఏం వరసో...ఏం మడిసో..

అహ..గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ.. ఎంత గడుసో..ఏం మడిసో..

పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పట్టుకుంటే వదలడే... చెరుపుకుంటే చెదరడే..
వయసులాగా వచ్చినోణ్ణే.. వన్నెలెన్నో తెచ్చినోణ్ణే
ఈల వేసిన గోల పాపల కోలకళ్ళకు మొక్కినానే...
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా...ఏం సొగసో..ఏం వయసో..

గోదారి గట్టంట నా దారినెళుతుంటే 
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అబ్బ.. ఎంత గడుసో..ఏం మడిసో..

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా..ఏం సొగసో.. ఏం వయసో..  


ఆదివారం, జులై 12, 2015

కనపడ లేదా గోదారి తల్లి...

శక్తి ఉండీ తన బిడ్డల ఆకలి పూర్తిగా తీర్చలేకపోతున్నానంటూ గోదారి తల్లి బాధపడుతుందట. పోలవరం ప్రాజెక్టు గురించిన ఈ పాట ప్రతి ఒక్కరినీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు ఉరికిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బన్నీ (2005) 
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : బాలు, కోరస్

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

 
గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని
తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె
శాపం తనకెందుకని
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక 
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక
ఆ అలల అలజడి ఓఓ.. ఆ తడిఆరని కంటితడి ఓఓ... 
ఆ అలల అలజడి ఆ తడిఆరని కంటితడి 
కనబడలేదా వినబడటంలేదా

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చరించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వర కాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
ఓఓఓఓ..ఓఓఓఓఓ...ఓఓఓఓ..ఓఓఓఓఓ


శనివారం, జులై 11, 2015

సిన్ని ఓ సిన్నీ...

కల్లబొల్లి మాటలతో అల్లరిపెడితే వెల్లువ గోదారినై కమ్మేస్తాను అని అమ్మాయి బెదిరిస్తుంటే, గోదారి పొంగై నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే సంతోషంతో తేలిపోతాను అని అబ్బాయంటున్నాడు. గోదావరి ఒడ్డున ఈ ప్రేమ జంట అల్లరి మీరూ చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

సిన్ని ఓ సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
సిన్ని ఓ సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
ఓ వన్నెగాజుల సిన్ని
తుర్రుమని నువ్ వెళ్ళిపోతే..
తూరుపు దిక్కు ఆపేస్తుంది
ఉరుమురిమి చూసావంటే..
ఉత్తర దిక్కు ఊపేస్తుంది
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
 
సిన్ని ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్ని..
ఓ వన్నెగాజుల సిన్నీ

కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే..
నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను..
నిన్ను కమ్మేస్తాను
కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను..
నిన్ను కమ్మేస్తాను

గోదారి పొంగల్లె నామీదికి వురికొస్తే...
గొదారి పొంగల్లె నామీదికి వురికొస్తే..
రాదారి పడవల్లె తేలి తేలి పోతాను ..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్ని ఓ సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ...
ఓ వన్నెగాజుల సిన్నీ

కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం

గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
ఈ గుంటూరి పిలగానికి నాటు సరసం..
అందం..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

 
సిన్ని ఓ సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ..
ఓ వన్నెగాజుల సిన్నీ

పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం...
నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం..
నీ పడుచుదనంలో వుందీ

కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ

అందుకేనేమో....
ఉ... అందుకేనేమో...

తుర్రుమని నే నెళ్ళాలంటే..
తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే..
ఉత్తరదిక్కు ఊపేసింది..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
 
సిన్ని ఓ సిన్నీ.. సిన్ని ఈ సిన్ని..
నీ సన్నజాజుల సిన్ని..
నీ వన్నె గాజుల సిన్ని...
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని..
వెన్నెలై విరబూస్తుందీ ఈ సిన్ని

 
సిన్ని ఓ సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్నీ..
ఓ వన్నెగాజుల సిన్నీ..ఆ..అహ హాహహ అహా
ఓ...ఒహోహో...హోహో ఓహో..


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.