బుధవారం, మే 20, 2015

నాద వినోదము...

సాగరసంగమం చిత్రం లోని ఒక అద్భుతమైన పాట ఈరొజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్. పి. శైలజ

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వందే పార్వతీప రమేశ్వరౌ

నాద వినోదము నాట్య విలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ..
గానములో ఆ.. గమకములో ఆ...
భావములో భంగిమలో
గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ.........
 
ని ని మ ద ని ని.. ని.. మ ద ని స ని.. ని.. 
రి స ని ద ని.. ని  
మ గ మ ద ద  గ మ మ రి గ స 

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
 
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం 

భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం ..
ఆ...
భరతమైన నాట్యం .. ఆ...
బ్రతుకు నిత్య నృత్యం ..
ఆ...
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం 
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ

 

మంగళవారం, మే 19, 2015

సూర్య కిరీటమే నీవా...

తెలుగు సినిమాలకు ఫ్యాక్షన్ కథలను పరిచయం చేసిన "ప్రేమించుకుందాంరా" చిత్రంలో అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపేసిన అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం : మహేష్ మహదేవన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, అనురాధా శ్రీరామ్

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ 
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా

కన్నె శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా 
సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి


సోమవారం, మే 18, 2015

ఊ లలల్లా ఉహూ లలల్లా...

మెరుపు కలలు చిత్రం కోసం రహ్మాన్ స్వరపరచిన ఒక హుషారైన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : శ్రీని, ఉన్నిమీనన్, చిత్ర

ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా
నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పొంకాల పోరి ఒకతి
పోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా..
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా
ఏ రాగం పాడిస్తాడే
సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా
వచ్చిపోయె వాసంతాలే
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

తందానా తందానా ఊసుకనుల తందానా
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా
చెవి నిండా గుమ్మత్తేలే
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం

ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక...
ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా
ఉహూ లల లలలలా

ఆదివారం, మే 17, 2015

మేడ పైన చూడమంట...

అంజలి చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.


చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : కోరస్

మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
ఉచితముగా ఒక సినిమా 
మన కొరకే జరిగెను షో షో షో టాకింగ్ టాకింగ్..
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట

మనసే కదులుతుంటే పైటంచే జారుతుంటే
మనసే కదులుతుంటే పైటంచే జారుతుంటే
సరాగాలు తాకే వేళ ఇదేమి రామా
సరాగాలు తాకే వేళ ఇదేంటి రామా
ఏదేదో అయ్యేనే ఎక్కడికో పోయేనే
పరదాలే సరదాలాపుట కరెక్టా

మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
ఉచితముగా ఒక సినిమా
మన కొరకే జరిగెను షో షో షో కిస్సింగ్..
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట

స్టాప్ డోంట్ మూవ్.. 
వెన్ ఐ సే సంథింగ్ యూ లిజన్ టుదట్ 
వెన్ ఐ షో సంథింగ్ యూ లుక్ ఎటదట్ 
నౌ స్టాప్ ద గేమ్.. డోంట్ టేక్ ద ప్లేస్

త్వరగా జారుకోండి వేడుకలే చాలులేండి
త్వరగా జారుకోండి వేడుకలే చాలులేండి
ఇలా మీరు చిక్కారంటే గొడవే రామా
ఇలా మీరు చిక్కారంటే గొడవే రామా
డేంజరిటే వచ్చింది సిగ్నల్నే ఇచ్చింది
ఇప్పుడే దొరికినచోట దాక్కోండి

మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
మేడ పైన చూడమంట
ఒక లవ్ జంట లవ్ జంట
ఉచితముగా ఒక సినిమా 
మన కొరకే జరిగెను షో షో షో.. మిస్సింగ్..


శనివారం, మే 16, 2015

నువ్వంటే నాకిష్టమని...

సంతోషం సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని పాట ఈ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : రాజేష్, ఉష

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ 

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా 

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ



శుక్రవారం, మే 15, 2015

గుంజుకున్నా నిన్ను...

కడలి చిత్రం కొసం ఏ.ఆర్.రహమాన్ స్వర సారధ్యంలో శక్తిశ్రీ గోపాలన్ అద్భుతంగా గానం చేసిన వనమాలి రచన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కడలి
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శక్తిశ్రీగోపాలన్

గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే
తేనె చూపే చల్లావు నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా

కొత్త మణిహరం కుడిసేతి గడియారం
పెద్ద పులినైన అణిచే అధికారం
నీవెళ్లినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే
ఇంక అది మొదలు నామనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా 

గుంజుకున్నా నిన్ను ఎదలోకే

గువ్వే ముసుగేసిందే రావాకే కునికిందే
పాలేమో పెరుగులాగ ఇందాకే పడుకుందే
రాసకురుపున్నోళ్లే నిదరోయే వేళల్లోన
ఆశ కురుపొచ్చి ఎదే అరనిమిషం నిదరోదే

గుంజుకున్నా నిన్ను ఎదలోకే

ఎంగిలి పడనే లేదే అంగిలి తడవనే లేదే
ఆరేడునాళ్లై ఆకలి ఊసేలేదే
పేద ఎదనే దాటి ఏదీ పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరేదే హ..

హో..గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
 ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే


గురువారం, మే 14, 2015

అరెరే పసి మనసా...

సిరివెన్నెల గారు రాసిన ఈ ప్రేమ గీతమ్ ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : నరేంద్ర, శ్రావణ భార్గవి

అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...
తననొదిలి ఎటువైపు కను కదలని చూపు
నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు
ఊహ విహారమా సాగే సరాగమా
సరదా తగదు సుమ సుతారమా
 
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే 
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే 
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే

అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...

అవునా... ఇతనేనా ఇన్నాళ్ళు యెదరున్నది కాదా మరి
అయినా... ఇంతకుముందేనాడు పరిచయమైనా లేనట్టుంది

 ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా
వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా
కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం
తెలిపి కథా క్రమం ఏం చెబుతాం
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే

అబలా... ఏమైపొతున్నావే సుడిగాలిలో చిగురాకులా
నువ్వలా... ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో
నీలో ఇదే కదా మొదలు ఈ నిషా లయలు గమనించావా
లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా
ఏదో అయోమయం అయినా మహా ప్రియం
దాన్నే కదా మనం ప్రేమంటాం



బుధవారం, మే 13, 2015

ఓ పిల్ల జాజి మల్లిరా...

హృదయం సినిమాలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది హృదయం పాటల యూట్యూబ్ జ్యూక్ బాక్స్. తెలుగు వీడియో దొరకలేదు తమిళ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : హృదయం (1992)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం :  బాలు

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా
ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా
వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి
మనసులు తేలించి మురిపించావులె నీకే జోహారే !

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా

లేటైనా వేచుంటే బస్ దొరుకూ
జత చేరి ప్రేమిస్తే కిస్ దొరుకూ
ఆడవాళ్ళే చిన్న చూపూ బస్సులకే
చేదోడు మేముంటాం మిస్సులకే
వెంటబడి మేమొస్తేనే మీకు రక్షణే
చల్లని చూపు పడిందా మాకు మోక్షమే

కలిసొస్తే అనురాగం .. ఆ ఆ ఆ
కాదంటే అది శోకం
నిను యవ్వనమే పిలిచేనే వెన్నెలమ్మా రావే !

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా
వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి
మనసులు తేలించి మురిపించావులె నీకే జోహారే !

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా

పిల్లలనే నువు కంటే పండుగలే
పుస్తకాలు నువు మోస్తే పాపములే హయ్యో
పడకగదీ పాఠాలకు మేము రెడీ
ఓ చిలకా నా మనసే నీకు బడీ

చెలి నీ అందచందాలే దాచి పెట్టొద్దే
నాలో ఆశ రేగించి రెచ్చగొట్టొద్దే
మందారం నీ సొగసే .. ఆ ఆ ఆ
పాషాణం నీ మనసే
నును మీసమున్న మగవాళ్ళం నిను కొలిచాం రావే !

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా
వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి
మనసులు తేలించి మురిపించావులె నీకే జోహారే !

ఓ పిల్ల జాజి మల్లిరా..ఓ బ్యూటీ అంటే బ్యూటి రా


మంగళవారం, మే 12, 2015

ఆనందమౌగా పల్లెసీమా...

జీవితం చిత్రం కోసం ఆర్.సుదర్శనం గారి స్వరసారధ్యంలో ఎస్.వరలక్ష్మి గానం చేసిన ఒక చక్కని గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : ఎస్.వరలక్ష్మి

ఓఓఓఓఓ...ఒహొహొఓఓఓఒహొ..లాలాలాల...
ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమాఆఆ.. పల్లెసీమా

రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో...ఓఓ...
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో పల్లెసీమలో
మామంచి తీరు మా ఊరు
మామంచి తీరు మా ఊరు 
తీయని నీరు కోనేరు 
తీయని నీరు కోనేరు 

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
మాతోడ కూడి మా తోవ చేరి
మాతోడ కూడి మా తోవ చేరి
మన దేశానికి సేవ చేయాలి 
మన దేశానికి సేవ చేయాలి

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమా..ఆ.. పల్లెసీమా



సోమవారం, మే 11, 2015

కనులు కనులను...

దొంగ దొంగ చిత్రం కోసం రహమాన్ స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దొంగ దొంగ (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : మనో

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం....

వాగులై ఉరికితే...వయసు కులుకే అని అర్థం..
కడలియే పొంగితే...నిండు పున్నమేనని అర్థం...
ఈడు పకపక నవ్విందంటే...ఊహు.. అని దానర్థం
అందగత్తెకు అమ్మై పుడితే..ఊరికత్తని అర్థం.. అర్థం..

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...
కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం...

పడవలే నదులకు...బంధుకోటి అని అర్థం..
చినుకులే వానకు...బోసినవ్వులే అని అర్థం..
వెల్ల వేస్తే చీకటికి అది...వేకువౌనని అర్థం..
ఎదిరికే నువ్వు ఎముకలిరిస్తే...విజయమని దానర్థం అర్థం...

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.