శుక్రవారం, డిసెంబర్ 23, 2011

కరుణించు.. నడిపించు..

సినిమా క్రైస్తవ చిత్రం కాకపోయినా క్రైస్తవ సినిమాపాటలు అనగానే మొదట గుర్తొచ్చేది మిస్సమ్మలోని "కరుణించు మేరి మాతా" అన్నపాట. లీలగారు పాడిన ఈ పాట సావిత్రి గారిపై చిత్రీకరించడం మరింత వన్నె తెచ్చింది. చిన్నపుడు రేడియోలో తరచుగా వినడమే కాదు కొందరు క్రైస్తవ మిత్రుల ఇంటికి వెళ్ళినపుడు సైతం ఈ పాట వారి కలెక్షన్ లో ఖచ్చితంగా ఉండేది. ఆడియో ఇక్కడ వినవచ్చు.

చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : లీల

కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ..
పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ..
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష..

కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

భువి లేని దారిజేరీ పరిహాసమాయే బ్రతుకు
భువి లేని దారిజేరీ పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే

కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈ పాట సినిమా పాటకాకపోయిన తెలుగు క్రైస్తవ గీతాలలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పాట. మాసిలామణి గారు రాసిన ఈపాట చరణాలన్నీ ఒకే విధమైన పదాల అల్లికతో సంగీతంతో ఎన్ని చరణాలున్నా పాడడం సులువుగా ఉంటుంది. ఈ పాట పూర్తి లిరిక్ కోసం ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు నచ్చిన మొదటి మూడు చరణాలను మాత్రం పొందుపరుస్తున్నాను. వీడియోలు అన్నీ రిమిక్స్ వర్షన్స్ దొరికాయి కానీ చిన్నప్పుడు నేను విన్న పాటలో అయితే సింపుల్ అర్కెస్ట్రేషన్ తో వినడానికి మరింత హాయినిచ్చేది.

నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప

నా జీవిత తీరమున, నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ, నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము, నా సేవ జేకొనుము

నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప

రాత్రంతయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను, రాదాయెను  ప్రతిఫలము
రక్షించు నీ సిలువ, రమణీయ లోతులలో
రాతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవ  

నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప

ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే, అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే, ఆవేదనేదురాయే
ఆధ్యాత్మిక లేమిగని, అల్లాడే నా వలలు 

నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప

గురువారం, డిసెంబర్ 22, 2011

రాజ్యము బలమూ మహిమా

క్రిస్మస్ సంధర్బంగా ఈ నెల 25 వరకూ ఈ నాలుగు రోజులూ రోజుకొకటి చొప్పున నాకు పరిచయమున్న క్రైస్తవ సినిమాల పాటలనూ చిన్నప్పుడు రేడియోలోనూ కొందరు స్నేహితుల ద్వారాను విన్నవాటిలో నాకు నచ్చిన పాటలను మీకు వినిపిద్దామనుకుంటున్నాను. ఇలాంటి పాటలలో మొదటిగా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాజాధిరాజు సినిమాలోని "రాజ్యము బలమూ" పాట వినడానికి చాలా బాగుంటుంది మహదేవన్ గారి సంగీతం వేటూరి గారి సాహిత్యాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. శారద గారిపై చిత్రీకరించిన ఈ పాట వీడియో రెండు చరణాలు రెండు వీడియోలు గా దొరికాయి అవి ఇక్కడ చూడవచ్చు. ఆడియోకావాలంటే చిమటమ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. 
---


చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల

రాజ్యము బలమూ మహిమా.. నీవే నీవె..

జవము జీవమూ జీవన.. నీవే నీవే..
మరియ తనయా మధుర హృదయా.. ||2||
కరుణామయా.. ||2||

||రాజ్యము బలమూ||

అవసరానికీ మించీ ఐశ్వరమిస్తే..
మనిషీ కన్నూమిన్నూ కానబోడేమో..
కడుపుకు చాలినంత కబళమీయకుంటే..
మనిషి నీతీ నియమం పాటించడేమో..
మనిషి మనుగడకు సరిపడనిచ్చీ..
శాంతీ ప్రేమా త్రుప్తి నిచ్చీ.. ||2||
గుండె గుండె నీ గుడిదీపాలై..
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా.. నీ రాజ్యమీవయ్యా..

అర్హతలేని వారికీ అధికారం ఇస్తే..
దయా ధర్మం దారి తప్పునేమో..
దారి తప్పిన వారిని చేరదీయకుంటే..
తిరిగి తిరిగి తిరగబడతారేమో..
తగిన వారికి తగు బలమిచ్చీ..
సహనం క్షమా సఖ్యతనిచ్చీ.. ||2||
తనువు నిరీక్షణ శాలై..
అణువు అణువు నీ రక్షణసేనయ్యే
బలమీవయ్యా.. ఆత్మ బలమీవయ్యా..

శిలువపైన నీ రక్తం చిందిన నాడే..
శమదమాలు శోబించెను కాదా..
నీ పునరుత్ధానంతో రక్షణ రాజిల్లీ
శోకం మరణం మరణించెను కాదా..
చావు పుటుక నీ శ్వాసలనీ..
దయా దండన పరీక్షలనీ.. ||2||
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలనీ
సత్యం మార్గం సర్వం నీవనీ
మహిమ తెలుపవయ్యా.. నీ మహిమ తెలుపవయ్యా..

||రాజ్యము బలమూ||



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఇదే సినిమాలో హాస్యగీతంగా చెప్పుకోదగిన పాట "కొత్తాదేవుడండీ" నూతన్ ప్రసాద్ విజయచందర్ పై చిత్రించిన ఈ పాట వీడియోను ఇక్కడ చూడండి. ఆడియో ఇక్కడ వినవచ్చు. ఇది కూడా నాకు సరదాగా అప్పుడపుడు పాడుకోవడం ఇష్టం, సాహిత్యం సరదాగా ఉంటే అందులో కొన్ని పదాలను బాలు పాడిన విధానం గమ్మత్తుగా ఉంటుంది :-)


చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, బృందం

కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ (2)
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ (2)
బాబు రాండీ రాండీ శిశువా...
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ అండండీ

నేలకు సొరగం దించాడండీ
దించిన సొరగం పంచాడండీ
నెత్తిన చేతులు పెడతాడండీ
నెత్తినెట్టుకొని ఊరేగండీ॥॥

||కొత్తా దేవుడండీ||

అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ రాసిచ్చేస్తాం
అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ...
శృంగారంలో ముంచీ తేల్చీ
బంగారంలో పాతేయిస్తాం
వీరే మీకు సమస్తా వీరికే మీ నమస్తా
దుష్ట రక్షణం శిష్ట శిక్షణం
చేసేయ్ చేసెయ్ మోసేయ్ మోసెయ్ (2)॥

||కొత్తా దేవుడండీ||

అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి
అసలుకు ఎసరే పెట్టచ్చండి
పీపాలెన్నో తాగొచ్చండి
పాపాలెన్నో చేయొచ్చండి ॥
పాత దేవుడు పట్టిన తప్పులు
ఒప్పులకుప్పులు చేస్తాడండీ (2)
కొత్త దేవుని కొలిచిన వారికి
కొక్కొక్కొ కొదవే లేదండీ
రాండీ బాబూ రాండీ శిశువా...॥

బుధవారం, డిసెంబర్ 21, 2011

జై జై రాధారమణ హరి బోల్..

ఒకే మాటని తిరగేసి మరగేసి వెనక్కి ముందుకీ లాగీ పీకి పదే పదే పాడడమే కదా భజనలంటే... అబ్బబ్బ ఓట్టి బోరు బాబు అని అనుకునే వాడ్ని కొంతకాలం క్రితం వరకూ.. అసలు పూర్తిగా చివరివరకూ వినే ఓపిక కూడా ఉండేది కాదు. కానీ మొదటిసారి బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలోని విశాలాక్షి మంటపంలో వందలమందితో కలిసి కూర్చుని ఈ భజనలో గొంతు కలిపినపుడు ఆశ్చర్యమనిపించింది. కృష్ణ భజనకావడమో... వందలమంది మధ్య వైబ్రేషన్స్ కారణమో కాని ఒక అవ్యక్తానుభూతికి లోనయ్యాను నాకే తెలియకుండా తన్మయత్వంతో ఊగిపోయాను. మంద్రంగా నిశ్చలంగా పారుతున్న సెలయేరులా నెమ్మదిగా మొదలయ్యే భజన రకరకాల స్థాయిలలో పెరుగుతూ చివరికొచ్చేసరికి ఉదృతంగా ఎగిరిదూకే జలపాతమై ఒళ్ళంతా పులకింప చేస్తుంది. ఈ భజన ఒక సారి మీరూ విని చూడండి. ఆడియో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్రయత్నించండి.

 జైజై రాధారమణ హరి బోల్.. 
జైజై రాధారమణ హరి బోల్..
   

మంగళవారం, డిసెంబర్ 20, 2011

సువ్వీ కస్తూరి రంగా..

రమేష్ నాయుడి గారి కమ్మనైన సంగీతంలో హాయైన ఈ పాట ఒకసారి విన్నవారు ఎవరైనా మర్చిపోగలరా ? మీరూ మీడియం వాల్యూంలో పెట్టుకుని ఒకసారి వినండి. ప్రారంభంలోనే మురళీ నాదంతో పాటు వచ్చే ఆలాపన వింటూంటే అలా సాయం సంజెలో మెల్లగావీచే చల్లని గాలి శరీరాన్నీ మనసునీ తేలిక పరుస్తుంటే మెల్లగా కళ్ళుమూసుకుని ఊయలపై కూర్చున్న అనుభూతినిస్తే "సువ్వీకస్తూరి రంగా" అంటూ జానకమ్మ గారు పాట అందుకోగానే నేపథ్యంలో క్రమం తప్పకుండా ఒకే రిథమ్ లొ సాగే సంగీతం మెల్లగా మనని ఊయలలూపుతుంటే మనసు అలా అలా గాలిలో తేలిపోతుందంటే అతిశయోక్తికాదేమో. రమేష్ నాయుడి గారి సంగీతానికి నేను దాసోహమనడానికి ఈ సింపుల్ ఆర్కెస్ట్రేషన్ ఒక కారణమేమో అనిపిస్తుంటుంది. ఇక మధ్యలో పడవ నడిపే వాళ్ళ పదాలతో ’హైలెస్సా హయ్య’ అంటూ వచ్చే కోరస్ పాటకు మరింత అందాన్నిస్తుంది.  ఈ సినిమా నేను చూడలేదు ఈ పాట నేపధ్యం గురించి అస్సలు తెలీదు కానీ వినడం మాత్రం చాలా ఇష్టం.  మీరూ ఇక్కడ విని ఆనందించండి.    

చిత్రం : చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : జానకి, బాలు.

సువ్వి ఆహు.. సువ్వి ఆహు.. సువ్వి.. సువ్వి..
ఆ..ఆ...ఆఅ....హోయ్..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు.. ఓ చెలియా.. ||2||
నా వద్దకు వచ్చెను ఓ సఖియా..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
వంగి వంగి నను తొంగి చూచెను కొంగుపట్టుకుని లాగెనుగా.. ||2||
భల్ ఛెంగున యమునకు సాగెనుగా..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్లభామలను కూడితినీ..
నే గొల్లా భామనై ఆడితిని.. నే గొల్లా భామనై ఆడితిని..

సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..

సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..ఆఅ....
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..
హబ్బ.. అద్దినట్టుందె ఓ సఖియా...
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..

సోమవారం, డిసెంబర్ 19, 2011

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా..

శుభోదయం నేస్తాలూ.. ఎలా ఉన్నారు ? నేను బ్రహ్మాండంగా ఉన్నాను :-) చాలామందిని కామెంట్ల ద్వారానూ, బజ్ మరియూ ప్లస్ ద్వారాను పలకరిస్తూనే ఉన్నాను కనుక పెద్దగా మిస్ అవలేదు కానీ సంకలినులకు రావడం తగ్గించడం వలన కొందరి బ్లాగులని మిస్ అయ్యాను, అవన్నీమెల్లగా కవర్ చేయాలి. ఈ బ్లాగులో హాయిగా బజ్జున్న బుజ్జి పాండాగాడ్ని నిద్రలేపడానికి మనసురాడంలేదు కానీ ఇప్పటికే చాలా రోజులైంది ఇక చాలులే మంచి మంచి పాటలతో నా బ్లాగ్ నేస్తాలకు కబుర్లు చెప్పేయాలి అని అన్నగారినీ ఘంటసాల గారినీ వెంటబెట్టుకుని ఇదిగో ఈ మాంచి మేలుకొలుపు పాటతో నిద్రలేపేశాను. ఇకపై రోజూ అని చెప్పలేను కానీ కాస్త తరచుగానే కలుసుకుని కబుర్లు చెప్పుకుందాం.

ఈ పాట నాకు చాలా ఇష్టమైన స్ఫూర్తిదాయకమైన గీతాలలో ఒకటి. రామారావు గారి నటన ఘంటసాల గారి గాత్రం రెండూ అద్భుతంగా ఉంటాయి. ఇక కొసరాజు గారి సాహిత్యం టివిరాజు గారి సంగీతం గురించి చెప్పడానికి ఏముంది. ఇంటర్మీడియేట్ రోజులలో నాకో మిత్రుడు ఉండేవాడు వాడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా “అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి” అంటూ అచ్చంగా అన్నగారిని అనుకరిస్తూ గంభీరంగా ఈపాటందుకునే వాడు ఆ విధంగా ఈ పాట తరచుగా వింటూండేవాడ్ని. మీరూ పాట విని/చూసి ఆనందించండి. వీడియో ప్లే అవ్వకపోతే ఈ పాటను ఇక్కడ వినవచ్చు...

అన్నట్లూ కొత్తావకాయ గారు రేపల్లెలో జరిగిన కథ అంటూ ధనుర్మాసమంతా రోజుకొంచెం చొప్పున కన్నయ్యకథ చెప్తున్నారు చదివారా? అదే పోస్టులలో తిరుప్పావై పాశురాలకు దేవులపల్లి వారి తెలుగుసేతనుండి రోజుకో కమ్మని పాటను సైతం అందిస్తున్నారు. మీరు ఇంకా చూసి ఉండకపోతే అర్జంట్ గా ఇక్కడ చదివేయండి.


చిత్రం : శ్రీకృష్ణపాండవీయం
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : కొసరాజు
గళం : ఘంటసాల

అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

సాగినంత కాలమ్ము నా అంత వాడు లెడందురు
సాగకపోతే ఊరక చతికిల బడి పోదురు
కండబలము తోటే ఘనకార్యము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

చుట్టు ముట్టు ఆపదలను మట్టుబెట్ట పూనుమురా
చుట్టు ముట్టు ఆపదలను మట్టుబెట్ట పూనుమురా
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చెపట్టుమురా
కర్తవ్యం నీ  వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

సోమవారం, జనవరి 24, 2011

విరామం


నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శలవు.

సోమవారం, జనవరి 17, 2011

నా నెచ్చెలీ.. నా నెచ్చెలీ - డ్యుయెట్

డ్యుయెట్ రహ్మాన్ పాటలలో గుర్తుంచుకోదగిన ఆల్బం. సినిమా ఫ్లాప్ అవడం వలన అంజలీ అంజలీ పాట తప్ప మిగిలిన పాటలు అంత ప్రాచుర్యాన్ని పొందలేదు కానీ ఇంకా రెండు మూడు పాటలు బాగుంటాయ్. వాటిలో నాకు బాగా నచ్చిన పాట ఈ "నా నెచ్చెలీ.." పాట. Sax ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుని రహ్మాన్ పాటకు మంచి ఫీల్ తెచ్చాడు. సినిమా చూశాక కొన్నాళ్ళు ఎలాగైనా Sax నేర్చుకోవాలని కలలు కన్నాను :-) ఇక పాటలో బాలు గారి స్వరవిన్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వెన్నెలకంటి గారి సాహిత్యంకూడా బాగుంటుంది. ఈ పాట మ్యూజిక్ మజా ప్లగిన్ లో వినవచ్చు.    


<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Duet.html?e">Listen to Duet Audio Songs at MusicMazaa.com</a></p>
ఈ పాటకు తెలుగు వీడియో దొరకలేదు తమిళ వర్షన్ "ఎన్ కాదలీ.." వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : డ్యూయట్
సంగీతం : ఎ ఆర్ రహ్మాన్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలూ

నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..

శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె

||నా నెచ్చెలీ||

నెచ్చెలీ నీ పూజలకె నా మనసులోని ప్రణయం
నా చెలీ నువు కాదంటె ఎద రేగుతుంది విలయం
నా ప్రేమ నే.. ఈ దెవతా... కరుణించదా.. బతికించదా
అమృతం ఇలా విషమైనదా కలనేడు శిల ఐనదా...

||నా నెచ్చెలీ||

నా కలై నువు రాకుంటె ఎద వగచి వగచి పగిలె
నా జతే నువు లేకుంటే మది సెగల రగిలి పొగిలె
ఓ నేస్తమా.. నా ప్రాణమా.. కల తీరదా ఓ మౌనమా
ఇది న్యాయమా.. ఇది ధర్మమా.. ప్రేమిస్తే అది నేరమా...

||నా నెచ్చెలీ||

శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె...

శనివారం, జనవరి 15, 2011

Elvis - You were always on my mind

ఈపాట ఇదివరకు మీరు వినే ఉంటారు .. సాధారణంగా ప్రేమికుడు భర్తయ్యాక భాగస్వామి వద్ద తన ప్రేమను చూపించడంలో ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే నేనేం చేస్తున్నా నీ గురించే ఆలోచిస్తున్నాను కానీ ఆ విషయం నీకు చెప్పలేకపోయాను నాకు మరో ఛన్స్ ఇవ్వమంటూ అడిగే అందమైన ఈ పాటతో ఈ సిరీస్ ప్రస్తుతానికి ముగిస్తున్నాను. పాట సాహిత్యాన్ని చదువుతూ వినండి. 



Maybe I didn't love you quite as good as I should have,
Maybe I didn't hold you quite as often as I could have,
Little things I should have said and done,
I just never took the time.

You were always on my mind,
You were always on my mind.

Maybe I didn't hold you all those lonely, lonely times,
And I guess I never told you, I'm so happy that you're mine,
If I made you feel second best,
I'm sorry, I was blind.

You were always on my mind,
You were always on my mind,

Tell me, tell me that your sweet love hasn't died,
Give me, give me one more chance to keep you satisfied,
If I made you feel second best,
I'm sorry, I was blind.

You were always on my mind,
You were always on my mind.

శుక్రవారం, జనవరి 14, 2011

Elvis - Let me be Your teddy bear

ఈ పాటలో గిటార్ మీద డ్రమ్స్ లా దరువేస్తూ కులుకుతూ ఇచ్చే చిన్ని చిన్న డాన్స్ మూవ్మెంట్స్ చాలా సరదాగా ఉంటాయి. ఈ పాట పాడే విధానం కూడా అల్లరిగా సరదాగా ఉంటుంది.


Baby let me be,
Your lovin' Teddy Bear
Put a chain around my neck,
And lead me anywhere
Oh let me be
Your teddy bear.

I don't wanna be a tiger
Cause tigers play too rough
I don't wanna be a lion
'Cause lions ain't the kind
You love enough.
Just wanna be, your Teddy Bear
Put a chain around my neck
And lead me anywhere
Oh let me be
Your teddy bear.

గురువారం, జనవరి 13, 2011

Elvis - Devil in Disguise

ప్రేయసిని నువ్వు దేవతలా కనిపిస్తున్నావంటూ పొగుడుతూ మొదలయ్యే ఈ పాట అంతలోనే తెలివితెచ్చుకుని తన నిజస్వరూపాన్ని గ్రహించానంటూ తన ప్రియురాలు నిజ స్వరూపాన్ని కనపడనివ్వకుండా దాచి అందమైన ముసుగు వేసుకుని మోసం చేసిందంటూ సాగే ఈ పాట నాకు నచ్చిన మరో పాట.. ఎల్విస్ పాడిన విధానం నాకు బాగా నచ్చుతుంది ఈ పాటలో.  


You look like an angel
Walk like an angel
Talk like an angel
But I got wise
You're the devil in disguise
Oh yes you are
The devil in disguise

You fooled me with your kisses
You cheated and you schemed
Heaven knows how you lied to me
You're not the way you seemed

You look like an angel
Walk like an angel
Talk like an angel
But I got wise

You're the devil in disguise
Oh yes you are
The devil in disguise

I thought that I was in heaven
But I was sure surprised
Heaven help me, I didn't see
The devil in your eyes

You look like an angel
Walk like an angel
Talk like an angel

But I got wise
You're the devil in disguise
Oh yes you are
The devil in disguise

You're the devil in disguise
Oh yes you are
The devil in disguise
Oh yes you are
The devil in disguise

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.