మంగళవారం, జనవరి 21, 2020

ఓ సొగసరి ప్రియలాహిరి...

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన సింగర్ బేబి గారితో కలిసి బాలు గారు పాడిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పలాస 1978 (2019)
సంగీతం : రఘు కుంచె  
సాహిత్యం : లక్ష్మి భూపాల 
గానం : బాలు, బేబి పసల

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చలివేళలో చెలి ఏలనే
సొగసుకు బిడియపు ముసుగూ
ఈ వేళలో ఆగావని
అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను
కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనేఉంటే
ఏదో అంటావునువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చెలి కురులలో జలపాతమే
తనువొకధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే
మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్లొనువ్వు
నిండు జాబిల్లినవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను
పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

2 comments:

ఓపీ నయ్యర్ గారి పాటలు గుర్తుకొస్తున్నాయి..

రఘు కుంచె అపుడపుడు భలే కంపోజ్ చేస్తారండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.