సోమవారం, జనవరి 27, 2020

ఘటనా ఘటన సంఘటనె...

నటన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నటన (2018)
సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక  
సాహిత్యం : భారతీబాబు పెనుపాత్రుని
గానం : ఎమ్.ఎమ్.శ్రీలేఖ

ఘటనా ఘటన సంఘటనె బ్రతుకై
సాగే జీవనమొక నటనా
జన్మం గమనం గమ్యం మధ్యన
ఈశుడు ఆడే ఈ నటనా  
 
పుట్టుకతోనే బంధాలన్నీ
ఏర్పడటమె కద ఒక నటనా
పెరిగే కొద్ది ఒక్కో బంధం
వేర్పడిపోవడమొక నటనా
జన్మించడమే ఒక నటనా
జగన్నాటకం ఒక నటనా
జనుల కోసమే జన నటనా
జరిగేదంతా నటనా ఆఆఆ

ఘటనా ఘటన సంఘటనె బ్రతుకై
సాగే జీవనమొక నటనా
జన్మం గమనం గమ్యం మధ్యన
ఈశుడు ఆడే ఈ నటనా 

పరిచయాలకై పరుగులు తీసే
పరిష్వంగనం ఒక నటన
పరాయి వాళ్ళ పలకరింపులో
ప్రతిధ్వనించేదొకనటనా

ప్రతి విషయానికి మనలో మనమే
పంతమాడడమె ఒకనటనా
ప్రతిరోజు ప్రతి అడుగుకు అడుగు
ప్రతి స్పందనే ఒక నటనా
సిరిగల వానికి నటనను నేర్పిన
శివుడి లీలలే ఒక నటనా
శిరమున గర్వము ఎక్కితే చిదిమే
శివుడి ముందరా ఈ నటనా 

నిండి ఉన్న నీలో నటనా
నిన్న జన్మదే ఈ నటనా
ఆత్మ చరితమే ఈ నటనా
పరమాత్మ లీనమై ఈ నటనా
జనించి జీవించి శోధించి
సాధించె నటనా


4 comments:

హాంటింగ్ సాంగ్..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

పాపం ఎంతో కష్టపడి ఈ పాట తయారు జేశారు. శ్రీ లేఖ బాగా పాడింది. కానీ అవసరానికి మించిన స్థాయి లో ఉంది.

బహుశా కథకి అవసరమనుకునే చేసుంటారు అజ్ఞాత గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.