గురువారం, జనవరి 23, 2020

విజయం...

జార్జి రెడ్డి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జార్జి రెడ్డి (2019)
సంగీతం : సురేష్ బొబ్బిలి  
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : అనురాగ్ కులకర్ణి 

ఏ సమరం మనది ఐతే
విజయం మనదె కదా
కలలే కడలి ఒడిలో
అలలై ఎగసె కదా
ఈ విడి విడి అడుగులు
ఒకటై పరుగులు పెడితే
జగమంతా మనవెంటే
జయమంటూ సాగదా

ప్రతిమది తన గది విడిచి బయటికి రాగా
ఈ హృదయం ఇక విశాలమే కాదా
మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా
సకల జగతి కోసం సై అంటు సాగదా
కలలు గన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా

ఏ కూసింతా నేలలేని వాడు కూలోడయ్యెరా
సన్నకారు రైతు కూడా కన్నీరు ఆయెరా
కష్ట జీవి కడుపుకింత కూడైనా లేదురా
చెమట చుక్క విలువలేని సరుకైనాదిరా
ఆడోళ్ళపై ఆరళ్ళు ఏందిరా
నీ విద్యకే ఉద్యోగమేదిరా

మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా
సకల జగతి కోసం సై అంటు సాగదా
కలలు గన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా

అడవి తల్లి బిడ్డలంత అల్లాడి పోయెరా
పల్లెతల్లి తల్లడిల్లి ఘొల్లు మన్నాదిరా
నగర జీవి నడ్డి విడిగి నగుబాటే అయ్యెరా
అన్నపూర్ణ భరత మాత ఆక్రోశించెరా
ఈ దేశమే ఆదేశమిచ్చెరా
ఓ మార్పుకై సంకల్పమిచ్చెరా

అడుగు అడుగు కలిపి చిందేసి ఆడరా
సకల జగతి కోసం సై అంటు సాగరా
కలలు గన్న కాలం ముందుంది చూడరా
గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా


2 comments:

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.