గురువారం, జనవరి 16, 2020

వినరా వినరా నరుడా...

కనుమ సంధర్బంగా గోమాత విశిష్టతను తెలిపే ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడ్ చేసినది ఘంటసాల గారు పాడిన పాట ఇక్కడ చూడవచ్చు. ఇందులోని మొదటి చివరి చరణాలతో సుశీల గారితో కలిసి పాడిన పాట ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గోవుల గోపన్న (1968)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : ఘంటసాల, సుశీల

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా

కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా ఒళ్లే ఢంకాలకు నాదం పుట్టించునోయి

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా కొమ్ములే దువ్వెనలై మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు వైతరణిని దాటించు

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా 

 


2 comments:

బిలెటెడ్ కనుమ విషెస్..

థాంక్స్ శాంతి గారు.. మీక్కూడా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.