బుధవారం, జనవరి 22, 2020

చిన్నతనమే చేరరమ్మంటే...

ప్రతిరోజు పండగే చిత్రం కోసం సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : విజయ్ ఏసుదాస్ 

చిన్నతనమే చేరరమ్మంటే
ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే
అడుగులైతే ఎదరకైనా
నడకమాత్రం వెనకకే
గడిచిపోయిన జ్ఞాపకాలతో
గతము ఎదురౌతున్నదే

చెరిగిపోనేలేదే మరపురానేరాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికెన వేలు
వదలని చెలిమిగా
ఊహలే ఉప్పొంగుతున్నవిలా
ముగియని కథలతో
మది మేలుకున్నదిలా

తాతగా తలపండినా
తండ్రి తనమే ఎండున
ఒడిని దిగి కొడుకెదిగినా
నాన్న మురిపెము తీరునా 
 వయసు వాలిన సందె వాలున
చేతికందిన ప్రియవరం
మనవడై తన పసితనమ్మును
వెంట తెచ్చిన సంబరం
కొత్త ఊపిరి కాగా
మనసు ఊయలలూగా
తర తరమ్ముల పాటు ఇంకని
వంశ ధారగ మారి కడలిని కలియని
జీవనదిగా పారుతుంది కదా
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా 
 

2 comments:

విజయ్ యేసుదాస్ గారి పాట కళ్ళు మూసుకుని వింటే యేసుదాస్ గారి రూపమే కనిపిస్తుంది..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.