గురువారం, జనవరి 09, 2020

తిరుప్పావై 25 ఒరుత్తి మగనాయ్...

ధనుర్మాసం లోని ఇరవై ఐదవ రోజు పాశురము "ఒరుత్తి మగనాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
ఒకతె గర్భాన పుట్టి
వేరొకతె ఇంట
పెరుగబూనితివి నాడే
పెద్ద మాయకమ్మి

కీడు తలంచిన కంసుని
యదను నిప్పువలె నిల్చి 
ఉన్నట్టి నీదు మహిమ
తెలిసి వచ్చితిమి
ఇటకు దేవ దేవ


పరికరములను
దయజేసి పద్మనయనా
వ్రతము చేయింపు
మా చేత వాన కురియా
మా చేత వాన కురియా
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై ఐదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైన్ద,
కరుత్తై ప్పిழைప్పిత్తు కఞ్జన్ వయిత్తిల్,
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే ! ఉన్నై
అరుత్తిత్తు వన్దోమ్ పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి,
వరుత్తముమ్ తీర్ న్దు మకిழிన్దేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై ఐదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా
తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా

శంఖము చక్రము కలవాడే
తన చంకలో బిడ్డగా మెలగాలనిన
సంతసమొందెడి దేవకీ కడుపున
వంతుగ పుట్టిన శ్రీ వాసుదేవా


రెండవ రోజున యశోద ఇంటిలో
తాండవమాడిన తాండవ కృష్ణా
తాండవమాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా

కట్టి కొట్టీ కనికరించినా
పట్టి పాలు వెన్నలు పెట్టినా
పుట్టిన ఇంటిని వదిలి పెట్టినా
పట్టివై యశోదకు ఇష్టుడవైనా


తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా
తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా

దేవకి కడుపున పుట్టిన వాడికీ
జీవించుటకూ తావే కరువా
దీవెనలిడుచూ సేవలు చేయుచూ
పావని అయ్యెను యశోద జననీ


తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా
తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా

కరుణే లేని కంసమామయ్యా
పాపాత్ముడు నీ అసువులు తీయగా
పాపము పండిన వాడిగ యెంచి
రూపు మాపినా గోప కిశోరా


తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా
తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా

పరుగులు తీసి వచ్చిన వారమూ
పరమను భాగ్యము పొందెడి వారమూ
క్షణమైనను నిను వీడని వారము
ఘన కార్యమ్ములా కీర్తించెదమూ


తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా
తాండవ మాడిన తాండవ కృష్ణా
అండగనుండుమ హరి శ్రీకృష్ణా 

  

2 comments:

జయ మురహర..జయ భవహర..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.