సోమవారం, జనవరి 13, 2020

తిరుప్పావై 29 శిత్తమ్ శిఱుకాలే...

ధనుర్మాసం లోని ఇరవై తొమ్మిదవ రోజు పాశురము "శిత్తమ్ శిఱుకాలే". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
తెల్లవారక ముందె చలికినోర్చి
నీదు పాదాల సేవించి నిలచినాము
దీని ఫలితంబు వినవయ్య దివ్యపురుషా

పుడమి మా గోకులంబున పుట్టినావు
సేవలు గొనకుండ మానరాదు 

మాదు సేవలు గొనకుండ మానరాదు
విధిగనేడేడు తరముల విడువ రాదు


మేలు మేలని లోకుల్ మెచ్చుకొంద్రు
మరొక కోరిక లేదు గోవింద మాకు
మరొక కోరిక లేదు గోవింద మాకు   
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై తొమ్మిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
శిత్తమ్ శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరై యడియే పోత్తుం పొరుళ్ కేళాయ్,
పెత్తం మేయ్ త్తుణ్ణం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగళై క్కొళ్ళమల్ పోగాదు,
ఇత్తై పఱైకొళ్వా నన్ఱుగాణ్ గోవిందా!,
ఎత్తైక్కుం ఏழொழ் పిఱవిక్కుమ్, ఉందన్నోడు
ఉత్తోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్ వోం,
మత్తెనం కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై తొమ్మిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము.
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీవున్న చోటికే వచ్చాము

 
మాలోన మరి ఇతర కోర్కెలు చేర్చకుము
నీలీలలందు మము నిండుగ ఉంచుము
పద పద్మముల సేవ పలుమారు చేసేము
మదినిన్ను నిలిపి నీ మంగళము పాడేము

తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము 

 
గోవులను మేపుచు పచ్చికను తినిపించి
గోపకులజుడు మా గోపాలుడు అనిపించి
చింతలన్ని మరచి చిత్తశుద్దిగా చేయ
అంతరంగిక సేవకు అడ్డు చెప్పకుమయ్యా

పరమందుకొని నేడు తిరిగిపోవగ లేము
చరణ సన్నిధి నీదు నిరతమ్ము కోరేము
ఏడేడు జన్మల బంధమును విడువము
ఈ జన్మ నీ స్మరణకు అంకితం అవనిమ్ము


తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము.


తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీవున్న చోటికే వచ్చాము
2 comments:

గోవిందా కణ్ణా..గోపాలా కణ్ణా..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.