సోమవారం, జనవరి 20, 2020

నువ్వు నాతో ఏమన్నావో...

డిస్కోరాజా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డిస్కోరాజా (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేని లేఖంటి నా గానం
చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం
తీర్చేశావేమో ఈ నాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహాసాలు చిలికే పరాగాలతో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నన్నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో
దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మొహాల భారంతో
స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో
హాయిగా అలి సిపోతున్న ఆహాలతో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
 

4 comments:

ఈ పాట సేం సత్య లో ఇళయరాజ గారి సాంగ్ ని గుర్తుకు తెస్తోంది..ఐతే రెండూ పాడింది బాలుగారే..
https://www.youtube.com/watch?v=rnUtND10ObE

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ భావగర్భితమైన పాట అధ్బుతంగా అనిపించింది
-Bhaskar Ramaraju

అవును సోదరా.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.