మంగళవారం, జనవరి 07, 2020

తిరుప్పావై 23 మారిమలై...

ధనుర్మాసం లోని ఇరవై మూడవ రోజు పాశురము "మారిమలై ముழுఞ్జిల్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
వర్ష కాలాంతమున
గుహను వదలి వచ్చు
మేటి సింగంబు రీతిగా
మేను విరచి

ఆవులించి
గర్జించియునర్హ రీతి
సింహపీఠినధివసించి
సిరులనలరా


మమ్ము కూర్చుండ
నియమించి
మాదు కుశలమడిగి

అరయుమా
మా కార్యమార్యపుత్రా
అరయుమా
మా కార్యమార్యపుత్రా  

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై మూడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
మారిమలై ముழுఞ్జిల్ మన్నిక్కిడన్దుఱంగుమ్
శీరియశింగమఱివిత్తు త్తీవిழிత్తు,
వేరిమయిర్ పొంగ వెప్పాడుమ్ పేర్ న్దుదఱి
మూరి నిమిర్ న్దు ముழம்గి ప్పుఱప్పట్టు,
పోదరుమాపోలే నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్ఱు ఇంగనే పోన్దరుళి, క్కోప్పుడైయ
శీరియ శింగాసనత్తిరున్దు, యామ్ వన్ద
కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై మూడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


అతసీ పుష్పముల అందము కలవాడా
అంతఃపురము వీడి అవతలికి రారా
అతసీ పుష్పముల అందము కలవాడా
అంతఃపురము వీడి అవతలికి రారా


వర్షరుతువునా ఘోర పర్వత గుహలోనా
వనరాజు నిశ్చలుడై నిదురించి మేల్కొని
వాడి చూపులతో వనమంత తిలకించి
వాసనలు నిండిన కేశరమ్ములు పెంచి


అన్నివైపుల దొరల మన్నునంతయు దులిపి
వెన్నెముకను వంచి వెనుక ముందుకు జడిసి
గంభీరముగ వెడలి ఘర్జించి గుహనుండి
డంబముతో అడుగులు ముందుకేసినా రీతీ

రమణీయ కమనీయ రమ్య హర్మ్యము వీడి
లోకోత్తరంబగు సింహాసనంబు కూడి
మేము వచ్చిన కార్యమాలకించుమని
నీ ముందు ప్రార్థనలు చేసేము ప్రతి నిత్యం


అతసీ పుష్పముల అందము కలవాడా
అంతఃపురము వీడి అవతలికి రారా
అతసీ పుష్పముల అందము కలవాడా
అంతఃపురము వీడి అవతలికి రారా
  


2 comments:

జయ అచ్యుతా..జయ అనంతా

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.