శుక్రవారం, జనవరి 03, 2020

తిరుప్పావై 19 కుత్తు విళక్కెరియ...

ధనుర్మాసం లోని పందొమ్మిదవ రోజు పాశురము "కుత్తు విళక్కెరియ". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
గుత్తిదీపాలు చుట్టును
గూర్చి యుండా
మదపుటేనుగు
దంతాల మంచమందు

పంచశయ్యపై
నప్పిన్న పైటను బట్టి
నిద్రవోవు పరంధామ
నిద్ర లెమ్ము


కాటుక కనుల
నప్పిన్న కరుణ జూడు
నీ ప్రియుని లేపు
మాయార్తి నీకు తెలియు

ఎంతసేపిటులుందుము
ఎంచి చూడు
మేమెంతసేపిటులుందుము
ఎంచి చూడు   

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పందొమ్మిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తైన్ఱ పఞ్చశయనత్తిన్ మేలేఱి
కొత్తలర్ పూంకుழల్ నప్పిన్నై కొంగైమేల్,
వైత్తుక్కిడన్ద మలర్ మార్ పా ! వాయ్ తిఱవాయ్,
మైత్తడంకణ్ణినాయ్! నీ యున్ మణాళనై,
ఎత్తనైపోదుమ్ తుయిలెழ వొట్టాయ్ కాణ్!,
ఏత్తనై యేలుమ్ పిరివాత్త కిల్లాయాల్,
తత్తువమన్ఱు తగవేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పందొమ్మిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఎచట చూచినా ఎరుగలేమమ్మ
ఇంత చోద్యం ఓయమ్మా
ఏమిటో ఎడబాటు ఎరుగని
కామ దాహము నీలమ్మా

ఎచట చూచినా ఎరుగలేమమ్మ
ఇంత చోద్యం ఓయమ్మా
ఏమిటో ఎడబాటు ఎరుగని
కామ దాహము నీలమ్మా


కాటుకెట్టే కన్నులు కల
మాటకారుల మాట వేరమ్మా
నేటి స్త్రీలకు మేటి నీవమ్మ
నీ సాటి ఎవరు నిలువలేరమ్మ

తరుణ వయసున పరధ్యానము
ఉండును నిజమమ్మా
తగదు తగదమ్మ తగదు ఓయమ్మ
నీకు తల్లీ నీలమ్మా


చుట్టునున్న దీప కళికలు
చక్కు చక్కున మెరియుచుండ
పట్టు దిండుల పాన్పు మీద
పరిమళాల విరులు నిండ

మత్తు చల్లెడి మల్లెపూవుల
గుత్తులు కురులందు పండ
ఎత్తుగున్న గజము కొమ్ముల
మంచమందున నీలమ్మా


బాలవనగా వీలు లేదు
భక్తి అంతకంటె కాదూ
పాలిండ్లపై రాతిరి అంతయు
హరిని దాచినా వింతలేదు

కౌగిలింతలో లాలి పాడుచు
కామ క్రీడల పరవశించగ
భోగివై వైభోగి హరికి నచ్చచెప్పి
ఇటు లేచిరావమ్మా


ఎచట చూచినా ఎరుగలేమమ్మ
ఇంత చోద్యము ఓయమ్మా
ఏమిటో ఎడబాటు ఎరుగని
కామ దాహము నీలమ్మా 

   


2 comments:

బాల గోపాల కృష్ణా..పాహి పాహి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.