సోమవారం, జనవరి 06, 2020

తిరుప్పావై 22 అంగణ్ మాழల...

ధనుర్మాసం లోని ఇరవైరెండవ రోజు పాశురము "అంగణ్ మాழల". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
సర్వ సర్వంసహా చక్ర
సార్వభౌమ పదవి
ఆత్మాభిమానంబు వదలి
నీదు పాద పీఠిని చేరు
భూపతుల ఓలే

వచ్చి యున్నాము
సుందర వనజములను బోలి
ఎరవిచ్చు నీ చూపుల
బ్రోవుమయ్యా


రవియు చంద్రుని బోలు
నేత్రములు రెండు
కొంత మామీద
ప్రసరింప స్వామీ
కూలిపోవు మాకున్న
దుష్కర్మ శాప వితతి 
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవైరెండవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
అంగణ్ మాழల త్తరశర్, అభిమాన
బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీழொ
శంగ మిరుప్పార్ పోల్ వన్దు తలై ప్పెయ్ దోమ్,
కింగిణి వాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే,
శెంగణ్ శిఱిచ్చిఱిదే యేమ్మేల్ విழிయావో
తింగళు మాదిత్తియను మెழுన్దాఱ్పోల్,
అంగ ణిఱణ్డుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్,
ఎంగళ్ మేల్ శాప మిழிన్దేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవైరెండవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


చిరుగంట ముఖమోలె మెరిసిన తామరల
ఎరుపుకన్నులు తెరచి మము చూడుమయ్య
చిరుగంట ముఖమోలె మెరిసిన తామరల
ఎరుపుకన్నులు తెరచి మము చూడుమయ్య 

 
అందమౌ భూమండలమంతయు ఏలి
తమావరించిన అభిమానులందరిని
అడుగుకునెట్టిన అధిపతికి దాసులై
ఆశ్రయించిన యటుల మేమూ చేరితిమి


రవిచంద్రులొకమారు ప్రభల చిందిన యటుల
జవరాండ్రపై నీదు కనుచూపు ప్రసరించు
మేమనుభవించిన శాప పాపమ్ములు
ఈ తనువునొదిలేసి ఎగిరిపోయెడి వేళ

చిరుగంట ముఖమోలె మెరిసిన తామరల
ఎరుపుకన్నులు తెరచి మము చూడుమయ్య 

  
 

2 comments:

శాంతాకారా..భుజగ శయనా..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.