మంగళవారం, జనవరి 14, 2020

తిరుప్పావై 30 వంగక్కడల్...

మిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ధనుర్మాసం లోని ముప్పైవ రోజు పాశురము "శిత్తమ్ శిఱుకాలే". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ రోజుతో ధనుర్మాసం సిరీస్ ముగుస్తుంది. ఈ సిరీస్ లో పోస్ట్ చేసిన ముప్పై పాటల ఆడియో ప్లేలిస్ట్ ఇక్కడా మరియూ వీడియో ప్లేలిస్ట్ ఇక్కడా చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
ఓడల కడలి చిల్కి
దేవోత్తములకు
అమృతమిచ్చిన
మాధవునంద గోరీ

గోపబాలికల్ నోచిన
గొప్ప నోము
అనుకరించు భావనలతో
అరవభాషా


భట్ట నాధు తనయ
గోద పాశురములు
ముప్పది రచించే
వీనిని ముదము మీర
చదివిన నాల్గైన
పురుషార్ధ జయములిచ్చు

నాల్గు భుజముల
దేవుండు నరసఖుండు
నాల్గు భుజముల
దేవుండు నరసఖుండు


శ్రీ ఆండాళ్ పాదపద్మములే శరణం
శ్రీ ఆండాళ్ పాదపద్మములే శరణం
శ్రీ ఆండాళ్ పాదపద్మములే శరణం 
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ముప్పైవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
వంగక్కడల్ కడైంద మాదవనై కేశవనై,
తింగళ్ తిరుముగత్తు చ్చేయిழைయార్ శెన్ఱిరైంజి,
అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై
పైంగమల తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న,
శంగ త్తమిழ்మాలై ముప్పదుం తప్పామే,
ఇంగు ఇప్పరిశురైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్,
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్,
ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబురువ రెమ్బావాయ్
     
శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ముప్పైవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఓ మాధవ మము బ్రోవు శ్రీధవ
నీ మంగళాశీస్సులు అందించ రావా
ఓ మాధవ మము బ్రోవు శ్రీధవ
నీ మంగళాశీస్సులు అందించ రావా

ఓడలున్న పాల సంద్రము చిలికినా ఓ మాధవా
వీడగ కేశాలు అందాలు చిందేటి ఓ కేశవా
జాబిల్లిని మించు అందాల వదనాల
జవరాండ్రు గోపికలు నిను చేరి కొలిచిరి
వ్రేపల్లె గొల్లలకు పరమును తెచ్చారు
గోప్యమౌ దాస్యమును గోపికలూ పొందారూ


ఈ మహికి మణిఐన శ్రీవిల్లి పుత్తూరున
తామరపూసల హారముల్ తొడిగినా
ప్రేమతో భట్టరులాలించి పెంచినా
నోముల పంట మా గోదా మహాదేవి

ముప్పది పాటలు తమిళములో అల్లినా
తప్పక చదివినా ప్రతివారు మళ్ళీ
అలనాటి గోపికల వ్రత ఫలమూ పొంది
ఇలలోన కృష్ణుని సన్నిధిని చేరేరు


నంద యశోదల నవరస పూర్ణుడు
నాల్గుభుజముల నారాయణుడు
సిరిసంపదలిడే శ్రీ వల్లభుండు
శతమానులై ఇల వర్ధిల్లుడనుచూ
దీవించు శ్రీహరిని ప్రతి దినము గనుడు

ఉభయ కావేరి మధ్య అభయుడైన హరికీ
ఉచ్చిష్టమాలల హృదయమూ అర్పించినా
విష్ణుచిత్తుని తనయ తరుణి గోదమ్మకూ

నిజమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య జయమంగళం
నిజమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య జయమంగళం
నిజమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య జయమంగళం




2 comments:

జయ కృష్ణ..జయ గోదా..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.