ఆదివారం, జనవరి 26, 2020

మనసారా మనసారా...

తోలుబొమ్మలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తోలుబొమ్మలాట (2019)
సంగీతం : సురేష్ బొబ్బిలి
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : సిద్ శ్రీరామ్

మనసారా మనసారా మనసులు వేరయ్యే
తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే
విధి రాయని కథలోనా విరహం మిగిలేలే
చిరునవ్వే వెళిపోతూ పలికే వీడ్కోలే
నా ప్రాణమే నన్నొదిలేసీ వెళ్ళిపొయే
ఆవేదనే తోడయ్యిందిలే
మనమన్నదే ఓ మతిలేని మాటయ్యె
నువ్వు నేనుగా విడిపోయిందిలే

ఈ శూన్యమే ఇక నా నేస్తమై
ఎదలో కొలువై ఉంటుంది జంటై
దరహాసమే ఒక పరిహాసమై
తిరిగా నేనే నడిచే వింతై
గురిచూసి కొడితే తగిలింది బాణం
ఎదలోని గాయం మానేనా
ఈ బాధతో నే బతకాలి కలకాలం
భాదే సుఖం అనుకోవాలిలే

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయె
ఆవేదనే తోడయ్యిందిలే 

నా ఊపిరే పెనుసుడిగాలిలా
కసిగా దూరం తోసింది నిన్నే
నీ ఊహలే నను ఊపేయగా
పిచ్చే పట్టీ తిరిగా నేనే
నువ్వు రాకు అన్నా కన్నీరు వినదే
కలలన్ని కరిగీ కురిసేలే
ఈ శోకమే నా లోకంగా మారింది
నా ఆశనే మసి చేసిందిలే

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే
ఆవేదనే తోడయ్యిందిలే


2 comments:

చిన్న సినిమాలకి..ఓ పెద్ద యెసెట్ సిద్ శ్రీరాం వాయస్..

అవునండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.