బుధవారం, జనవరి 15, 2020

సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా...

మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు రూలర్ చిత్రంలోని ఒక చక్కని సంక్రాంతి పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రూలర్ (2019)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : స్వరాగ్ కీర్తన్, రమ్య బెహ్రా

తులసమ్మక్క నరసమ్మక్క
గిరిజక్కా గీతక్కా పండిందే మన పంటా
కొడవలి పట్టి కోసిన పంట
ఇంటికొచ్చినాకా పండగ జరగాలంటా
నల్ల రేగళ్ళ బంగారాలే నిండు నట్టిళ్ళు
పూల గొబ్బిళ్ళ సింగారాలే పల్లె ముంగిళ్ళు
సామిరంగా ఏడాది కష్టమంతా
అదృష్టమై ఊరంతా కోలాటమాడితే

కోలన్న కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా

సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా

ఏదేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యి పైచేయిలే
తెలుగోడీ సత్తా తెలిసేలా ఒళ్ళొంచి పని చేయాలిలే
మనదైనా సంప్రదాయం మన్నుదున్నే వ్యవసాయం
ఎంతెత్తులోనా ఎదిగి ఉన్నా మూలాలు మర్చిపోములే

కోలన్న కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బి గౌరమ్మా
పుణ్యమొస్తాది రాయే పూజలు చేద్దాం చిలకమ్మా
నువ్వు కలగన్న కోరికలన్నీ తీరేనోయమ్మా
నీకు మనసైన వాడే నిన్ను మనువాడేనమ్మా

ఆకళ్ళు తీర్చే అన్నదాతా రైతన్నె కాదా ఏనాటికీ
రైతన్న చల్లంగుంటే చాలు లోటంటు లేదు లోకానికీ
మట్టి కోసం పుట్టినోళ్ళు మంచి పంచే పల్లెటూళ్ళు
ఈ రోజులాగే ఏ రోజు నవ్వే మంచి రోజులు రావాలే

కోలన్న కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా


2 comments:

బిలెటెడ్ సంక్రాంతి విషెస్..

థ్యాంక్స్ శాంతి గారూ.. మీక్కూడా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.