ఆదివారం, జనవరి 12, 2020

తిరుప్పావై 28 కఱవైగళ్ పిన్ శెన్ఱు...

ధనుర్మాసం లోని ఇరవై ఎనిమిదవ రోజు పాశురము "కఱవైగళ్ పిన్ శెన్ఱు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
పశుల వెనక పోయి
అడవి పట్టులందు
ఆరగింతుము
చదువులేదా ఎంతయైన
నినుగూడు
పుణ్యంబునందినాము

అరయ గొల్ల పిల్లలమూ
అభయ దాతా
పరమ పురుష గోవిందా
పద్మనయనా
లోటులేదు నీకేమియు
లోకనాథా


ప్రేమతో చిన్ని పేరుతో
పిలిచితిమని కాదూ పోయనక
రవ్వంత కరుణ చూడు
రవ్వంత కరుణ చూడు  
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై ఎనిమిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కఱవైగళ్ పిన్ శెన్ఱు క్కానం శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్ఱు మిల్లాద వాయ్ క్కులత్తు, ఉన్దన్నై
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్,
కుఱై వొన్ఱుమిల్లాద గోవిన్దా, !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కు ఇంగొழிక్క వొழிయాదు,
అఱియాద పిళ్ళైగళోం, అన్బినాల్, ఉన్దన్నై
శిఱు పేరழைత్తనవుమ్ శీఱి యరుళాదే,
ఇఱైవా నీతారాయ్ పఱై యేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై ఎనిమిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


కోపము మానేసి కోరి వరమిచ్చి
గోపికల కరుణించు గోవిందా
కోపము మానేసి కోరి వరమిచ్చి
గోపికల కరుణించు గోవిందా

ఆవుల మందలతో అడవులందు తిరిగి
ఆహారమును పొందు అల్పులము మేమయ్య
అజ్ఞాన మయమైన మా గోప వంశమున
ఆవిర్భవించిన పుణ్యమె మాదయ్యా


మాలోన లోపములు కొల్లలుగ ఉన్నను
మాలోని వాడవై మమ్ము మన్నింతువను
నమ్మకముతో నీదు మర్యాదలెరుగకను
లెమ్మురమ్మని ఏకవచనమ్ము వాడాము

నీ పాటలను పాడి నీ ప్రాపును కోరి
నీ పదములొదలము నిర్మల ముకుందా

కోపము మానేసి కోరి వరమిచ్చి
గోపికల కరుణించు గోవిందా
కోపము మానేసి కోరి వరమిచ్చి
గోపికల కరుణించు గోవిందా 
 

  

2 comments:

మురళీధరా..హరే మోహన కృష్ణా..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.