శనివారం, జనవరి 11, 2020

తిరుప్పావై 27 కూడారై వెల్లుమ్...

ధనుర్మాసం లోని ఇరవై ఏడవ రోజు పాశురము "కూడారై వెల్లుమ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
కూడనట్టి వారిని కూడా
కూర్చుకొనెడి
సత్ స్వభావ గోవింద

నీ సచ్చరితము పాడి
మీముందు సన్మాన
భాగ్యమిదిఏ


పూలు ఆభరణంబులు
పూనియుండి
నేయి మోచేత బారంగ

నిన్నుగూడి పాయసాన్నంబు
భుజియింప వలతుమయ్యా
శౌరి మా కోర్కెలెల్లను
సఫలమగుగా 

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై ఏడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉందన్నై
ప్పాడి పఱైకొణ్డు యామ్ పెఱు శమ్మానమ్,
నాడు పుకழுమ్ పరిశినాల్ నన్ఱాగ
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే యెన్ఱనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముழம்గై వழிవార,
కూడి యిరున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై ఏడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


అపురూప లావణ్యం అందాలు చిందా
ఆశ్రయించితిమయ్యా ఆదుకో గోవిందా
కంటకులనెల్లరిని హతమార్చే గోవిందా
కళ్యాణ గుణ పూర్ణ కదలిరా గోవిందా

నిన్ను కీర్తించతగు వ్రతవస్తువులు పొంది
కన్నుకుట్టెడి ఘన సన్మానములొంది
వన్నెల గాజులను కరములందు వేసి
మున్ను చూడని దండ కడియాలుదొడిగి


కర్ణములగెంటియొ కాళ్ళకు కడియాలు
సౌవర్ణ మణిమయ ఆభరణ మాలలు
వివిధ వర్ణములైన జరి అంచు వస్త్రములు
వర్ణించు విధముగా ధరియించుకున్నాము

పాలు అన్నము కలిపి పాయసము చేశాము
పాడినెయ్యిని తెచ్చి ప్రవహించ పోశాము
మోచేతి మీదుగ నెయ్యి కారుచునుండ
కూర్చుని మాతోడ భుజియించ వేడేము


అపురూప లావణ్యం అందాలు చిందా
ఆశ్రయించితిమయ్యా ఆదుకో గోవిందా
కంటకులనెల్లరిని హతమార్చే గోవిందా
కళ్యాణ గుణ పూర్ణ కదలిరా గోవిందా  

  

2 comments:

నీలమేఘ శరీర..నిత్యానందం దేహి

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.