శనివారం, జనవరి 04, 2020

తిరుప్పావై 20 ముప్పత్తు మూవర్...

ధనుర్మాసం లోని ఇరవయ్యవ రోజు పాశురము "ముప్పత్తు మూవర్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
అసురులుద్ధతి చెలరేగ
అమర వరులూ
ముప్పదియు మూడుకోట్లకు
ముందు నిలచి
 
భయము వాపిరి
పరమాత్మ భక్త సులభా
మేలుకోవయ్యా కరుణా
మా మేలుకోరు 

  
అమ్మ నప్పిన్న
పద్మ దళాయతాక్షీ
లేచి మా నోముకేలోటు
లేనియట్లు అన్ని
పరికరంబుల తోడ
ఆత్మనాధునిచ్చి

మా నోము కొనసాగ
ఇచ్చగొనుము
మా నోము కొనసాగ
ఇచ్చగొనుము

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవయ్యవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు,
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెழாయ్,
శెప్ప ముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పం కొడుక్కుమ్ విమలా! తుయిలెழாయ్,
శెప్పెన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్,
నప్పిన్నై నంగాయ్! తిరువే! తుయిలెழாయ్,
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై,
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవయ్యవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


మెప్పులు పొందిన బలశాలీ
చప్పున మేల్కొను వనమాలీ
మెప్పులు పొందిన బలశాలీ
చప్పున మేల్కొను వనమాలీ

ముప్పదిమూడు కోట్ల సురులకూ
ఎప్పుడు ఆపదలంటనీయకు
చెప్పక చేయక సాగుచు ముందుకు
తిప్పలు తప్పించెడి సురమౌళీ


అసుర విపక్షక ఆశ్రిత రక్షక
విసుగును వీడి వేగమె లెమ్మిక
నిర్మల నిశ్చల నిరుపమ రూపా
ధర్మ స్థాపకా దయగను మమ్మిక

మెండుగ ఎదపై బరువులు ఎదిగిన
దొండపండులా పెదవులు కలిగిన
కండలు తిరగని నడుముతో ఉన్న
నిండుగ ఉన్నా నీలా మేలుకో


విసురుకొనుటకు వింజామరము
మిసిమిని చూచుటకొక అద్దమ్ము
విసుగక ఇచ్చి విభునితో కలసి
మసకని స్నానము చేయగ పంపుమ

మెప్పులు పొందిన బలశాలీ
చప్పున మేల్కొను వనమాలీ
మెప్పులు పొందిన బలశాలీ
చప్పున మేల్కొను వనమాలీ 

   

1 comments:

మధురాధిపతే..అఖిలం మధురం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.