గురువారం, జనవరి 02, 2020

తిరుప్పావై 18 ఉన్దు మదగళిత్త...

ధనుర్మాసం లోని పద్దెనిమిదవ రోజు పాశురము "ఉన్దు మదగళిత్త". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
మదపుటేనుగుల చీరి
మదమణంచు బలశాలీ
నందగోపాల దేవు మేనకోడలా
నప్పిన్నా మేలుకొనుము

పూలకే గంధ మొసగు
అపూర్వ కేశీ
కోళ్ళు కూసెను
వినవే కోమలాంగి
ఇచట మాధవీ
పందిరినెక్కీ


ఇదిగో కోయిలలూ
గుంపులై కూయుచుండె
నీదు చేబంతికాడు
నీలవర్ణు కృష్ణునీ
నుతియింప నున్నాము

కృపను జూపి
కంకణధ్వని దిశల మ్రోగంగా
వచ్చి తలుపు తెరువుమా
పద్మహస్తాన బాలా  

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పద్దెనిమిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఉన్దు మదగళిత్త, నోడాద తోళ్వలియన్,
నన్ద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కన్దమ్ కమழுమ్ కుழలీ ! కడై తిఱవాయ్
వన్దు ఎంగుమ్ కోழி యழைత్తనకాణ్!, మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినంగళ్ కూవినకాణ్,
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్పాడ,
శెన్దామరై క్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిఱవాయ్ మగిழிదేలొ రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పద్దెనిమిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నందగోపుని కోడలా ముందు
తలుపు తీయవమ్మా
వేకువయ్యెను నిదురలెమ్మా
లోకనాధుని చూడనిమ్మా

మదగజమ్ముల మదమడించిన
కదనమందున కండలిరిచిన
సుదతులన్న ముదము చూపిన
నిదుర పోయిన నీరజాక్షుని మరదలా


విరుల నూనెల పరిమళించగ
కురులు కలిగిన నీల బాలా
మరుని సెగలను మరచి పోయి
త్వరగ తలుపు తీయవమ్మ

మేడ మిద్దెల గుడిసె గూనల
కోడిపుంజులు కొక్కొరొకొయన
మూక ఉమ్మడి మావికొమ్మల
కోకిలమ్మలు కుహు కుహు యన


బంతి చేతిలో పట్టి నీవు
సంతసించుచు ఏల రావు
కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లన
కదలి వచ్చి గడియ తీయవమ్మా

ఎర్రతామర పూల వంటి
కరములందలి కంకణమ్ములు
ఎంతొ శృతిగా సవ్వడించగ
ఇంతి తలుపూ తీయుమా


నందగోపుని కోడలా ముందు
తలుపు తీయవమ్మా
వేకువయ్యెను నిదురలెమ్మా
లోకనాధుని చూడనిమ్మా   



 

2 comments:

జయ మురళీధర..మోహన కృష్ణ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.