బుధవారం, జనవరి 29, 2020

నీ పరిచయముతో...

చూసీ చూడంగానే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చూసీ చూడంగానే (2019)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : అనంత్ శ్రీరామ్ 
గానం : సిద్ శ్రీరామ్

నీ పరిచయముతో
నా మదిని గెలిచా
నీ పలకరింపుతో
నా దిశను మార్చినా
అడుగు నీతో కలిపి
అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా
విడిపడి నీకై నడిచా

నీ పరిచయముతో
నా మదిని గెలిచా

ఏ గతము ఎదురవదిక
నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక
నీ పిలుపే వినపడితే
నాలోని లోతు చూపిన

నీ పరిచయముతో
నిలువునా నే వెలిగి
వెలుగులలో నే మునిగా
పదనిసలేవో తడిమి
పరవశమై పైకెగిరా

నీ చెలిమే ప్రతిక్షణముని
నా వరకు నడిపినది
నీ మహిమే ప్రతి మలుపుని
తీరముగ మలిచినది
నాలోని నన్ను చేర్చిన
నీ పరిచయముతో

నీ పరిచయముతో
నా కలని కలిసా
నీ వెలుగు వానలో
నే తడిసి పోయినా
అడుగు నీతో కలిపి
అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా
విడిపడి నీకై నడిచా

చివరి దాకా నిలిచే
హృదయమునే నే కలిసా
చెరగని ప్రేమై మిగిలే
మనసుని నేనై మురిసా
 

4 comments:

థాంక్స్ ప్రవీణ్ గారు.

సిద్ శ్రీరాం..ద మోస్ట్ హాపెనింగ్..

అవునండీ.. చక్కని గాత్రం.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.