ఆదివారం, మార్చి 10, 2019

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే...

ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : దేవీ శ్రీ ప్రసాద్

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక
కాలింగ్ మారినా
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే


మ్మ్.. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
లాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే


పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే
ఫ్రుటీ ల నుండి బీరు లోకి మారినా
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే 


శనివారం, మార్చి 09, 2019

ఏ స్క్వేర్ బి స్క్వేర్...

100% లవ్ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్  
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీ శ్రీ ప్రసాద్ 
  
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చునీ
చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్లాఫ్ పోజెస్
దొంగ దొంగా చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూజే చేసి
చూపుల స్ట్రానే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్

చీటింగ్ చీటింగ్ చీమ పంచదారనే
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వునీ
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండు నీ...
చీటింగ్ చీటింగ్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్



ఫిమేల్ వర్షన్ ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


గానం : స్వాతి

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్
అటాక్ అటాక్ ఎలుక పిల్లి మీదకే
అటాక్ అటాక్ పువ్వు ముళ్లు మీదకే
అటాక్ అటాక ఉప్పు నిప్పు మీదకే
అటాక్ అటాక్...

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరంస్ కి పట్టె సొల్యూషన్స్
ఏ పోటా పోటి చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీటీ మీటీ ర్యాంకుల కోసం కాంపిటీషన్స్

అటాక్ అటాక్ చేప కొంగమీదకే
అటాక్ అటాక్ జింక పులిమీదకే
అటాక్ అటాక్ ఓణి జీన్స్ మీదకే
అటాక్ అటాక్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్
హే లెట్స్ గో...




శుక్రవారం, మార్చి 08, 2019

స్వరములు ఏడైనా...

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరకూ శుభాకాంక్షలందజేస్తూ తూర్పూ పడమర చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: తూర్పుపడమర (1976)
గానం: పి.సుశీల
సాహిత్యం: సినారె (సి.నారాయణరెడ్డి)
సంగీతం: రమేష్ నాయుడు

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే
నవ వేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికీ మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ...ఆఅ.ఆఆఆఆఅ
కాలమనే గాలానికి చిక్కీ
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే
కలల వెలుగులో కన్నీరొలికే
కలతల నీడలు ఎన్నెన్నో..ఎన్నెన్నో

 

గురువారం, మార్చి 07, 2019

స్టెల్లా కాలేజ్ లైలా...

కాలేజ్ గేట్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కాలేజ్ గేట్ (1993)
సంగీతం : దేవా 
సాహిత్యం : రాజశ్రీ ??
గానం : మనో ??

స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా..
స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా..


సిద్దార్థ కాలేజ్ షీలా నా
ఫోక్ డాన్స్ చూసి పొంగి పోయేరా
నిజాం కాలేజ్ నిరోషా నా
చెంతకొచ్చి చిందులేసి ఆడేరా
ప్రభుదేవాతో పోటీ పడీ
ఫస్ట్ ప్రైజే కొట్టానురా..
దమ్ములుంటే కాసుకోరా
దుమ్ము లేపీ చూపిస్తారా

మనీషా కోయిరాల మాధురీ
నా స్టైలు చూసి సైటు కొట్టినార్రోయ్
మమతా కులకర్ణి టాబూ
గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెచ్చగొట్తినార్రోయ్
నార్తిండియా హీరోలంతా
నీముందెంతా అన్నారురా
సౌతిండియా హీరోయిన్లే
నా ఫ్యాన్సే అయ్యారురా

స్టెల్లా కాలేజ్ లైలా నాతో
స్టెప్పులేసి ఆడలేకపోయేరా
సి.ఆర్.రెడ్డి కాలేజ్ రమ్యా నాతో
పాట పాడలేక పారిపోయెరా.. 

బుధవారం, మార్చి 06, 2019

బోటనీ పాఠముంది...

శివ చిత్రం లోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : బాలు, శైలజ, బృందం

బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం 

దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు 
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే వీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం

అయ్యో... మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా...
ఆ... ఛీ... తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా...
కొండలా కోర్సువుంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు 
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్..
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త 
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా

అరె ఏం సార్...
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం... 
 

మంగళవారం, మార్చి 05, 2019

ఛీ..ఛీపా.. తప్పులకుప్పా...

మంత్రి గారి వియ్యంకుడు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు (1983)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. 
ఓ మైలేడీ డీ డీ నంబరువన్ కిలాడీ
నువ్వల్లాడీ డీడీ పోతావే అమ్మాడీ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..

మోటరు కారు ఎక్కినా కారు ఎక్కనివ్వకూ
గీర ఎంత ఎక్కినా గేరు మారనివ్వకూ
కళ్ళనించి కాచుకో ఒళ్ళు కాస్త దాచుకో
డబ్బులెక్క మానుకో డాబు మాని మేలుకో
అలుగుతున్న అందమా అమావాశ్య చంద్రమా
అలుగుతున్న అందమా అమావాశ్య చంద్రమా
పాడు బుద్ధి మానకుంటే దేహశుద్ధి తప్పదమ్మడూ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..

రోజూ ఫోజు కొట్టినా గాజుబొమ్మ నీవులే
ఆకు ముల్లు సామెతా తెలుసుకుంటె మేలులే
కుక్క కాటు నీదిలే చెప్పుదెబ్బ నాదిలే
ట్రిక్కులెన్ని చేసినా పప్పులింక ఉడకవే
బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా
ఓయ్ బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా
చెంపకాయ చేతికిస్తే లెంపకాయ తప్పదమ్మడూ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..
ఓ మైలేడీ డీ డీ నంబరువన్ కిలాడీ
నువ్వల్లాడీ డీడీ పోతావే అమ్మాడీ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..


సోమవారం, మార్చి 04, 2019

నమో నమో తాండవకేళీ లోలా...

ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్బముగా ఆ పరమశివునికి నమస్కరించుకుంటూ వినాయక విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినాయక విజయం (1979)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కోరస్

ఓంకార నాద ప్రణవాంకిత జీవనాయ
సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయా
హరాయ.. శుభకరాయ.. నమశ్శివాయ

నమశ్శివాయా.. నమశ్శివాయా.. నమశ్శివాయా

నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా

దయా కిరణముల  ప్రసరించే
నీ చూపుల సుమధుర భావనలు
ఈ జగతికె చల్లని దీవెనలు

నమో నమో తాండవకేళీ లోలా

అలనాడు అమృతమును ఆశించి
పాలకడలి మధియించగా
అలనాడు అమృతమును ఆశించి
పాలకడలి మధియించగా 

హాలాహలమే ప్రభవించి
విషజ్వాలలే వెదజల్లగా
హాలాహలమే ప్రభవించి
విషజ్వాలలే వెదజల్లగా 

అభయమొసంగి గరళము మింగి
అభయమొసంగి గరళము మింగి
జగముల కాచిన జగదీశా పరమేశా

నమో నమో తాండవకేళీ లోలా

పృధివి రధముగా
రవిచంద్రులె చక్రాలుగా
నాల్గు వేదములె హయములుగా
బ్రహ్మదేవుడే సారధిగా
మేరుపర్వతమె విల్లుగా
శ్రీహరి అస్త్రము కాగా

ప్రళయకాల పర్జన్య గర్జనగ
భీషణ శంఖము పూరించి
ప్రళయకాల పర్జన్య గర్జనగ
భీషణ శంఖము పూరించి

పాశుపతమ్మును సంధించి
త్రిపురాసురులను వధియించీ
పాశుపతమ్మును సంధించి
త్రిపురాసురులను వధియించీ

లోకాలను గాచిన దేవా
మా శోకము మాపిన మహానుభావా
లోకాలను గాచిన దేవా
మా శోకము మాపిన మహానుభావా

నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా

ఆదివారం, మార్చి 03, 2019

పొద్దులెగాలి (జిల్ జిల్ జిగ)...

హ్యాపీడేస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హ్యాపీ డేస్ (2007)
సంగీతం : మిక్కీ జె.మేయర్
సాహిత్యం : వెంకటేష్ పట్వారి
గానం : కృష్ణ చైతన్య, క్రాంతి,
ఆదిత్య సిద్దార్థ్, శశి కిరణ్

పొద్దు లెగాలీ... స్నానం చెయ్యాలీ...
బస్సు ఎక్కాలీ... కాలేజ్ కెళ్ళాలీ
బాత్‌రూంలో పాటలు
బ్రేక్‌ఫాస్ట్‌తో మాటలు
అమ్మ ముందు వండర్లు
నాన్న ముందు బ్లండర్లు
పాకెట్ మనీకి టెండర్లూఊఊ..
ఇక బస్సులకై వెయిటింగు
ఫుట్ బోర్డు ఫయిటింగు
కాంటీన్ లో మీటింగూఊఊ
ఇక బస్సులకై వెయిటింగు
ఫుట్ బోర్డు ఫయిటింగు
కాంటీన్ లో మీటింగూఊఊ

జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ

టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు
ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు..
టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు
ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు...
లాస్ట్ బెంచ్ సీటింగు సెల్‌ఫోన్ తో గేమింగు
ఇంటర్‌వెల్ కై వెయిటింగూ
లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగ్‌జైన్స్ రీడింగు
ఇంటర్‌వెల్ కై వెయిటింగూ
ఏయ్..ఏయ్..ఏయ్..

జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
పొద్దు లెగాలీ...స్నానం చెయ్యాలీ...

ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ లూ మాటినీలు
యాలీలో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు
హే పిల్ల వాట్ మేన్ నీ స్టైలంటే ఇల్ల
నీ కన్ఫర్మేషన్ నిల్ల హే పిల్ల హే పిల్ల
పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల ... హే హే

జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ

ఇక బస్సులకై వెయిటింగు
బస్ స్టాప్ లో చాటింగు
వెయిటింగ్ వెయిటింగు
ఇక బస్సులకై వెయిటింగు
వెయిటింగ్ వెయిటింగు
ఫుట్ బోర్డు తో ఫయిటింగు
పొద్దు లెగాలీ...

శనివారం, మార్చి 02, 2019

కాలేజీ స్టైలే...

ప్రేమదేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమదేశం (1996)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : హరిహరన్, కృష్ణకుమార్,
అస్లాంముస్తఫా

అల తానై అలరించేది మగువా
తనువు తానై మురిపించేది మగువా
ఒడి తానై మనిషినె మలిచేది మగువా
ఒడి తానై మనిషినె మలిచేది మగువా
నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువా
ఎనలేని నిధియే మగువా

హే కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా
కవిత రాసినా కన్నెపిల్లా హోయ్

కకకకక కాలేజీ స్టైలే.. హూ.. కాలేజీ స్టైలే..
కకక కాలేజీ స్టైలే.. కకక.. కాలేజీ స్టైలే..
కకక కాలేజీ స్టైలే..ఏఏ..ఏ..ఎఏ..

ఆ కాటుక కళ్ళ కన్నె చూపు
తస్సదియ్యా హ ఎంత కైపు
కాశ్మీర్ రోజా వేటా
క్యాట్వాకింగే పూటా
ఎవ్రీడే ఫ్యాషన్ షో

కాలేజీ స్టైలే...

కళ్ళలో సిలికాన్ గ్రాఫిక్స్
గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రాఫిక్స్
వి ఛానెల్ ఛాయిస్సూ
నీ డాల్బీ వాయిస్సూ
లైటినింగ్ కళ్ళలో లేజర్
నీ లవ్ మ్యాటర్ చెప్పింది పేజర్
నే టీనేజ్ కంప్యూటర్
నువ్వే నా సాఫ్ట్వేర్

సెల్యులార్ ఫోనుల్లాగా మీరున్నట్లైతే
బ్యాగీ ప్యాంట్ పాకెట్లోనా నైస్గా పెట్టుకుంటాం
కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లైతే
కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకొంటాం
అందాలన్నీ ఆహో ఓ ఇన్స్పిరేషన్
ఉప్పొంగదా చూస్తే యంగర్ జనరేషన్
కాలేజీ స్ట్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే

డేటింగ్ కోసం డైలీ కాలేజ్ క్యాంపస్లో వేచి ఉంటాం
ఓకే అంటే శాన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం
బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ ఎన్ రోల్ ఆడేటి
సొంపైన చోటే కాలేజ్ స్ట్రీటు
ఎవ్రీడే లవ్ సీజన్స్ న్యూ ఫ్యాషన్
మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే

కకకకక కాలేజీ స్టైలే.. హూ.. కాలేజీ స్టైలే.. 

శుక్రవారం, మార్చి 01, 2019

కళాశాలలో... కళాశాలలో...

మార్చ్ అనగానే పరీక్షలు ఆ పై ఫేర్వెల్ పార్టీలు ఇలా ఎక్కడ చూసినా స్టూడెంట్స్ హడావిడే కనిపిస్తుంటుంది. అందుకే ఈ నెలంతా సరదాగా కాలేజ్ చుట్టూ తిరిగే పాటలు కొన్ని తలచుకుందాం. ముందుగా కొత్తబంగారులోకం చిత్రంలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొత్తబంగారు లోకం (2008)
సంగీతం : మిక్కీ జె.మేయర్ 
సాహిత్యం : శ్రీకాంత్ అడ్డాల 
గానం : కృష్ణచైతన్య, ఆదిత్య, క్రాంతి,
శశికిరణ్, సిద్దర్థ్

కళాశాలలో... కళాశాలలో...
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచే వేళా
అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల

కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...

సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్టు తెలియలేదు
మాగ్నటిక్స్ చదివాము
ఆకర్షణేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివినా
అర్దం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనె
అర్దం ఐపోయాయే

కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...

లోలకం లాగా ఊగుతూ సాగే 
మీ నడుములన్ని
స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా
గాలికే కందే మీ సుకుమార 
లేత హృదయాలు
సింపుల్ బాలన్స్ తూచేయలేదా
న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే

పుస్తకమన్నది తెరిచే వేళా
అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంటే
దాటేటందుకె మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల
కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.