బుధవారం, మే 10, 2017

వేగం వేగం యోగం యోగం...

అంజలి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బృందం

వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ
వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ
గగనం నీదిలే సమయం నీదిలే
నీదే నీదే కాలం కాలం
ఆనందాలే సొంతం సొంతం మాజిక్ జర్నీ..

వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ

వచ్చేనంటా రెక్కలు మనకే
గగనం సర్వం తిరిగి వద్దాం
జాబిలినే చేరుదాం సరదాగా తాకుదాం
నక్షత్ర మాలనే వల వేసి పట్టుదాం
వన్నెలనే వెదజల్లు ఏడురంగుల హరివిల్లు
నీవూ నేనూ సాగే ఒక వంతెన అయ్యేను.

వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ

మెరుపే నీకై వెలుగై నిలుచు
మేఘం చూడు పరదా పరచు
ఏవేవో వింతలే నీకన్నీ అద్భుతం
చిత్రాలే అనుక్షణం అయ్యేనే నీ వశం
ఏదో తెలియని స్వర్గం మన పక్కకు వచ్చెను కాదా
అందాలన్నీ మొత్తం నీ కనులకు విందగును.

వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ
వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ
గగనం నీదిలే సమయం నీదిలే
నీదే నీదే కాలం కాలం
ఆనందాలే సొంతం సొంతం మాజిక్ జర్నీ..

వేగం వేగం యోగం యోగం మాజిక్ జర్నీ
పోదాం పోదాం దూరం దూరం మాజిక్ జర్నీ


మంగళవారం, మే 09, 2017

చిన్నారి పొన్నారి పువ్వు...

నాదీ ఆడజన్మే సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాదీ ఆడజన్మే (1965)
సంగీతం : ఆర్. సుదర్శన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
 
పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
 
కనుమూసి నిదురించు బాబూ
కలలందు జోగాడగలడు

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ 
నిను చూసి నను చూసి నవ్వూ 

ఆహాహ ఆహాహ ఆహా...
ఆహాహ ఆహాహ ఆహా..
 

సోమవారం, మే 08, 2017

వినుడు వినుడు రామాయణ...

లవకుశ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లవకుశ (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : లీల, సుశీల

ఓ ఓ ఓ....
వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా
వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాధ

వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరధ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త వినీ
ఆ ఆ ఆ ఆ ..... ఆ ఆ ఆ ఆ
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త వినీ
కారు చిచ్చుగా మారెను కైకా మందర మాట వినీ.. 
మందర మాట వినీ

వినుడు వినుడు రామాయణ గాధా వినుడీ మనసారా

అలుక తెలిసి ఏతెంచిన భూపతినడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకమూ భరతుడికీ పృధివీ
మెలగవలయు పదునాలుగేడులూ రాముడు కారడవీ
చెలియ మాటకూ ఔను కాదనీ పలుకడు భూజానీ
కూలే భువిపైని...

వినుడు వినుడు రామాయణ గాధా వినుడీ మనసారా

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారీ దూసెను రోసిల్లీ
దోసమనీ వెనుదీసె తమ్మునీ రాముడు దయశాలీ
వనవాస దీక్షకూ సెలవు కోరె పినతల్లీ పదాల వ్రాలి

ఆ..... ఆ... ఆ... ఆ...
వెడలినాడు రాఘవుడూ అడవికేగగా
పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా
వెడలినాడు రాఘవుడూ అడవికేగగా
పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా
గోడుగోడున అయోధ్య ఘొల్లుమన్నదీ
వీడకుమా మనలేనని వేడుకున్నదీ
అడుగులబడి రాఘవా....
అడుగలబడి రాఘవా ఆగమన్నదీ..
ఆగమన్నదీ .. ఆగమన్నదీ
అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ


ఆదివారం, మే 07, 2017

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట...

గంగోత్రి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గంగోత్రి (2003)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కౌసల్య, ఐశ్వర్య

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేం కావాలి
నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి
ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా

గరిసనిసమగరిస గరిసనిసమగరిస
సగమనినిపమగమ సగమనినిపమగమ
పపమగ మమగస గగసనిస 
పపమగ మమగస గగసనిస 
 
చిరు చిరు మాటలు పలికేవేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసేవేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వనవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కీ ఎడ్చే వేళ కన్నీళ్ళవుతా
నేస్తాన్నవుతా గురువు అవుతా
పనిమనిషి తన మనిషవుతా
నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలీ

వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా
మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సింహాద్రి పాట
మనసార వినమంటా
తన తియ్యని పాటే అమ్మ పాడే లాలి
తన తోడే ఉంటే అది దీపావళి
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి
వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా
మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సింహాద్రి పాట
మనసార వినమంటా
 

శనివారం, మే 06, 2017

తియ తీయని తేనెల మాటలతో...

ఖైదీ కన్నయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖైదీకన్నయ్య (1962)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు

దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదుగిరిలోన పరువును పెంచి
పేరు తెచ్చే పెన్నిధది

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసవుతాను..
శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
ఏడువరాదు ఏమనరాదు
ధీరునివలెనే నిలవాలి

అదరను నేను బెదరను నేను
ఏదెదురైనా ఎదిరిస్తాన్.. శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
ఉరుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులువలె తడబడునా

పిడుగులు పడినా జడవను నేను
వడివడిగా అడుగేస్తాన్.. శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు


శుక్రవారం, మే 05, 2017

చిన్నారి పొన్నారి కిట్టయ్య...

స్వాతిముత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్
అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్నా నిన్నూరడించనేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోకా
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో

అమ్మా మన్ను తినంగ నే శిశువునో
ఆకొంటినో వెర్రినో చూడు నోరు ఆ

వెర్రిది అమ్మేరా వెర్రిదీ అమ్మేరా పిచ్చిదాని కోపం-రా
పచ్చి కొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా

ఏడుపొస్తోంది నాకేడుపొస్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవరు ఇస్తారు కదా
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడ్తారు చెప్పూ

అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేమూ
అన్నమైన తింటాము తన్నులైన తింటాము

కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టూ కొట్టూ

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య 
నిన్నెవరు కొట్టారు నాన్నా ఎవరమ్మా

చిన్నవాడవైతేనూ చెయ్యెత్తి కొట్టేనూ
పెద్దవాడవైతేనూ బుద్ధిమతి నేర్పేను
యశోదనూ కానురా నిన్ను దండించ
సత్యనూ కానురా నిన్ను శాసించ
ఎవ్వరు నువ్వనీ...
ఎవ్వరు నువ్వనీ నన్నూ అడగకు
ఎవరూ కాననీ విడిచీ వెళ్ళకూ
నన్నూ విడిచీ వెళ్ళకూ

ఆ వెళ్ళమూ వెళ్ళము లేమ్మా

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్
అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్నా నిన్నూరడించనేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా


గురువారం, మే 04, 2017

కనులకు వెలుగువు నీవే...

భక్త ప్రహ్లాద చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల, జానకి

హే జ్యోతి స్వరూపా నారాయణా

కనులకు వెలుగువు నీవే కావా..
కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే
నిజముగ చీకటి ఔగా దేవా..

కనులకు వెలుగువు నీవే కావా..

పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పేరుకు నేను తల్లిని గానీ
ఆదుకొనా లేనైతీ..
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
పాలను ద్రాపి ఆకలి బాపే
భాగ్యమునైనా నోచని నాకు
ఏల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా..

అండగ నుండ విధాతవీవు
అండగ నుండ విధాతవీవు
ఆకలి దప్పుల ధ్యాసే లేదు
నారాయణ నామామృత రసమే
నారాయణ నామామృత రసమే
అన్నము పానము కావా దేవా

కనులకు వెలుగువు నీవే కావా..
కనపడు చీకటి మాయే కాదా..
నిను గనలేని ప్రాణి బ్రతుకే 
నిజముగ చీకటి ఔగా దేవా..
కనులకు వెలుగువు నీవే కావా..




బుధవారం, మే 03, 2017

అంజలి అంజలి అంజలీ...

ఈ రోజు నుండీ ఒక నెలరోజుల పాటు సమ్మర్ స్పెషల్ గా అన్నీ చిన్నపిల్లల పాటలు తలచుకుందాం. ముందుగా అంజలి సినిమాలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంజలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి, కోరస్

అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి


అమ్మమ్మా బంగారువే అందాలా చిన్నారివే
అమ్మమ్మా బంగారువే అందాలా చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లీ వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి


ఆకాశం సృష్టించినా దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్ను ఒక వరముగ ఇచ్చాడమ్మా
తల్లీ నీపై మేఘాలే పన్నీరే వెదజల్లేనూ
పూసే వసంత కోయిలలే నీకే జోలలు పాడేనూ
నడకలోన ఒక పూలతవే నీవే 
నవ్వులోన ఒక మల్లికవే నీవే
అందచందాల చిన్నారీ నీవే లోకమే మెచ్చు పొన్నారి
నీవేగ మాకు దేవతా నీలాల అంబరాన తారకా

అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి


పువ్వల్లే నీ కళ్ళతో పలికే సింగారం నీవే
హంస వలే మాతో ఇక ఆడే బుజ్జాయివే
వినువీధుల్లో విహరించే వెన్నెల పాపా అంజలివే
అమ్మా చల్లని ఒడిలోనా ఆడీ పాడే అంజలివే
నడచి వచ్చు ఒక బొమ్మవటా నీవే 
మెరిసిపోవు ఒక మెరుపువటా నీవే
చిందులాడు ఒక సిరివంటా నీవే చిలకరించు విరి తేనెవటా
తరంగమల్లె ఆడవా వరాలు కోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి


అమ్మమ్మా బంగారువే అందాలా చిన్నారివే
అమ్మమ్మా బంగారువే అందాలా చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లీ వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని
శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
అంజలి అంజలి అంజలీ మెరిసే పున్నమి వెన్నెల జాబిల్లి

 

మంగళవారం, మే 02, 2017

నిలువవే వాలు కనులదానా...

ఇల్లరికం చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇల్లరికం (1959)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతూ లఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా

ఎవరని ఎంచుకోనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పడినావో
సిగ్గుపడి తోలిగేవో... విరహాగ్నిలో నను తోసిపోయేవో

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా  అది నీకే తెలుసు

ఒకసారి నన్ను చూడరాదా
చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా
చాలు నీ మరియాదా వగలాడి నే నీవాడనే కాదా?

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా  అది నీకే తెలుసు

మగడంటే మొజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా
కోపమా నా పైనా?
నీ నోటి మాటకే నోచుకోలేనా?

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా
అది నీకే తెలుసు 

 

సోమవారం, మే 01, 2017

గజ్జె ఘల్లుమన్నదో...

బావ బావమరిది చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బావ - బావమరిది (1993)
సంగీతం : రాజ్ కోటి
సంగీతం : వేటూరి
గానం : బాలు, చిత్ర  

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో


గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా

ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో


ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ 
గంటకొట్టే కౌగిళ్ళలోనా
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది 
నీ కోనలో నీరెండలో నీ గుండెలో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా

చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లో.. చీ.. పో.. లు రేగేను నా పూల సంతల్లో

కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచూపుల్లో

పంచదార పందిళ్లలో మంచు తేనె సందెళ్లలో 
పాలు పంచుకోరా నా ప్రాయం
వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంతు చేసేసి 
వేడెక్కిపో వేధించుకో వేటాడుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా

లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో


గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.