శుక్రవారం, జులై 10, 2015

పన్నెండేళ్ళకు పుష్కరాలు...

పుష్కరాలంటే పన్నెండేళ్ళకి ఒకసారి మాత్రమే వచ్చే పండుగ. ఆరోజుల్లో పెద్దలంతా పవిత్రంగా గోదావరి మాతను కొలవడమే కాదు, ఎక్కడెక్కడి బంధుమిత్రుల ఆగమనంతో నదీస్నానాలతో సందడీ కోలాహలాలతో సాగుతాయి ఈరోజులు. అలాంటి ఓ జంట సరిగంగ స్నానాలు మీరూ చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : త్రిశూలం (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం

ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా హా..
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
ఉరికాను నిన్ను చేరగా

తం తననం తం తననం
తం తననం తం తననం 
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు

మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చేద్దాము కాపురాలు

తం తననం తం తననం
తం తననం తం తననం  
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో
తం తననం తం తననం
తం తననం తం తననం 


గురువారం, జులై 09, 2015

గోదారి గట్టుపై...

గోదావరి గట్టు ప్రేమికులలో మాత్రమే హుషారు నింపుతుంది అనుకుంటున్నారా.. అక్కడి ముద్దుగుమ్మలు సైతం ఎంతటి అల్లరి పిడుగులవుతారో ఏమేమి అల్లరులు చేస్తారో ఇదిగో ఈ పాట చూసీ వినీ మీరే తెలుసుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కృషి (2008)
సంగీతం : రాజ్ కిరణ్
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : చిత్ర

గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 
గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 
గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 

నేను కూడా నీకు మల్లె నేల విడిచి ఎగురుతాలే 
నీకు నాకు ఇలా స్నేహం కట్టేస్తానులే 
గాలి కుర్రగాలి కాస్త ఆగు నేను కూడా 
నీ వెంటే అలా హాయిగా తిరిగేస్తానులే 

హే...గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 

ఎప్పుడూ ఏం చేసినా అనేది లేదులే.. మనకెదురేదిలే
ఎవ్వరూ ఏం చెప్పినా వినేది లేదులే.. వినయం రాదులే
ఈ చెట్టు గట్టూ పుట్టా ఎగిరేటి నింగిని పిట్టా
నాతోటి చెట్టా పట్టా నేలేకపోతే ఎట్టా 
ఈ లోకమే నాకోసమే తను పుట్టేసిందిలే 
ఏనాటికీ నా దోస్తనీ తెగ ఒట్టేసిందిలే 

గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 

దారిపై నడయాడగా అందరి చూపులూ.. నాపై వాలులే 
ఊరిపై పడి ఆడగా మబ్బులపై అలా.. మనసే తేలులే
భూమంత ఇంతటి అందం నా నుంచి పుట్టిందేమో 
అంచేత భూమే సాంతం నా బానిసయ్యిందేమో 
ఏమ్మాటలు నను చూడగ ఎవరైనా ఎంతలే 
ఓ మాటలో చెప్పేయనా మహరాణే నేనులే 
హొయ్ హొయ్ హొయ్ 
గోదారి గట్టుపై గోరింక..గోరింక 
గోల గోల చేయనా నేనింకా 


బుధవారం, జులై 08, 2015

గోదారి నవ్వింది తుమ్మెదా...

గోదారి ఒడ్డున జానపదాలలోని కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా... ఆర్.పి.పట్నాయక్ అలా జానపద శైలిలో స్వరపరచిన ఈ కమ్మని పాట ఈ రోజు తలచుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శీనూవాసంతి లక్ష్మి 
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం : కులశేఖర్ 
గానం : ఆర్.పి.పట్నాయక్, ఉష

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

ఆనందమె బ్రహ్మ తుమ్మెదా
మనిషికానందమె జన్మ తుమ్మెదా
కోరుకున్నదంత కళ్ళు ముందు ఉంటె 
ఆనందమె కద తుమ్మెదా
ఆకాశమేమంది తుమ్మెదా
చిటికెడాశుంటె చాలంది తుమ్మెదా
అంతులేని ఆశ గొంతుదాటలేక 
ఇరక పడతాదమ్మ తుమ్మెదా
ఈ నవ్వు తోడుంటె తుమ్మెదా
ఇంక కష్టాలదేముంది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

గోధూళి వేళల్లొ తుమ్మెదా
ఎద రాగాలు తీసింది తుమ్మెదా
కొంటె గుండెలోన సందె పొద్దు వాలి 
ఎంత ముద్దుగుంది తుమ్మెదా
అందాల చిలకమ్మ తుమ్మెదా
కూని రాగాలు తీసింది తుమ్మెదా
కన్నె మూగ ప్రేమ హాయి పాటల్లోన 
ఊయలూగిందమ్మ తుమ్మెదా
పుణ్యాల నోమంట తుమ్మెదా
ఈ లోకాన ఈ జన్మ తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా
 

మంగళవారం, జులై 07, 2015

గోదారి గట్టుంది... ఉరకలై గోదావరి...

గోదావరి గట్టు బోలెడంత ఏకాంతం కొబ్బరితోటల నడుమ నుండే వీచే హాయైన గాలి కొత్తగా వచ్చిన యుక్త వయసు చేసే తుంటరి అల్లర్లకు ఇక హద్దేముంటుంది చెప్పండి, అలాంటి ఓ జంట ఎలా ఆడిపాడుతున్నారో మనమూ చూసొద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఖుషీ ఖుషీగా (2004)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : మూర్తి
గానం : రాజేష్, శ్రేయా ఘోషల్

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది 
రావాలని మనసుంది ఐనా ఓ గుబులుంది
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది 
గోరువంక వింటోంది కబురులెందుకంటోంది 
కన్నెమనసు ఔనందీ ఏడిపించకే అంది 

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది 

కాకెంగిలి కలకండ వడపప్పు బెల్లాలు 
తింటూ వరిచేలల్లో పడి లేస్తూ పకపకలూ 
ఆ మామిడి తోటల్లో ఆడిన దొంగాటల్లో 
నన్నే మురిపిస్తూ ముద్దులు పెట్టిన ముచ్చటలూ
ఈ సరదా సంతోషం నీకేగా మరి సొంతం 
అని అంటూ వినమంటూ ఆ పాలపిట్ట పాడింది 

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది




~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తనకి చాలా ఇష్టమైన ఈ పాట తలచుకుందాం. మీరందరూ కూడా ఈ హుషారైన పాట చూసీ వినీ తనకి శుభాకాంక్షలు అందచేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : అభిలాష (1992)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
పాడినది : బాలు, ఎస్.జానకి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి


నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయ
భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది

 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి



సోమవారం, జులై 06, 2015

హొయ్‌నా ఏం చాందినిరా...

గోదావరి మీద హాయిగా సాగుతున్న పడవ ప్రయాణం, మనసుకు నచ్చిన చిన్నది పక్కనే ఉంది కానీ చిర్రుబుర్రు లాడుతోంది. అందుకే ఆమెని ప్రసన్నం చేస్కోడానికి పొగడ్తలతో ముంచెత్తాడా అమ్మాయిని. తనేమైనా తక్కువా తాను అందరాని చందమామనని చెప్పకనే చెప్పింది. గోదారి సాక్షిగా సాగిన ఆ కథేమిటో ఈ పాటతో మీరే తెలుసుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్ , చిత్ర

ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ
ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి
ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ
ఇంతకీ ఏడుందే అత్తింటి దారీ

హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా

వగలమారి నావ, హొయలు మీరినావ,
అలలు ఊయలూగినావ
తళుకు చూపినావ, తలపు రేపినావ,
కలల వెంట లాగినావ
ఓఓఓఓఓ..ఓఓఓఓఓ
సరదాగ మితిమీరి అడుగే ఏమారి
సుడిలో పడదోసే అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా
పోదాంపద ఆగకేమరీ

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా

ఓ..నీటిలోని నీడ చేతికందుతుందా
తాకిచూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడికాద
తరిమిచూడు దొరుకుతుందా
ఓహోహోఓఓఓఓ..ఓఓఓఓఓ...
చక్కానిదానా చుక్కానికానా నీ చిక్కులన్నీ దాటగా
వద్దూ అనుకున్నా వదలను నెరజాణా 
నేనే నీ జంటని రాసి ఉందిగా

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా


ఆదివారం, జులై 05, 2015

నవ్వు వచ్చిందంటే...

విభిన్న సంప్రదాయాలను సంస్కృతులను చూస్తూ ఎన్నో ప్రాంతాలనుండి ప్రవహించే గోదారమ్మ గలగలమని పాడుతూ తాను తిరిగిన ప్రాంతాలలోని కథలెన్నిటినో చెప్పిందట. ఆ కథలలోని జీవిత సత్యాలను బాలు గారు, కె.వి.మహదేవన్ గారు, ఆరుద్ర గార్ల సాయంతో బాపుగారు చెప్తున్నారు మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గొదారి పాడింది గల గలా..
గొదారి పాడింది గల గలా..
దానిమీద నీరెండ మిల మిల

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే..ఏఏ..
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆఆఅ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా

నవ్వువచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే...ఏఏ..
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పాడింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా...

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వలా

శనివారం, జులై 04, 2015

గోరువంక గోదారివంక...

నయగరా ఫాల్స్ దగ్గర ఉండే మిస్ట్ కూ ఆ చల్లని వాతావరణానికీ రొమాంటిక్ గా ఫీలవని జంట ఉండదు అని అంటారు. అలాగే ఇక్కడ గోదావరి చలి.. ఎదురుగా వెచ్చని నెచ్చెలి.. ఇక హీరోగారినెలా ఆపాలి.. ఆ ప్రేమ జంట పాట మీరూ వినండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కబడ్డీ కబడ్డీ (2003)
సంగీతం : చక్రి
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : రవివర్మ, కౌసల్య

గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా
పందార తిన్నట్టు తియ్యంగ ఉన్నాది
నాకేమిటయ్యిందొ తెలియదుగా
మందార పువ్వంటి నాజూకు వయ్యారి
నన్నేలే రమ్మంటు పిలిచెనుగా
కలవరమా చెరిసగమా
ఏమని చెప్పను భామా ఎంతని దాచను రామా
గోదారి కెరటాలు చల్లగాలి పంపుతుంటే

గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా

గుప్పెడు గుండెల చప్పుడు రేగెను చప్పున నే నిను చూడగా
రెప్పల మాటున ఇప్పటి అలజడి ఎప్పుడు ఎరగను ఇదేమి గొడవా
కాకితో కబురెట్టాలి త్వరగా కారణం కనిపెట్టాలిగా
అందాల చినుకా బంగారు తునక సింగారి చినుకా ఓఓఓఓ
ఎండల్లో చలిగా గుండెల్లో గిలిగా కోరికేదొ రేగెనా గోలచేసెనా

గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా

కమ్ముకు పోయిన తిమ్మిరి యాతన రమ్మని పిలిచెనుగా మరి
కన్నుల వాకిట పున్నమి పువ్వుల వెన్నెల కాసెను ఇదేమి చొరవా 
ప్రేమలో పడిపోయింది మనసా ప్రాయమే చిగురేసిందిగా
మంచల్లె కురిశా ముద్దుల్లో మురిశా నిద్దర్లో తలచా ఓఓఓఓ
వానొచ్చి తడిశా పువ్విచ్చి పిలిచా 
వాయిదాలు వేయకా దాయి దాయి దా

గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా


శుక్రవారం, జులై 03, 2015

పూసింది పూసింది పున్నాగ...

పువ్వులా నవ్వే అమ్మాయిలని చూసుంటారేమొ కానీ అమ్మాయిలా నవ్వే పువ్వులని మీరెప్పుడైనా చూశారా.. మన వేటూరి వారు చూశారటండోయ్ అదీ వారికిష్టమైన పున్నాగ పూలలో.. ఆ చిత్రమేమిటో కీరవాణి గారు కమ్మని బాణీ కట్టి మరీ వినిపిస్తున్నారు.. విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

హహ..పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

గురువారం, జులై 02, 2015

నిండు గోదారి కదా...

గోదావరంత అందమైనది మరేం ఉంటుంది చెప్పండి అందుకే ఈ అందమైన ప్రేమజంట తన ప్రేమను గోదావరితో పోల్చుకుంటూ ఆనందంగా ఎలా ఆడీ పాడుకుంటున్నారో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నువ్వు లేక నేను లేను (2002)
సంగీతం : R.P.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : R.P.పట్నాయక్, కౌసల్య

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
 
ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
 
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ

 
ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని
 
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది
 
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ 
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
 
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ


బుధవారం, జులై 01, 2015

వేవేలా వర్ణాలా...

నాసిక్ పుట్టినిల్లుగా కొవ్వూరు మెట్టినిల్లుగా మనకై శివ కరుణతో భూమిపైకి జాల్వారిన అద్భుతం మన గోదావరి.. పాయలుగా కరిగి, ప్రవాహంగా కదిలిపోతూ తీరాన ఉన్న ప్రతి అణువుకీ పచ్చదనాన్ని అద్దే అన్నపూర్ణ మన గోదావరి.. ఒద్దికగా ఒంపులు తిరుగుతూ శాంతి శాంతిగా ప్రవహించే రుక్మిణంటి మన గోదావరి.. అడిగిన వారికి లేదనక పవిత్రతని ప్రసాదిస్తున్నట్టి మన అఖండ గోదావరికి పుష్కరాలు.. అదీ 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుత ఘడియలలో పుష్కరాలు.. అందుకే ఈ నెల రోజులూ ఆ అమ్మ ఒడిలో సేద దీరుదాం.. అమృతమంటి ఆ నీటి ఒరవడిలోని ప్రతి బిందువునీ మన పాటలలో ఆస్వాదిద్దాం...
 
గోదావరిని ప్రకృతి తో పోలుస్తూ సాగే ఈ సిరివెన్నెల రచనను ముందుగా విందాం. ఈ పాటకు ఇళయరాజా గారి స్వర రచన అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. అలాగే జూలై 14 నుండి 25 వరకూ సాగే పుష్కరాల గురించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన "గోదావరి పుష్కరాల సంక్షిప్త పరిచయం" e-బుక్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంకీర్తన
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలూ, కౌసల్య (సీనియర్ లీడ్ కోరస్ సింగర్)

ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
వేవేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతాలై...

వేవేలా వర్ణాలా... ఈ నేలా కావ్యాలా...

ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే...
ఓ...తల్లీ గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి
పల్లె పల్లె పచ్చాని పందిరీ...పల్లె పల్లె పచ్చాని పందిరీ...
నిండూ నూరేళ్ళు పండు ముత్తైదువల్లె వుండు
పంటా లచ్చిమి సందడీ...పంట పంటా లచ్చిమి సందడీ...
తందైన..తందతైన..తందైన..తందతైన..
తందైన..తందతయ్యనా.. తయ్య..తందైన..తందతయ్యనా..

వాన వేలి తోటీ నేల వీణ మీటే...
నీలి నింగి పాటే.. ఈ చేలటా...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న..
కమ్మనైన కవితలే ఈ పూలటా...
ప్రతి కదలికలో నాట్యమె కాదా..
ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా..
ఎదకే కనులుంటే....

వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతా లై...
వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
లాలలా...ఆ అ ఆ...
లాలలా...ఆ అ ఆ...





నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.