బుధవారం, జనవరి 12, 2011

Elvis - In the Ghetto

యువతీయువకుల మధ్య పుట్టే ప్రేమ మీద ఎక్కువ పాటలు పాడిన ఎల్విస్ లోని అసలైన ప్రేమని చూపెడుతుంది ఈ “In the Ghetto” పాట. "The Vicious Circle" అనే పేరుతో Mac Davis రాసిన ఈ పాట లోని సాహిత్యం నన్ను కట్టిపడేస్తుంది. చికాగోలోని Ghetto అంటే స్లం లో ఒక చిన్నారి పుట్టుకతో మొదలైన పాట అతనికి సహాయం చేసే చేయి లేకపోవడం వలన ఆకలికి తాళలేక అతను దొంగతనాలు హత్యలు లాంటి నేరాలవైపు ఆకర్షితుడై చివరికి అందులోనే చనిపోయాడనీ.. అదే సమయానికి ఆ Ghetto లో మరో చిన్నారి పుట్టాడనీ.. అతని జీవితం కూడా ఇంతే ఉండబోతుందని సూచిస్తూ ముగుస్తుంది. హృదయాలను కదిలించే పాట... ఎల్విస్ గొంతులో ప్రాణం పోసుకున్నపాట.. విన్నవెంటనే అలాంటి నిస్సహాయులకు సాయం చేయాలనిపించే పాట... మీరూ వినండి.



As the snow flies
On a cold and gray Chicago mornin'
A poor little baby child is born
In the ghetto
And his mama cries
'cause if there's one thing that she don't need
it's another hungry mouth to feed
In the ghetto

People, don't you understand
the child needs a helping hand
or he'll grow to be an angry young man some day
Take a look at you and me,
are we too blind to see,
do we simply turn our heads
and look the other way

Well the world turns
and a hungry little boy with a runny nose
plays in the street as the cold wind blows
In the ghetto

And his hunger burns
so he starts to roam the streets at night
and he learns how to steal
and he learns how to fight
In the ghetto

Then one night in desperation
The young man breaks away
He buys a gun, steals a car,
tries to run, but he don't get far
And his mama cries

As a crowd gathers 'round an angry young man
face down on the street with a gun in his hand
In the ghetto

As her young man dies,
on a cold and gray Chicago mornin',
another little baby child is born
In the ghetto

మంగళవారం, జనవరి 11, 2011

Elvis - I am in Love

నేను మొదట విన్న ఈ పైవీడీయో లోని పాట “I am in love.. I’m all shook up” విన్నాక మనం కూడా ఆ పాటను ఉద్దేశించి ఇంకా ఎల్విస్ ను ఉద్దేశించీ “I am in love.. I’m all shook up” అని పాడుకుంటాం అనడంలో ఏ సందేహమూ లేదు. పల్లవి చివర్లో వచ్చే హమ్మింగ్ నాకు చాలా ఇష్టం పాట విన్నవెంటనే నా హాట్ ఫేవరెట్ అవడానికి అదే ముఖ్య కారణం. ఇక వీడియో లో కూర్చిన ఎల్విస్ చిత్రాలు అధ్బుతంగా ఉండి “he is something” అనిపిస్తాయి అందుకు కూడా ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం.

A well I bless my soul
What's wrong with me?
I'm itching like a man on a fuzzy tree
My friends say I'm actin' queer as a bug
I'm in love
I'm all shook up
Mm mm oh, oh, yeah, yeah!

My hands are shaky and my knees are weak
I can't seem to stand on my own two feet
Who do you thank when you have such luck?
I'm in love
I'm all shook up
Mm mm oh, oh, yeah, yeah!

Please don't ask me what's on my mind
I'm a little mixed up, but I'm feelin' fine

When I'm near that girl that I love best
My heart beats so it scares me to death!

She touched my hand what a chill I got
Her lips are like a volcano that's hot
I'm proud to say she's my buttercup
I'm in love
I'm all shook up
Mm mm oh, oh, yeah, yeah!

My tongue get tied when I try to speak
My insides shake like a leaf on a tree
There's only one cure for this soul of mine
That's to have the girl that I love so fine!

సోమవారం, జనవరి 10, 2011

Elvis - Jail House Rock

ఎలాంటి మూడ్ లో ఉన్నా నిముషం లొ సెట్ చేసే ఈ జైల్ హౌస్ రాక్ సాంగ్ నాకు బాగా నచ్చిన ఎల్విస్ పాటలలో మరొకటి. మన షమ్మీకపూర్ స్టెప్స్ అన్నీ ఇందులో చూడవచ్చు... ఈ పాటలో ఎల్విస్ ఎనర్జీ ఇంకా కదలికలు ఇప్పుడు కూడా వావ్ అనిపిస్తాయ్ అప్పట్లో ఇక ప్రజలు వెర్రెత్తి పోయి ఫాన్స్ అవడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు :-)


Songwriters: Leiber, Jerry; Stoller, Mike;

The warden threw a party in the county jail
The prison band was there and they began to wail
The band was jumpin' and the joint began to swing
You should've heard those knocked out jailbirds sing

Let's rock
Everybody, let's rock
Everybody in the whole cell block
Was dancin' to the Jailhouse Rock

Spider Murphy played the tenor saxophone
Little Joe was blowin' on the slide trombone
The drummer boy from Illinois went crash, boom, bang
The whole rhythm section was a purple gang

Let's rock
Everybody, let's rock
Everybody in the whole cell block
Was dancin' to the Jailhouse Rock

Number 47 said to number 3
"You're the cutest jailbird I ever did see
I sure would be delighted with your company
Come on and do the Jailhouse Rock with me"

Let's rock
Everybody, let's rock
Everybody in the whole cell block
Was dancin' to the Jailhouse Rock, Rock, Rock

Sad Sack was sittin' on a block of stone
Way over in the corner weepin' all alone
The warden said, "Hey, buddy, don't you be no square
If you can't find a partner use a wooden chair"

Let's rock
Everybody, let's rock
Everybody in the whole cell block
Was dancin' to the Jailhouse Rock

Shifty Henry said to Bugs, "For Heaven's sake
No one's lookin', now's the chance to make a break"
Bugsy turned to Shifty and he said, "Nix nix
I wanna stick around a while and get my kicks"

Let's rock
Everybody, let's rock
Everybody in the whole cell block
Was dancin' to the Jailhouse Rock

Dancin' to the Jailhouse Rock, dancin' to the Jailhouse Rock
Dancin' to the Jailhouse Rock, dancin' to the Jailhouse Rock
Dancin' to the Jailhouse Rock, dancin' to the Jailhouse Rock
Dancin' to the Jailhouse Rock

ఆదివారం, జనవరి 09, 2011

ఏల్విస్ - Fools Rush in.

ఈపాట కూడా మొదటి సారి నేను ఒక సినిమాలోనే విన్నాను.. ఆ సినిమా పేరు కూడా ఫూల్స్ రష్ ఇన్.. Salma Hayek కనిపించేసరికి టివి ఛానల్ మార్చాలనిపించక సినిమా మొత్తం చూసేశాను :-) డీసెంట్ లవ్ స్టోరీ దాని ట్యాగ్ లైన్ “What if finding the love of your life meant changing the life that you loved?” ఇంకా మోస్ట్ ఫేమస్ సీన్ ఒకేసారి రెండు చోట్ల ఉండాలని ఉందన్న ప్రేయసిని హూవర్ డ్యామ్ పైకి తీసుకువెళ్ళి అరిజోనా, నెవడా రెండు రాష్ట్రాలలోనూ ఒకేసారి ఉన్నావని చూపించే ప్రేమికుని సీన్ కూడా ఈ సినిమాలోనిదే.

ఈ పాటలోని అందమైన లిరిక్స్ కి ఎల్విస్ స్వర మాయాజాలం తోడై పాట అలా మన మనసులో నిలిచిపోతుంది.       



Wise Men say
only fools rush in
but I cant help
falling in love with you

Shall I stay
would it be a sin
if I can't help falling in love with you...

Like a river flows, surely to the sea
Darlin so it goes, somethings are meant to be..
Take my hand, take my whole life too
for I can't help fallin in love with you...

Like a river flows, surely to the sea
Darlin so it goes, somethings are meant to be..

Take my hand take my whole life too for I cant help
falling in love with you

for I cant help falling in love with...... you.

సోమవారం, జనవరి 03, 2011

పూచే పూలలోనా - గీత (1973)

ఎవడండీ వీడు కొత్త సంవత్సరం మొదలే ఇంత విషాద గీతాన్ని పరిచయం చేస్తున్నాడు అని కోప్పడకండి. విధికి పాతా కొత్తా పండగా పబ్బమా ఏమీ తెలియదు నిశ్శబ్దంగా కదిలే కాలంతోపాటు సాగుతూ అదను చూసి గాయం చేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గాయానికి ఇలాంటి మధుర గేయాల లేపనంపూస్తూ మంచి రోజులకోసం ఎదురుచూడటం తప్ప ఒకోసారి ఏమీ చేయలేము. మనసు విషాదంగా ఉన్నపుడు హుషారునిచ్చే పాటలు పాడుకోవాలి గానీ ఇంకా విషాదాన్ని పెంచేపాటలు ఎందుకు బాబు అనేవారూలేకపోలేదు. కానీ ఒకోసారి “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అన్న దేవదాసు మాటలు గుర్తుచేసుకోక తప్పదు.

ఎలాంటి భావాన్నైనా తన స్వరంలో అద్భుతంగా పలికించి శ్రోతలను తన్మయత్వంలో ముంచేసే బాలుగారు ఇలాంటి పాటలు పాడే అవకాశం వచ్చినపుడు తన స్వరంతో ఆపాటలో మరిన్ని భావోద్వేగాలను రంగరించి మన హృదయ కవాటాలను తెరచి సరాసరి అందులోకి ఒంపేస్తున్నారా అనిపించేలా పాడేస్తారు. కె.వి. మహదేవన్ గారి స్వరసారధ్యంలో జికె మూర్తిగారు రచించిన ఈ పాట గీత (1973) అనే చిత్రంలోనిది. ఇక్కడ ఇచ్చిన ఇస్నిప్స్ ప్లగిన్ లో కానీ లేదంటే చిమట మ్యూజిక్ లో ఇక్కడ నొక్కి కానీ వినవచ్చు.

చిత్రం: గీత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జి.కె.మూర్తి
గానం: బాలు గారు.

పూచే పూలలోనా.. వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే..
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ .... ఓ చెలీ ....

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ .... ఓ చెలీ ....

ఎన్నో జన్మల బంధము మనదీ..
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ..
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే

గురువారం, డిసెంబర్ 30, 2010

క్షత్రియ పుత్రుడు (1992) - సన్నజాజి & మురిసే

దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి అనువాద చిత్రమైన క్షత్రియపుత్రుడు తెలుగులో హిట్ కాలేదు కానీ  పూర్తి తమిళ వాతావరణం ఇబ్బంది పెట్టనటువంటి వారికి ఈ సినిమా పర్లేదు ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. నాకు శివాజీ గణేషన్, కమల్, రేవతి, నాజర్, గౌతమిల నటన చూడటానికైనా ఒకసారి చూసి తీరవలసిందే అనిపించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం.

“సన్నజాజి పడక” పాటలో జానకి బాలు ఇద్దరూ కలిసి ఆటలాడుకున్నట్లుగా పాడారు. పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్.. ఎందుకే.. అన్న చోట తను రాగంతీసినపద్దతితో ఆకట్టుకుంటే.. బాలుగారు కూడా నేనేం తక్కువతిన్నానా అంటూ అవకాశమొచ్చినపుడల్లా అల్లరి చేసేరు. ఇక “మురిసే పండగపూట” లో మాధవపెద్ది రమేష్ గారి గొంతువైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. పాటంతా ఒకే మూడ్ తో సాగే ఈ పాటలో ఘటం తో వేసే దరువు  నాకు చాలా ఇష్టం. ఈ రెండు పాటలు మీకోసం. యూట్యూబ్ వీడియో ప్లే అవకపోతే మ్యూజిక్ మజా ప్లగిన్ లో ఆడియో మాత్రం వినవచ్చు.

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Kshatriya+Putrudu.html?e">Listen to Kshatriya Putrudu Audio Songs at MusicMazaa.com</a></p>


చిత్రం : క్షత్రియపుత్రుడు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : జానకి, బాలు గారు

సన్నజాజి పడకా..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..

||సన్నజాజి||

సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే..
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..

||సన్నజాజి||

కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని..
దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే..
పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే..
పండించగ చెరుకున్నా.. నీ దరికే..
అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ..
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా..
దిండే పంచే వేళయినది రావే..
దిండే పంచే వేళయినది.. రా..వే..

||సన్నజాజి||
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : క్షత్రియపుత్రుడు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : మాదవపెద్ది రమేష్, రాజశ్రీ

ఓ ఓ ఓ...
మురిసే పండగపూటా.. రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హొ..

||మురిసే||

కల్లా కపటమంటూ లేనీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
పల్లె పట్టు ఈ మాగాణీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
కల్లా కపటమంటూ లేనీ పల్లె పట్టు ఈ మాగాణీ..
మల్లె వంటి మనసే వుందీ.. మంచే మనకు తోడై వుంది..
కన్నతల్లి లాంటి ఉన్నఊరి కోసం.. పాటుపడేనంటా రాజు గారి వంశం..
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు..
పలికే.. దైవం.. మా రాజు గారు..

||మురిసే||

న్యాయం మనకు నీడైఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
ధర్మం చూపు జాడేఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
న్యాయం మనకు నీడైఉందీ.. ధర్మం చూపు జాడేఉంది..
దేవుడ్నైన ఎదురించేటీ.. దైర్యం మనది ఎదురేముంది..
చిన్నోళ్ళింటి శుభకార్యాలు.. చేయించేటి ఆచారాలు..
వెన్నెలంటి మనసుల తోటి.. దీవించేటి అభిమానాలు..
కలిసిందీ ఒక జంట.. కలలెన్నో కలవంట
కననీ.. విననీ.. కథ ఏదో వుందంట..

||మురిసే||    

ఆదివారం, డిసెంబర్ 26, 2010

సిరిమల్లె నీవే - పంతులమ్మ(1977)

కొన్ని పాటలకు పాతబడడమంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తుంది. పంతులమ్మ సినిమాలో రాజన్ నాగెంద్రగారు స్వరపరిచిన ఈ పాట వినండి. ఎన్ని సార్లు విన్నా ఆ తాజాదనం ఎక్కడికీ పోదు.. ఎప్పటికప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉంటుంది, ఊహల్లో విహరింప జేస్తుంది... వేటురి గారు సాహిత్యమందించిన ఈ పాట బాలుగారి స్వరంలో అందంగా రూపుదిద్దుకుంది. తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది... సంధ్యా సమయం లో మంద్రమైన స్వరంలో ఈ పాట వింటూ అలా ఊహల్లో జారుకోవడం నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఈ పాట వీడియో మీ కోసం... యూట్యూబ్ చూడలేని వారు చిమట లో ఇక్కడ పాట మాత్రం వినవచ్చు.


చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
 
అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

బుధవారం, డిసెంబర్ 22, 2010

చుట్టూపక్కల చూడరా - రుద్రవీణ

కొన్ని సినిమాలు వాటిలో కొన్ని పాటలు మనసుల్లో చెరగని ముద్ర వేసి గుండెలోతుల్లో నాటుకు పోతాయి. అలాంటి ఒక పాటే రుద్రవీణ సినిమాలోని ఈ “చుట్టూపక్కల చూడరా చిన్నవాడా” అన్నపాట. ఈ పాట ముందు వచ్చే  సన్నివేశం సైతం చాలా ఆకట్టుకుంటుంది. “దేవుడు నీకిచ్చిన రెండుచేతుల్లో ఒకటి నీకోసమూ రెండోది పక్కవాడి చేయూత కోసం.” అంటూ ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు అతని హావభావాల సహితంగా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. సీతారామ శాస్త్రిగారు రాసిన ఈ పాట సమస్తం యువతను సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా.. కర్తవ్యబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది.


చిత్రం: రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ||2||
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకును కానీయకు వ్యర్థం ||2||

||చుట్టూపక్కల||

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే 

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే

||చుట్టూపక్కల||

సోమవారం, డిసెంబర్ 13, 2010

బెజ బెజ బెజవాడ - బెజవాడరౌడీలు పాట

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “బెజవాడరౌడీలు” సినిమా కోసం రికార్డ్ చేసిన పాట తన ట్విట్టర్ నుండి సేకరించినది... మీకోసం సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను వింటూ చదువుకోండి. ఆ గోలలో అక్కడక్కడ పదాలు అర్ధంకాలేదు అవి బ్లాంక్స్ ఇచ్చాను మీకేమైనా అర్ధమైతే కామెంట్ ద్వారా చెప్పండి.

http://www.mediafire.com/?lsbhce2qarhtpef
 
 

 
చిత్రం: బెజవాడరౌడీలు
రచన : సిరాశ్రీ
సంగీతం : అమర్ మోహ్లి
గానం : జొ జొ

బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ
బెజ బెజ బెజ బెజ బెజవాడా..గజ గజ గజ గజ గజలాడా..
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా..
దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా... ముందరున్న వాడిదమ్ము చెదరంగా..
సంఘనీతి పాపభీతి వలదేవీ .. కత్తికన్న గొప్పవేమి కాదేవీ..
కోరుకుంటే కొమ్ముకాసి కాకపోతే కాలరాసి
పొంచిఉన్న పంజాచూసి గేలమేసి వేటువేసి
కుత్తుకలో కత్తిదూసి అగ్గిరాసి బుగ్గిచేసి 
కలుపులన్ని పెరికేసి కుళ్ళునంత కడిగేసి

||బెజ బెజ బెజవాడ||

నీదమ్మునే నమ్ము పొగలాగ నువ్ కమ్మూ
పగబట్టిలేకుమ్ము గెలుపు నీదే లేరా
నువ్వేలె ఈరోజు నువ్వేలే రారాజు
నువ్ ఏలే ఆరోజు ముందరుందిలేరా

అదురువద్దురా.. బెదురువద్దురా..
కుదురువద్దురా.. నిదురవద్దురా..
శ్వాసనిండుగా ఆశనింపరా..
పట్టుపట్టరా గద్దెనెక్కరా..
పదవె ముద్దురా.. పైడిముద్దరా
బంధువొద్దురా బంధమొద్దురా
యుద్దమప్పుడే కృష్ణుడెప్పుడో గీతపాడెరా నిజము చెప్పెరా
ఇంద్రకీలమే.. ఇక నీకు తోడురా..
అడుగై పిడుగై పడగై కాటేయ్ రా... 

||బెజ బెజ||

ఆదివారం, డిసెంబర్ 12, 2010

చిటపట చినుకులు - ఐతే

వారంలో ఒక్కసారైనా తప్పనిసరిగా నేను వినే పాటలలో సిరివెన్నెల గారు రాసిన ఈపాట ఖచ్చితంగా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత మాత్రమే పరిచయమైన ఈ పాట విన్నవెంటనే నన్ను ఆకట్టుకుంది. ఆశవహ దృక్పధం గురించి కనే కలల గురించి వర్ణిస్తూ సాగే శాస్త్రిగారి సాహిత్యం సినిమా ఫీల్ కు తగినట్లుగా ఆంగ్లపదాలతోకూడా అందంగా ఆటలాడుకున్నట్లుగా సాగుతుంది, కీరవాణి వైవిధ్యమైన కంఠస్వరం ఈపాటకు చక్కగా నప్పింది. పాట చిత్రీకరణ కూడా వైవిధ్యంగా చాలా బాగుంటుంది. 

అప్పట్లో ఈ లోబడ్జెట్ సినిమా బెంగుళూరులో చాలారోజులవరకూ రిలీజ్ అవ్వలేదు, ఏదోపనిమీద హైదరాబాద్ వెళ్ళినపుడు అక్కడ చూశాను. ఆ తర్వాత పాటకూడా చాలారోజులు దొరకలేదు ఇప్పటంత విరివిగా అంతర్జాల వాడకం కూడా లేకపోవడంతో అక్కడా చుక్కెదురే. కొంతకాలానికి ఈ సినిమాలోని ఈపాట ఇంకొన్ని మ్యూజిక్ బిట్స్, అమృతం సీరియల్ టైటిల్ సాంగ్, లిటిల్ సోల్జర్స్ పాటలు అన్నీ కలిపి ఒక సిడి గా రిలీజ్ చేశారు. అదే సమయానికి నా నేస్తం హైదరాబాద్ నుండి బెంగుళూరు వస్తుంటే తనతో తెప్పించుకున్నా ఈ సిడి. ఈ పాటవిన్న ప్రతిసారీ ఈ ఙ్ఞాపకాలు కూడా ఒక రీల్ లా మనసులో తిరుగుతుంటాయ్.


చిత్రం : ఐతే (2004)
సంగీతం : కళ్యాణిమాలిక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : కీరవాణి

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదె umbrella ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలీ బాబా ఉంటే
అడిగిన తరుణమె పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన fate ఏ flight అయ్యే runway
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

నడిరాత్రే వస్తావెం స్వప్నమా?
పగలంతా ఎం చేస్తావ్ మిత్రమా.....?
ఊరికినే ఊరిస్తే న్యాయామా ?
సరదాగా నిజమైతే నష్టమా?
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా? ఓ చిరునవ్వా.. ఇలా రావా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

వేకువనే మురిపించె ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకం లో లేవా ఏ రంగులు ?
నలుపొకటే చూపాల కన్నులూ?
ఇలాగేనా ప్రతీ రోజు ? ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.