శనివారం, ఏప్రిల్ 15, 2017

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్...

ఈ రోజు కిల్లర్ సినిమాలోని టైటిల్ సాంగ్ తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కిల్లర్ (1992) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
హహ హా... హహ హా... హహ హాహాహా..

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్

నా జీవితం ఇది ఓ నాటకం
విధితో విధిగా పోరాటం
నా సంతకం యమ ప్రాణాంతకం
విలనే అననీ ఈ లోకం
యముడుకి పాశం తగిలించే మొనగాడిని
మదనుడి బాణం విరిచేసే మగవాడిని
అదిసరి నీ పనిసరిలే చెలి దరిలో
you are my love king.. I have a liking..
you are my love king.. I have a liking..

ఆటల్లో పాటల్లో నవ్వించి కవ్వించు అంకుల్
ఊకొట్టి జోకొట్టి ఊరెళ్ళిపోతాడు టింకుల్
అందుతున్న మేనమామ అందగానే చందమామ
you are my lover.. my name is eeswar..
హో you are my lover.. my name is eeswar..

నా డ్యాన్సులో తొలి రొమాన్సులో
జతిని రతిని నేనంట
నా వేటలో చలి సయ్యాటలో
ఎరనై ఎదుటే నేనుంటా
నెమలికి పింఛం పురివిప్పే నటరాజుని
రమణికి అందం పులకించే రసరాజుని
కథాకళిలో మణిపురిలో కలయికలో
నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్
హో నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ యా
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్... my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్


శుక్రవారం, ఏప్రిల్ 14, 2017

ఈ తూరుపూ ఆ పశ్చిమం...

పడమటి సంధ్యారాగం చిత్రం టైటిల్ సాంగ్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పడమటి సంధ్యారాగం (1986)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...

you avakay me ice cream
this is the hot and sweet loves dream
united streets of hearts we have
like indian namasthe

ఆకశంలో తారా సుడిగాలికారని దీపం
గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే

సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం..

గ్రహణాలు లేనీ ఆ తారలన్నీ...గగనాన కలిసీ ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం...కలిసింది ఈ బంధం

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

ఛైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే

ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరితాపం
అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియబంధం

ఏ దేశమైనా ఆకాశమొకటే...ఏ జంటకైనా అనురాగమొకటే..
అపురూపమీ ప్రణయం.... అపురూపమీ ప్రణయం

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

you avakay me ice cream
this is the hot and sweet loves dream
united streets of hearts we have
like indian namasthe


గురువారం, ఏప్రిల్ 13, 2017

ఆడాళ్ళూ.. మీకు జోహార్లు...

ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు

ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఇద్దరి మంచితనం
నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే
మతిపోతుంది ఈదినం

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం

ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ... ఇందుకే పుట్టారా

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... హ హ హ హ...
 

బుధవారం, ఏప్రిల్ 12, 2017

బాషా చూడు భాషా చూడు...

రజనీకాంత్ కి ఉన్న ఇమేజ్ ని పదింతలు చేసి తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెంచిన భాషా చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు

బాషా బాషా బాషా బాషా
హే బాషా చూడు బాషా చూడు
సింగం లాంటి నడక చూడు
వెంట వచ్చు సైన్యం చూడు
పలనాటి బాల చంద్రుడి
పౌరుషమే ఉంది చూడు
బొబ్బిలి పులిగ జబ్బ చరిచి
వచ్చే ఆ తెగువ చూడు
ధర్మ సంస్థాపనకై
యుగపురుషుడు వచ్చినాడురా

ఉహహహహ..
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  

బాషా చూడు బాషా చూడు
ఉక్కు వంటి గుండె చూడు
ఉప్పెనంటి మనిషి చూడు
రగులుతున్న అగ్ని నగం
పగల పొగల సెగలు చూడు
గూండాలకూ దాదాలకూ
బాషా సింహ స్వప్నం చూడు
న్యాయం కోసం దేవుడికైనా
ఎదురు తిరుగు ధైర్యం చూడరా

ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  

హే బాషా చూడు బాషా చూడు
బొంబాయి నేలు రాజా చూడు
లోకం వెంట వచ్చెను చూడు
కాలం ఆగి చూసెను చూడు
నింగే వంగి మొక్కెను చూడు
చుక్కలంటే మేడలైనా
బాషాకే తలవంచెను చూడు
కోట్లైనా నోట్లైనా బాషా ముందుకు
వచ్చెను చూడరా

ఆహహహ
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  


మంగళవారం, ఏప్రిల్ 11, 2017

నాగమల్లివో తీగమల్లివో

ఈ రోజు నాగమల్లి సినిమాలోని టైటిల్ సాంగ్ తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాగమల్లి (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నాలోనా
ఊగాలీ రాగ డోలా
నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ... 

 

సోమవారం, ఏప్రిల్ 10, 2017

ఈ ఎర్రగులాబీ విరిసినది...

ఎర్రగులాబీలు సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం  : ఎర్ర గులాబీలు (1979)
సంగీతం :  ఇళయరాజా
సాహిత్యం :  వేటూరి
గానం :  బాలు, జానకి

రురూరురూ.. రురురురూ..
రురురురురురు..
ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..


లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా

నేనిక నీకే సొంతము
న న న న న
నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది ..

పెదవిని.. ఈ మధువునూ
నేడే చవిచూడనా
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా

వయసుని వయసే దోచేది
న న న న న న
అది మనసుని నేడే జరిగేది

న న న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నిను కోరి..
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..
నననన.. నననన..అహహా..


ఆదివారం, ఏప్రిల్ 09, 2017

సూర్యుడు చంద్రుడు...

లెజెండ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లెజెండ్ (2014)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దేవీశ్రీప్రసాద్
 
సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు
క్రిష్ణుడు విష్ణువు కలిసారంటె వీడు
హెయ్ మాటలు వాడడు మౌనమే పేలుడు
ఎక్కడికక్కడ లెక్కలుతేలుస్తాడు
జనమే నేనూ నేనే జనమంటాడు
రక్తం రంగే రక్షా గుణమంటాడూ
ఊపిరిమొత్తం ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్నీ నిర్జించేలా గర్జిస్తున్నాడూ

హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్

హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్

ధర్మనిబద్దుడు సర్వసమర్ధుడు
చీకటి చీల్చే చెగువేరా వీడూ
శక్తి సముద్రుడు శత్రుదుర్బేద్యుడు
గన్నై పేలే కాంతితత్వం వీడూ
కదిలే చట్టం నడిచే న్యాయం వీడూ
వెలుతురుకన్నా వేగంగా వస్తాడూ
నాయకుడైనా సేవకుడై వీడూ
కష్టం తుడిచే చూపుడు వేలై
చెరితలు రాస్తాడూ....

హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్

హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్
హి ఈజ్ యె లెజెండ్ హి ఈజ్ యె లెజెండ్


శనివారం, ఏప్రిల్ 08, 2017

ఐదేళ్ళ వయసుకే...

డాన్ శీను చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డాన్ శీను (2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బాబా సెహగల్

ఎస్.. హూ ఈజ్ ఇట్. డాన్ శీను..
ఒంటి పేరు శీను.. అద్దిరిపోయిందబ్బా
ఇంటి పేరు డాను.. అల్లాడిపోయే దెబ్బ
ఒంటి పేరు శీను.. శీను..
నా ఇంటి పేరు డాను.. డాను..

వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే
వీడి మాటలు నమ్ముకుంటె
ప్రతి ఇంటి గడపకో డానుంటాడే

డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ
నా ముమ్కిన్ హై .. ఏ..

ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా
దావుదుకి తీసిపోను దేన్లోనైనా
త్వరలో ఎస్ గాంగ్ పెట్టి రాబోతున్నా
ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే

ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా

డి ఫర్ డానంటేనే, ఓ స్టారు సూపర్ స్టారు
ఏ పుడింగు లెజెండుకైన ఉండదుగా అంత పవరు
ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా మన వైపే చూస్తారు
ఏ న్యూస్ కు తక్కువ పడిన మన స్టోరీ వేస్తారు
కన్ను కొడితె కత్తి లాంటి పోర్లు
కాలు పెడితే కొత్త కొత్త కార్లు
ఫోను కొడితే మస్తుగా వసూళ్ళు
గన్ను పడితే చెప్పలేని థ్రిల్లూ.. ఏ..
దమ్ముంటే దక్కుతుందిరా డాన్ చైరు
ఆ చైరుకి టైలర్ మేడ్ రా నా ఫిగరు

ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే
ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా

వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే
వీడి మాటలు నమ్ముకుంటె
ప్రతి ఇంటి గడపకో డానుంటాడే

హే గ్లోబును బంతాడొచ్చు, మనమే డాన్ ఐతే
మోస్ట్ వాంటెడ్ మొగాడవ్వొచ్చు డే బై డే రైజైతే
రివాల్వర్ చూపించొచ్చు రిస్కేదో ఎదురైతే
గర్ల్ ఫ్రెండ్స్ తో జింతాకనొచ్చు మూడంతా వేడైతే
పోలీస్ నైనా విసికించొంచ్చు
సారిడాన్లే తినిపించొచ్చు
సినిమా స్టార్స్ కి ఫ్రెండ్ అవ్వొచ్చు
క్రికెట్ స్టార్స్ ని ఆడించొచ్చు
ఏ ఏం చేస్తున్నా నయా పైస లేదే ఖర్చు
ఎవడినో బెదిరించి కోట్లు గుంజేయచ్చు.

ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే


శుక్రవారం, ఏప్రిల్ 07, 2017

హ్యాపీ పాపకి లుక్కిస్తే...

హ్యాపీ చిత్రంలోని హుషారైన టైటిల్ సాంగ్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హ్యాపి (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : చంద్రబోస్
గానం : కార్తీక్

హ్యాపీ...పాపకి లుక్కిస్తే హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...
హ్యాపీ... బేబీ కి బెంజుంటే హ్యాపీ..
బాబు కి రేంజుంటె హ్యాపీ..
బావ కి ఏజ్ ఐతె హ్యాపీ..

వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ..
థియేటర్ లొ ప్యారి నీపై చెయ్యేస్తే ఫుల్ హ్యాపి.
బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ.
కలర్సు చిమ్మె కసక్కు నీకే చమక్కులిస్తె యమ హ్యాపీ..
 
హ్యాపీ...పాపకి లుక్కిస్తె హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...

నినినినిని..నీకో స్వీటీ సిగ్నలిస్తె హ్యాపీ..
స్వీటీ డాడీ ఎస్.పి. ఐతే బీ.పి. హ్యాపీ.. బీ.పీ.
హ్యాపీ.. బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ.
నెక్స్ట్ డే పార్టీ మారిస్తే అన్ హ్యాపీ
చెల్లెలేమో ఫ్రెండ్సొచ్చారని చెవిలో చెబితే వెరీ హాపీ
వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి..
హ్యాపీ... హ్యాపీ..

హ్యాపీ పాపకి లుక్కిస్తె హ్యాపీ.
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...

గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు..
ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం...

హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి
ప్రేమలో పడకుంటె.. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి హ్యాపి
సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి
సింగిల్ గా ఉంటే.. హ్యాపి
స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ
ప్యాకెట్ మనీ ఖర్చే లేదు.. బిల్డప్ అవసరమే లేదు..
వెయిటింగ్ చేసె చాన్సే లేదు.. చాకిరి చేసే శ్రమ లేదు..
అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు
అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు..

హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి
ప్రేమలో పడకుంటె.. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి..

 

గురువారం, ఏప్రిల్ 06, 2017

ధృవ ధృవ...

ఈ రోజు ధృవ చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధృవ (2016)
సంగీతం : హిప్ హాప్ తమిళ
సాహిత్యం : చంద్రబోస్
గానం : అమిత్ మిశ్రా

అతడే తన సైన్యం
అతడే తన ధైర్యం
తనలో ఆలోచన పేరే
నిశ్శబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం
తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే
పవిత్ర ఆశయం
ధృవ ధృవ 
చెడునంతం చేసే స్వార్ధమే
ధృవ ధృవ
విధినణచే విధ్వంసం
ధృవ ధృవ
విద్రోహము పాలిట ద్రోహమే
ధృవ ధృవ
వెలుగిచ్చే విస్ఫోటం
ఓ...ఓ...ఓ...ఓ...
ధృవ ధృవ 
ఓ...ఓ...ఓ..ఓ..
ధృవ ధృవ
ధృవ ధృవ 

ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధృవ ధృవ
కలబోసుకున్న తేజం ధృవ ధృవ 
చాణిక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై
ధృవ ధృవ 
చెలరేగుతున్న నైజం ఓహో..ఓఓఓ..
ధృవ ధృవ
నిదురించని అంకిత భావమే
ధృవ ధృవ
నడిచొచ్చే నక్షత్రం
ధృవ ధృవ
శిక్షించే రక్తం శిక్షణే
ధృవ ధృవ
రక్షించే రాజ్యాంగం
ఓ...ఓ...ఓ..ఓ...
ధృవ ధృవ
ఓ...ఓ...ఓ..ఓ..
ధృవ ధృవ


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.