సోమవారం, నవంబర్ 09, 2015

ఈ చల్లని లోగిలిలో...

మిత్రులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు.. ఈ సంధర్బంగా ఆ లక్ష్మీదేవి మన యింట కొలువుండాలని కోరుకునే ఈ పాట తలచుకుందాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో

పిల్లల పాపల అల్లరితో 
ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో 
ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా
పసుపు కుంకుమ కొల్లలుగా
ఈ పచ్చని ముంగిట కురవాలి

ఈ చల్లని లోగిలిలో

శుభముల నొసగే ఈ మందిరము
శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము
శాంతికి నిలయం కావాలి
లక్ష్మి సరస్వతి పొందికగా
ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి

ఈ చల్లని లోగిలిలో

ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా
ప్రతి రోజూ ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా
ప్రతి రోజూ ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో
వచ్చే పోయే అతిధులతో
మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి

ఆదివారం, నవంబర్ 08, 2015

మనసే జతగా పాడిందిలే..

సత్యం గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఆ ఆ


మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఓ...

ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
హే హే.. ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
ఓ అందుకే ఓ చెలీ..అందుకో కౌగిలీ..ఓ చెలీ..హే..హే..

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..


నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓహో.. నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓ అందుకే ఓ ప్రియా..అందుకో పయ్యెదా.. ఓ ప్రియా...

హే హే.. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..  
ఈ వేళలో ఎందుకో..
ఈ వేళలో ఎందుకో..

శనివారం, నవంబర్ 07, 2015

కన్నులతో పలకరించు...

పెళ్ళి కానుక చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్ళి కానుక (1960) 
సంగీతం : ఏ.ఎం.రాజా
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఏ.ఎం.రాజా, సుశీల

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ఓహో..  ప్రేమే లోకమై ఆహా..
నామది పాడే పరాధీనమై అలాగా!!
 
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

చల్లని వేళ మల్లెల నీడ
చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ
చక్కని దొంగ దాగెనట
దారులకాచి సమయము చూచి
దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
అతనే నీవైతే ఆమే నేనట నిజంగా!!
 
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

నల్లని మేఘం మెల్లగ రాగ
నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ
నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకురాగ
ఎంతో సిగ్గు వేసినది
తనివితీరా తనలో తానే
తనివితీరా తనలో తానే మనసే
మురిసింది పరవశమొందగా ఓ ఐ సీ!!

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ప్రేమే లోకమై
నామది పాడే పరాధీనమై

 
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
  

 

శుక్రవారం, నవంబర్ 06, 2015

రేగుముల్లోలే నాటు సిన్నాది...

చందమామ సినిమాలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : కార్తీక్, నోయెల్, ఎం.ఎం.శ్రీలేఖ

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఆఁహాఁ
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

Come on Come on Come on Baby
Shake your body baby
Come on Come on Come on Baby
Make me rock
Come on Come on Come on Baby
Save the song baby
Come on Come on Come on Baby
Make you rock

కోనేటి నీళ్ళల్లో ఆ ఆ వంగిందిరో ఆ ఆ
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో
గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా!
తన జడను విసిరి వయ్యారి ఆఁహాఁ
చిరు నగవు చిలికి ఒకసారి అబ్బో!
కొస పెదవి కొరికి ప్రతిసారి యహ

యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో
ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక

మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ
ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో
కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది

గురువారం, నవంబర్ 05, 2015

చూసుకో పదిలంగా...

అనురాగదేవత చిత్రంకోసం చక్రవర్తి గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనురాగదేవత (1982)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : సుశీల

ఆ..ఆ..ఆ..ఆఅ..ఆ.ఆఅ..
ఆ హో... ఆ హో...

చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా
చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ

వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ
వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఆ..ఆ ఒకరి కంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం

చూసుకో పది లంగా... హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ

కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద
కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోనీ ఇరు తీరాలూ..
కనిపించని సుడిగుండాలు

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..ఆ..ఆ



బుధవారం, నవంబర్ 04, 2015

జింజిం తారారే..

అనుబంధం చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. నాకు రేడియో పరిచయం చేసిన పాటల్లో ఇదీ ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనుబంధం (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు, సుశీల

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడు దగ్గరైన ప్రాణాలు

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
సందెపొద్దువేళాయే చందమామ రావే
చీకటైన పొదరింట దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
నాకే సోకే కొంటెచూపు కోణాలు


పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే
వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే
వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే

సూరీడేమో కొండలు దాటే
నా ఈడేమో కొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో
ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు
నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ

కొండకోనల్లో ఎండవానల్లో
మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే

వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో
అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే
అల్లరి కళ్ళు ఆరాతీసే
దూరాలన్ని చేరువచేసే
ఒడిచేరి పరువాలు పంచుకో
బిడియాల గడపింక దాటుకో
నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు
నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ

జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం
పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే
సందెపొద్దువేళాయే చందమామ రావే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపూల బాణాలు
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ



మంగళవారం, నవంబర్ 03, 2015

తొంగి తొంగి చూడమాకు...

శ్రీరంగనీతులు చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచూకందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీరంగ నీతులు (1983)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా..

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా
వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా
అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

వెన్నెల్లో వేడుకుంది
కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది
వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా
పూల బాణాలు వేసుకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసుకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

గుండెల్లో తాళముంది
గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది
ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపి తాపాలలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపి తాపాలలో తేలిపోదమా?
స్వర్గం చూద్దామా...  సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా
వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా
అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా


సోమవారం, నవంబర్ 02, 2015

అడగాలనుంది ఒక డౌటుని...

లిటిల్ సోల్జర్స్ చిత్రంలోని ఈ సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
సంగీతం : శ్రీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీ, శ్రీలేఖ, దీపిక, విష్ణు

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు

అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ

ఈ హైటే నాకు ఉంటే 
అమ్మో ఎంత danger
నాక్కూడా మీసముంటే
ఏం చేస్తావు మేజర్
class miss chairలోన నేను కూర్చుంటా
comics class books చేసి చదివిస్తా
స్కూలుకి principal sir నేను అవుతా
All days holidays ఆడుకోండి అంటా
ఎగ్జాంసొస్తే అప్పుడు ఎలా మరీ
మార్కులు కూడా మీరే వేస్తె సరి

అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

చాలమ్మా ఆటలింకా
కొంచెం ఆగు మమ్మీ
రానంటే వెళ్లిపోతా
నో నో వద్దు డాడీ
ఆటకైనా పాటకైనా ఆఖరంటు లేదా
ఆకలేస్తే అప్పుడైన అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి     
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే


ఆదివారం, నవంబర్ 01, 2015

చప్పుడైన చేయలేదే..

సత్య సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల (??)
గానం : మనో, స్వర్ణలత 

సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే.. హే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే హోయ్..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే..
 
ఓయ్..చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
నవ్వినట్లు ఉంటాదే నా పిల్లచూడు..నా పిల్లచూడు
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా 
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా
ముద్దు గానే ఉంటాడే నా పిల్లగాడు.. నా పిల్లగాడు
సింగమంటి పిల్లగాడు జింక పిల్ల లాంటి నాకు
వంగి లొంగి పోయాడే 

చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
సూడబోతే పూల రేకు పట్ట బోతే పిడిబాకు 
టక్కులెన్నొ నేర్చిందే 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే

హొయ్ ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
సిగ్గు బుగ్గి చేస్తాడే నా పిల్లగాడు 
నా పిల్లగాడు నా పిల్లగాడు
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
గుట్టు చెప్పనంటుంది నా పిల్ల చూడు
గుమ్మపాల పొంగులో గట్టు దాటు గంగలా 
మతి సెడగొడుతుందీ..

సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
నువ్వు తప్ప నాకు దిక్కు మొక్కు లేదంటు 
ఒట్టేసి చెబుతాడే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే.. 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
 

శనివారం, అక్టోబర్ 31, 2015

ఎందుకో ఏమో..

రంగం చిత్రం కోసం హారీస్ జైరాజ్ స్వరపరచిన ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రంగం
సంగీతం : హారీస్ జయరాజ్
రచయిత : వనమాలి
రాప్ : శ్రీ చరణ్, ఎంసీ జేస్జ్
గానం : ఆలాప్ రాజు, ప్రశాంతిని

హేయ్.. యే...సే..వాట్...
ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం

ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చేరి దూరమయ్యే వరసే రేయి కలలుగ విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని తీరం దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఉదయం
నువ్వునేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ

ఊ హు ఊహు..ఆహాహాఅహాఅహహ

ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే ...

ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసేను వయసే..
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆశే..
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమా

లెట్స్ గో.. వావ్.. వావ్..
నీ గర్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
యూ ఆర్ లుకింగ్ సో ఫ్లాట్..
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన

లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా..
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా..
నన్ను చుట్టుముట్టే వెన్నెల
లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా..
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా..
నన్ను చుట్టుముట్టే వెన్నెల 

నిలవనీక నిను తెగ వెతికే
కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినబడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా
కన్నులనే పొందానో
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో
నీడనే దోచే పాపే నేనో

ఏమో (ఆల్‌రైట్) తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే
ఓహో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే ...

ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కానని తీరం దరి కానని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం.. (2)
ఏమో.. ఏమో.. ఏమో.. 



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.