శుక్రవారం, ఏప్రిల్ 10, 2020

ఏ కులము నీదంటే...

సప్తపది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఓఓఓఓఓఓ... 
ఆఆఆఆఆఆ...

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు..

ఆఆఅ ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది


గురువారం, ఏప్రిల్ 09, 2020

తరలి రాద తనే వసంతం...

రుద్రవీణ చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతె ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ
దిశనెరుగని గమనము కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
ఏ కళ కైనా ఏ కల కైనా
జీవిత రంగం వేదిక కాదా

ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా

మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలకదు కద 

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం 


బుధవారం, ఏప్రిల్ 08, 2020

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ...

మనీ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనీ (1973)
సంగీతం : శ్రీ
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు
పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికి
మధ్య అంతా తనే అంది మనీ మనీ

కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువవుతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే

సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువవుతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనదీ
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ

జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

డబ్బురా డబ్బుడబ్బురా
డబ్బు డబ్బే డబ్బు డబ్బురా 
 

మంగళవారం, ఏప్రిల్ 07, 2020

కీరవాణి కరోనా సాంగ్...

VIR_S... "U can break the chain" అనే కాప్షన్ తో కీరవాణి సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటీ, దదాపు ప్రతి కాలేజ్ ఫేర్వెల్ పార్టీలోనూ వినిపించే "ఎక్కడో పుట్టి" అనే పాటకు పేరడీగా చక్కని లిరిక్స్ రాసుకుని తనే పాడిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన కరోనా సాంగ్ ఇక్కడ చూడవచ్చు. 

అనంత శ్రీరాం గారు వ్రాయగా వందేమాతరం శ్రీనివాస్ గారు గానం చేసిన పాట ఇక్కడ చూడవచ్చు. 


కీరవాణి కరోనా సాంగ్ - 2020
సంగీతం : కీరవాణి    
సాహిత్యం : కీరవాణి
గానం : కీరవాణి 

Oh... My dear girls...
dear boys.. dear madams..
భారతీయులారా !
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి,
ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి
ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి
ఉక్కు సంకల్పంతో
తరుముదాము దాన్ని బయటికి

We will stay at home
We will stay at home
We stay safe
We will stay at home
We will stay at home
We stay safe

ఉత్తుత్తి వార్తలు పుకారులన్నీ నమ్మకండి
అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి
విందులు పెళ్లిళ్లు వినోదాలు కాస్త మానుకోండి
బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి

కాస్తయినా వ్యాయామం రోజూ చెయ్యండి
కూస్తయినా వేన్నీళ్ళు తాగుతుండండి
అనుమానం వచ్చిన ప్రతిసారి
వెనువెంటనే చేతుల్ని కడుగుతుండండి

ఇల్లు ఒళ్ళు మనసు శుభ్రపరచుకుంటే
ఇలలోనే  ఆ స్వర్గాన్ని చూడొచ్చండి
ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే
ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి

We will stay at home
We will stay at home
We stay safe
We will stay at home
We will stay at home
We stay safe

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి,
ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి
ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి
ఉక్కు సంకల్పంతో
తరుముదాము దాన్ని బయటికి 

సొంత ప్రాణాలను పణంగా
పెట్టిన త్యాగమూర్తులు
మనలోనే వున్నారు
మనుషుల్లో దేవుళ్ళు
డాక్టర్లు నర్సులూ
కనబడని శత్రువుతో
పోరాటం చేస్తున్న
సమరయోధులు
పోలీసులంటే ఎవరో కాదు
మన కుటుంబ సభ్యులు

చెత్తను మురికిని మలినాలనన్నీ
ఎత్తి పారేసేటి ఏక వీరులు
పారిశుధ్య పనులు చేసే చేతులకి
సరిపోవు వేవేల కోటిదండాలు
కన్న తల్లి తండ్రి కూడా చాలరండి
ఏమిచ్చుకుంటే వారి ఋణము తీరేనండి
మానవ సేవకు అంకితమైన వాళ్లు
క్షేమంగానే వుండాలని ప్రార్థించండి

We will stay at home
We will stay at home
We stay safe
We will stay at home
We will stay at home
We stay safe 


సోమవారం, ఏప్రిల్ 06, 2020

చౌరస్తా కరోనా సాంగ్...

తెలంగాణ శ్లాంగ్ లో మంచి హిట్ సాంగ్స్ తో పాపులర్ అవుతున్న చౌరస్తా బ్యాండ్ కి చెందిన రామ్ మిరియాల రాసి కంపోజ్ చేసిన కరోనా సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ అంశం మీద మొదట పాపులర్ అయిన పాట ఇదే అనుకుంటాను. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

కరోనాకి కూడా కంగారు పుట్టించేలా రాసి పాడిన రామ్ గోపాల్ వర్మ గారి పాట ఇక్కడ చూడవచ్చు. 

అలాగే ఇదే అంశం మీద వందేమాతరం శ్రీనివాస్ గారు కంపోజ్ చేసి పాడిన పాట ఇక్కడ చూడవచ్చు.


చౌరస్తా కరోనా సాంగ్ - 2020
సంగీతం : రామ్ మిరియాల   
సాహిత్యం : రామ్ మిరియాల
గానం : రామ్ మిరియాల
  
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా
సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు

ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా?
ఆయుధాలు లేవురా హృదయముంటే చాలదా
కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారే దాకా ఓపిక్కొంత పట్టరా

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై సాగినారు
ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా?
లోకమంటే వేరు కాదు నువ్వే ఆ ఆలోకం రా
నీ బతుకు సల్లగుంటే లోకానికి సలవరా


ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తెలుగు సెలెబ్రిటీస్ కరోనా సాంగ్...

కరోనా కరోనా కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట వింటున్నాం. మరి పాటలలో మాత్రం ఎందుకు వదిలేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ ని ప్రమోట్ చేస్తూ పోరాడి కరోనాపై విజయం సాదిద్దామని ప్రోత్సహిస్తూ శ్రీనివాస మౌళి రాసిన ఈ కరోనా సాంగ్ సాక్షాత్తు భారత ప్రధాని ప్రశంసలు అందుకుంది. ఎక్కడివారక్కడే ఐసోలేషన్ లో వీడియో బైట్స్ పంపి ఈ పాటను తయారు చేసిన అందరూ అభినందనీయులు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


కరోనా సాంగ్ - 2020
సంగీతం : కోటి  
సాహిత్యం : శ్రీనివాస మౌళి
గానం : కోటి
  
We gonna fight corona ఏదేమైనా
చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా
జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్నా
ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా

నీ చేతల్లోనే కదా భవిత
నీవైపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier

కడిగేసి తరిమేసేద్దాం ఈ కరోనా
షేక్ హాండ్సు వద్దు గాని దండం మిన్న
సబ్బూ సానిటైజరు వాడోయ్ అన్నా
సింప్టంసు ఉంటే ఐసోలేషన్ మిన్న

నీ చేతల్లోనే కదా భవిత
నీవేపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier

బ్రతుకంటే ఓ పోరాటం మన తల వంచం
విజ్ఞానం వైద్యం మనకు ఉన్నాయ్ సాయం
దేశాలు ఒకటై చేస్తున్నాయి యుధ్ధం
మనవంతుగ ముందడుగేస్తే మనదే విజయం

నీ చేతల్లోనే కదా భవిత
నీవేపుకంటూ రాదే నలత

Lets fight this virus
Lets kill this virus
Lets do it together
Lets live healthier

 

శనివారం, ఏప్రిల్ 04, 2020

ఏయ్ పిల్లా! పరుగున పోదామా...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న కొత్త సినిమా ’లవ్ స్టోరీ’ నుండి ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లవ్ స్టోరీ (2020)
సంగీతం : పవన్ సిహెచ్.  
సాహిత్యం : చైతన్య పింగళి
గానం : హరిచరణ్
  
ఏయ్ పిల్లా! పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా
రా రా కంచే దూకి
చక చక ఉరుకుతూ
ఆ రంగుల విల్లును తీసి
ఈ వైపు వంతెన వేసి.. రావా..

ఎన్నో తలపులు ఏవో కలతలు
బతుకే పోరవుతున్నా
గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి
ఆశ నిరాశల ఉయ్యాలాటలు
పొద్దు మాపుల మధ్యే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇక నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి
నీకై పరిచానే తలగడగా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిల మిల చూడే

వచ్చే మలపులు రస్తా వెలుగులు
జారే చినుకుల జల్లే
పడుగు పేక మల్లె
నిన్ను నన్ను అల్లె
పొద్దే తెలియక గల్లీ పొడుగునా
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

ఏయ్ పిల్లా! పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా

పారే నదై నా కలలు ఉన్నాయే
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి ఆచి తూచి
అందించా జాతరలా

ఆ క్షణము చాతి పైన సోలి
చూసా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు 
ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే 
తేలే బొమ్మలు చూడే

పట్నం చేరిన పాల పుంతలు
పల్లెల సంతల బారే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే


శుక్రవారం, ఏప్రిల్ 03, 2020

నీ కన్ను నీలి సముద్రం...

ఉప్పెన చిత్రం కోసం కవ్వాలీ శైలిలో దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఉప్పెన (2020)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి, రకీబ్ ఆలం(హిందీ)
గానం : జావేద్ అలి, శ్రీకాంత్ చంద్ర(హిందీ)  

(इश्क़ शिफ़ाया, इश्क़ शिफ़ाया
इश्क़ परदे में किसी की आँखों में लबरेज़ है
इश्क़ शिफ़ाया, महबूब का साया
इश्क़ मलमल में ये लिपटा हुआ तबरेज़ है

इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर
इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर

इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर
इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर)

ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా
ఇష్క్ పర్దేమె కిసీకీ అంఖోఁ మే లబ్ రేజ్ హై
ఇష్క్ సిఫాయా మెహబూబ్ కా సాయా
ఇష్క్ మల్మల్ మే ఏ లిప్టా హువా తబ్ రేజ్ హై

ఇష్క్ హై పీర్ పయంబర్
అర్రే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్ హై పీర్ పయంబర్
అర్రే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్

ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
(నీ కన్ను నీలి సముద్రం)
(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
(నీ నవ్వు ముత్యాల హారం)
(నన్ను తీరానికి లాగేటి దారం దారం)

నల్లనైన ముంగురులే (ముంగురులే)
అల్లరేదో రేపాయిలే (రేపాయిలే)
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే (నీ గాజులే)
ఝల్లుమంది నా ప్రాణమే (నా ప్రాణమే)
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
(నీ కన్ను నీలి సముద్రం)
(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
(నీ నవ్వు ముత్యాల హారం)
(నన్ను తీరానికి లాగేటి దారం దారం)

చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చేరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా
ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కనా
అప్పు అడిగానే కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
(నీ కన్ను నీలి సముద్రం)
(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
(నీ నవ్వు ముత్యాల హారం)
(నన్ను తీరానికి లాగేటి దారం దారం)

నీ అందమంతా ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా
చుట్టూ ఎంత చప్పుడొచ్చిన్నా నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడినీ
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడినీ
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ

ఇష్క్ హై పీర్ పయంబర్
అర్రే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్ హై పీర్ పయంబర్
అర్రే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్

ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా
ఇష్క్ పర్దేమె కిసీకీ అంఖోఁ మే లబ్ రేజ్ హై
ఇష్క్ సిఫాయా మెహబూబ్ కా సాయా
ఇష్క్ మల్మల్ మే ఏ లిప్టా హువా తబ్ రేజ్ హై

(इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर
इश्क़ है पीर पयम्बर
अरे, इश्क़ अली दम मस्त कलंदर

इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर
इश्क़ कभी कतरा है
अरे, इश्क़ कभी है एक समंदर

इश्क़ शिफ़ाया, इश्क़ शिफ़ाया
इश्क़ परदे में किसी की आँखों में लबरेज़ है
इश्क़ शिफ़ाया, महबूब का साया
इश्क़ मलमल में ये लिपटा हुआ तबरेज़ है) 

గురువారం, ఏప్రిల్ 02, 2020

నీలి నీలి ఆకాశం...

యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా నటిస్తున్న "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2020)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : చంద్రబోస్
గానం : సిధ్ శ్రీరామ్, సునీత 

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో
నీ నవ్వుకు సరిపోదంటున్నా...

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా


బుధవారం, ఏప్రిల్ 01, 2020

అయ్యోలూ హమ్మోలు..

ఫూల్స్ డే నాడు తలుచుకోవడానికి అసలు ఇంతకన్నా అర్హత వున్న వాళ్ళెవరైనా ఉంటారా. తమ అమాయకత్వం తో అతి తెలివితో అమోఘమైన ఐడియాలతో బోల్తాపడుతూ అప్పాజీకి పెనాల్టీలు చెల్లిస్తూ మనకి బోలెడు నవ్వులని పంచుతారు కదా. అందుకే అమృతం (అ)ద్వితీయం అంటూ మొన్న ఉగాది నుండీ జీ5 లో సెకండ్ సీజన్ మొదలెట్టేసిన అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ ని ఈ రోజు తలుచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సెకండ్ సీజన్ ప్రోమో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : అమృతం (2020)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : కళ్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

నువ్వాకాశానికి
చిల్లెట్టేంత డేంజరువా
స్పేసంతా ఇరుకై
పోయేటంత ట్రాఫిక్కువా
నీకోసం పుట్టాయా
లోకంలో అన్ని కష్టాలు
నీవల్లే వస్తాయా
ప్రళయాలూ విశ్వ విలయాలు

భయం లేదు శిశువా
ఇసుక తునకంత లేవే నువ్వసలు
నువ్వేం చేయగలవా
అష్ట దిక్కుల్ని వణికించే పనులు
ఎవరెస్టును తొక్కేస్తాయా
మన ఈ పాదాలూ
పసిఫిక్కుని ఇంకించేస్తాయా
నీ పంతాలూ

ఆటం బాంబ్ వేశావే
భూగోళం పేలి పోయిందా
గనులెన్నో తవ్వావే
పాతాళం గాని తగిలిందా

ఒరేయ్.. ఒరేయ్.. ఒరేయ్..
ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు.. 
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్..
 
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ సీరియల్ మొదటి సీజన్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాను దానిగురించి ఇదివరకు నేను వేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : అమృతం (2001)
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

మన చేతుల్లోనే లేదా
రీమోట్ కంట్రోలు..
ఇట్టే మార్చేద్దాము
ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు..

వార్తల్లొ హెడ్ లైన్సా..
మన కొచ్చే చిలిపి కష్టాలు..
అయొడిన్ తో అయిపోయే..
గాయాలే మనకు గండాలు..

ఎటో వెళ్ళి పోతూ..
నిన్ను చూసింది
అనుకో ఓ ట్రబులు..
hello..how do u do..
అని అంటోంది
అంతే నీ లెవెలు..
ఆతిధ్యం ఇస్తానంటె
మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం
చేస్తుందా..

గాలైనా రాదయ్యా..
నీదసలే ఇరుకు అద్దిల్లు..
కాలైనా పెడుతుందా
నీ ఇంట్లో పెను తుఫానసలు..

ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.