బుధవారం, జులై 10, 2019

కోరినది నెరవేరినది...

మోసగాళ్ళకు మోసగాడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
సాహిత్యం :  ఆరుద్ర
గానం :  సుశీల, బాలు

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు దాచుకున్ననాడే..
సుఖం.. సుఖం.. సుఖం
తోడుగా.. నీడగా.. సాగిపో

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే
రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే

ఊసులాడు వేళ బాస చేయు వేళ.. ఇదే.. ఇదే.. ఇదే
ఆడుకో...  ఆశలే...  తీర్చుకో


కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము 
ఆహా...ఆహా.. హా... ఓహో... ఓహో...  

 

మంగళవారం, జులై 09, 2019

అన్నయ్య సన్నిధీ...

బంగారు గాజులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : సుశీల 

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి...

ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై
చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి...

కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైన
కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైన
ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన
ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి...


సోమవారం, జులై 08, 2019

అమ్మ కడుపు చల్లగా...

సాక్షి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సాక్షి (1967)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా

నా మెడలో తాళిబొట్టు కట్టరా
నా నుదుట నిలువు బొట్టు పెట్టరా
నా మెడలో తాళిబొట్టు కట్టరా
నా నుదుట నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా
నా సిగపూవుల రేకైనా వాడదురా వాడదురా

బతకరా బతకరా పచ్చగా

సల్లనీ అయిరేణికి మొక్కరా
సన్నికల్లు మీద కాలు తొక్కరా
సల్లనీ అయిరేణికి మొక్కరా
సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా
నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా

బతకరా బతకరా పచ్చగా

నా కొంగు నీ చెంగూ ముడివేయరా
నా చేయీ నీ చేయీ కలపరా
నా కొంగు నీ చెంగూ ముడివేయరా
నా చేయీ నీ చేయీ కలపరా
ఏడడుగులు నాతో నడవరా
ఆ యముడైనా మనమద్దికి
రాడురా రాడురా
బతకరా బతకరా పచ్చగా

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా


ఆదివారం, జులై 07, 2019

ఆకాశంలోని చందమామ...

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి దేవీపుత్రుడు చిత్రం లోని ఈ అందమైన పాటతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే


పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంట
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత

అడుగేసి తీస్తే హంస జోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే 

శనివారం, జులై 06, 2019

చిగురులు వేసిన కలలన్ని...

పూలరంగడు చిత్రాంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూలరంగడు (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల, కె.బి.కె.మోహనరాజు 

చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి..
మమతల తీరంచేరినవి..

ఆ.ఆ.ఓ...ఓ...ఓ

సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను

నిండు మనసు పందిరి కాగా
నిన్ను అందుకున్నాను..
నిన్నే అందుకున్నాను...

చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి


దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...


చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే

పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే
కరిగించిన చెలియవు నీవే..
కరగించిన చెలియవు నీవే

చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ
మమతల తీరం చేరినవి
మమతల తీరంచేరినవి

ఆ.ఆ.ఓ...ఓ...ఓ 


శుక్రవారం, జులై 05, 2019

కనరాని దేవుడే...

రంగుల రాట్నం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగుల రాట్నం (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు /బి.గోపాలం
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల
 
కనరాని దేవుడే కనిపించినాడే
కనిపించి అంతలో కన్నుమరుగాయె
కన్నుమరుగాయె
కనరాని దేవుడే కనిపించినాడే

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ

అల నీలిగగనాన వెలిగె నీ రూపు
అల నీలిగగనాన వెలిగె నీ రూపు
ఆనందభాష్పాల మునిగె నా చూపు
మనసార నిను చూడలేనైతి స్వామీ
కరుణించి ఒకసారి కనిపించవేమీ

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
 
అందాల కన్నయ్య కనిపించగానే
బృందావనమెల్ల పులకించి పోయే
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వె
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ

వలపుతో పెనవేయు పారిజాతమునై
వలపుతో పెనవేయు పారిజాతమునై
ఎదమీద నిదురించు అడియాశ లేదు
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై
నీ చరణ కమలాల.. నలిగిపోనీవా

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ

కనరాని దేవుడే కనిపించినాడే
కనిపించి అంతలో కన్నుమరుగాయె
కన్నుమరుగాయె


గురువారం, జులై 04, 2019

తుళ్ళి తుళ్ళి పడుతోంది...

మంచి కుటుంబం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచి కుటుంబం (1968)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.సుశీల, జానకి, వసంత

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగా
బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగా
సిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగా
సిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగా
సిరి మల్లెల పందిరి లోనా
నవమంగళ వేదిక పైనా
సిరి మల్లెల పందిరి లోనా
నవమంగళ వేదిక పైనా
జరిగేను కళ్యాణ వైభోగమే

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..
మెల మెల్లగ కౌగిట దూసి..
చల చల్లగ గంధం పూసి..
మెల మెల్లగ కౌగిట దూసి..
లతవోలే జత కూడి లాలింతునే...

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా
గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా
గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల బంధింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు 


బుధవారం, జులై 03, 2019

రాముని అవతారం...

విజయనిర్మల గారు సీతాదేవిగా కనిపించి మెప్పించిన భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : ఘంటసాల

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో... ఓ
రాముని అవతారం... మ్మ్.
రవికుల సోముని అవతారం మ్మ్

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం...

దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరతా...

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేతా...
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము
అంతము చేయునహల్యకు శాపము
ఒసగును సుందర రూపం

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిధిలా నగరమున

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం.మ్మ్
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజన సేవకు ఆదేశం

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింక
అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అరిగిన మరణమె నీ కింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్...
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్
ముద్రిక కాదిది భువన నిదానం
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం

రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి

అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

మంగళవారం, జులై 02, 2019

కృష్ణా... ముకుందా... మురారి...

ఈ నెలంతా విజయనిర్మల గారి పాటలతో ఆవిడకు నివాళి అర్పిద్దాం. ముందుగా పాండురంగ మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

 
దేవకి పంట... వసుదేవువెంట....
దేవకి పంట... వసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

 
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి....
ఊపునబోయీ మాకులకూలిచి...
శాపాలు బాపితివంటా....ఆ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

 
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ...
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద..
ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను...
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు...
తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి

 
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా...
కంసాదిదానవ గర్వాపహారా...
హింసా విదూరా.. పాపవిదారా...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

 
కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...
విజయతే... గోపాల చూడామణీ...

లలిత లలిత మురళీ స్వరాళీ...
లలిత లలిత మురళీ స్వరాళీ...
పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి...
వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ....

కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..
హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ.. 

 

సోమవారం, జులై 01, 2019

తలపు తలుపు తెరిచానా...

బ్రోచేవారెవరురా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్రోచేవారెవరురా (2019)
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : వందన శ్రీనివాస

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నా
ఎందుకో ఏమో తెలియని మౌనం
తేల్చుకోలేనే సమాధానం.

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా

రోజంతా అదే ధ్యానం తన పేరే అనేలా
చూస్తూనే మరోలాగా మారాలెలా
భూగోళం చేరేలా ఆకాశం దిగాలా
సందేహం సదా నాకు లోలోపలా
ముడిపడినా సరిపడునా
ఇరువురి సహవాసం జతపడునా
జగము ఇదేంటీ అనదు కదా
అయోమయం లో ఉన్నా అదో మాయగా 

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.