మంగళవారం, ఏప్రిల్ 10, 2018

కొమ్మెక్కి కూసింది...

గూండా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గూండ (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
కొండెక్కి చూసింది చందమామ
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
కొండెక్కి చూసింది చందమామ

కోయిలమ్మ గొంతులో రాగాలు
చందమామ మనసులో భావాలు
కోయిలమ్మ గొంతులో రాగాలు
చందమామ మనసులో భావాలు

గాలులతో వ్రాసుకున్న పూల ఉత్తరాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత
పువ్వులతో చేసుకొన్న తేనె సంతకాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత

మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత
వయసులతో చేసుకొన్న చిలిపి వందనాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత

సందెల్లో చిందినా వలపులన్నీ
సంపంగితోటలో వాసనల్లే
పూలపల్లకి మీద సాగి వచ్చు వేళ

లలలలలలలలల...
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
కొండెక్కి చూసింది చందమామ
కోయిలమ్మ గొంతులో రాగాలు
చందమామ మనసులో భావాలు

చూపులతో చెప్పుకొన్న తీపి స్వాగతాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత
నవ్వులతో పంచుకొన్న మధుర యవ్వనాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత

ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత
ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు
దిద్దినక ధింత.. దిద్దినక ధింత

జాబిల్లి కొంగునా తారలన్నీ
నా తల్లో విరిసినా జజులల్లే
ప్రేమ పూజలే నీకు చేసుకొన్న వేళ

లలలలలలలలల..
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
కొండెక్కి చూసింది చందమామ
కోయిలమ్మ గొంతులో రాగాలు
చందమామ మనసులో భావాలు

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
కొండెక్కి చూసింది చందమామ


సోమవారం, ఏప్రిల్ 09, 2018

మల్లెపూల వానా...

వినోదం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినోదం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఆ... మల్లెపూల వానా
మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా

 మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన..

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా
 

దొరకును దొరకూన హో...
ఎదురెవరురా మనకీవేళలోన

మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

ఓయమ్మా ఈ రోజునా
వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే
గోదారి అలలౌతుంటే
ఆగేనా ఎవ్వరాపినా
అష్టసిరులు నిను ఇష్టపడెనురా
కష్టపడితె జత కట్టవచ్చురా

 

గ్రహాలన్ని మనకే
అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగ
వేశానుర కోటలో పాగా
పాచిక వేశాకా
పారక పోదురా
నూరారు అయినా 

మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా
  
మబ్బుల్లో ఆ జాబిలీ
నా జతకోసం రావాలనీ
ఓ చిటికేసి పిలవంగానే
ఇటుకేసి వస్తున్నాడె నా జళ్లో చేరాలనీ
ప్రేమయాత్రలో పక్కదారులు
ఎంత మాత్రమూ తప్పుకాదురా

రథం నడుపుతారా
మా మామను కూర్చోబెట్టి
ఎటెళ్లాలో చెబుతా
కళ్లాలను చేత్తో బట్టి
అల్లుడినైపోగా హా.. చల్లగ
నా కాళ్లు కడిగించుకోనా

 మల్లెపూల వానా...
మల్లెపూల వానా
జల్లులోనా
తడిసిన ఆనందాన
పలికెను మది వీణా

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా 

 మల్లెపూల వాన... వాన... వాన...
వాన... వాన...

భయం లేదు పదరా
అని పలికిందిరా నా మైనా
జయం మనిది కదరా
మనమనుకున్నది జరిగేరా 
 దొరకును దొరకూన హో...
ఎదురెవరురా మనకీవేళలోన
  
 

ఆదివారం, ఏప్రిల్ 08, 2018

నిరంతరమూ వసంతములే...

ప్రేమించు పెళ్ళాడు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో దొరకలేదు ఎంబెడెడ్ యూట్యూబ్ ఆడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండె
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే

నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండె
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే

హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం
తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణమీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడె వెన్నెలే వేణుగానం
ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటె

నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండె

నిరంతరము వసంతములే
మందారములా మరందములే

అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా
మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై
మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండె
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే

శనివారం, ఏప్రిల్ 07, 2018

మాఘమాసం ఎప్పుడొస్తుందో...

ఎగిరే పావురమా చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఎగిరేపావురమా (1997)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
సాహిత్యం : వేటూరి
గానం : సునీత

మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌన రాగాలెన్నినాళ్లో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో
మత్తు మత్తు ఎన్నిఏళ్ళో..
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా

మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌన రాగాలెన్నినాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు
నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మో..ఓ..ఓ.. హాయమ్మా వలపులే
తొలిరేయమ్మ వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే

మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌన రాగాలెన్నినాళ్లో 
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతిమనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు
నా.. కంటిపాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మో.. ఓఓ ... ఒళ్ళంతా మనసులే
ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నం ఏనాడూ

మాఘమాసం ఎప్పుడొస్తుందో
మౌన రాగాలెన్నినాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా

శుక్రవారం, ఏప్రిల్ 06, 2018

మల్లెపూల చల్లగాలి...

మౌనరాగం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే.. ఈనాటికీ.. మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా

తామరలపైనా నీటిలాగా
భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ
సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా ప్రేమ బంధాలు లేకా
మోడంటి జీవితం ఇంకేలా ! హ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో .. ఏల ఈవేళ

వేదికై పోయే మన కధంతా
నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే హృదయమంతా
బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం పంచవేలా సుగంధం
నా గుండె గుడిలో నిలవాలీ .. రా !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే ఈనాటికీ మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా 

 

గురువారం, ఏప్రిల్ 05, 2018

కుకుకూ.. కుకుకూ..

సితార చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సితార (1983)
సాహిత్యం : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, జానకి

కుకుకూ.. కుకుకూ..
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
రాణి వాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

రంగుల లోకం పిలిచే వేళ.. 
రాగం నీలో పలికే వేళ..
విరులా తెరలే తెరచి రావే.. 
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు

కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ.. డుండుం టట డుండుం టట..      
పిప్పీపి పీపీ పీపీపిపీ.. డుండుం టట డుండుం టట..
పీపీపి పీపీపి పిప్పీపి.. డుండుం టట డుండుం టట..
పిప్పీపి పీపీ పీపీపిపీ.. పీపీపి పీపీపి పిప్పీపి
పిప్పీపి పీపి పిప్పీపి.. పీపీపి పీపీపి పిప్పీపి
పీపీపి.. పీపీపి.. పీపీపి.. పీపీపీ..ఓ..హ్.హ్.హ్...

సూర్యుడు నిన్నే చూడాలంట.. 
చంద్రుడు నీతో ఆడాలంట..
బురుజూ బిరుదూ విడిచి రావే.. 
గడప తలుపూ దాటి రావే..
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులతో

కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
రాణి వాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

 

బుధవారం, ఏప్రిల్ 04, 2018

సిరిమల్లె నీవే...

పంతులమ్మ చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
 
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
 
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
అహాహాహ ఆహా.. లలలాల లాలా..

 

మంగళవారం, ఏప్రిల్ 03, 2018

శీతాకాలం ప్రేమకు...

అశ్వమేథం చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అశ్వమేధం (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, ఆశా భోంస్లే

శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం

వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం

ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం

చేగాలికే చెదిరే నడుమే .. 
పూగాలికే పొదలా వణికే
ఊరింపుతో ఉడికే పెదవే .. 
లాలింపుగా పెదవే కలిపే
సన్నగిల్లే .. చెలి వెన్ను గిల్లే
ఆకలింతే .. తొలి కౌగిలింతే
చలి అందాలన్నీ చందాలిస్తా .. ఓ ఓ ఓ

శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం

నూనూగుగా తగిలే తనువే.. 
నాజూకుగా తపనై రగిలే 
నీ వంపులో ఒదిగే తళుకే.. 
కవ్వింపులే కసిగా అలికే
జివ్వుమంటే.. ఎద కెవ్వుమంటే
జవ్వనాలే.. తొలి పువ్వు పూసే
పొద పేరంటాలే ఆడించేస్తా .. ఓ ఓ ఓ

శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం

వలపమ్మ జల్లే వానాకాలం హాయ్..
సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం

ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
అరె ఎండాకాలం ముద్దులు పండే కాలం
ఆ .. శీతాకాలం ప్రేమకు ఎండాకాలం 
ఎండాకాలం ముద్దులు పండే కాలం

 

సోమవారం, ఏప్రిల్ 02, 2018

వసంతం పల్లకి...

వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన స్వరకల్పన చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో మరింత క్లారిటీతో ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వరకల్పన (1989) 
సంగీతం : అమర్ (గంగై అమరన్)
సాహిత్యం : ??
గానం : బాలు, ఎస్.పి. శైలజ

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

గుసగుసల కిసలయం
కిలకిలల జలజంనవమదన మదగజం
కనబడుట సహజం
ఎటు చూసినా నీ రూపమే
ఎద మీటవా ఋతురాణిలా
అందాల బాలా అజవరాలా
అరవిరుల మరుల లలన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

కొసమెరుపు కులుకుల
కువకువల నెమలి
విరి పొదల మధువుల
రిమరిమల భ్రమరి
వర్దిల్లుమా వాసంతమా
వడబోసిన రసభావమా
లోకాలనేలే నెరజాణా
నవధవళ కమల లయన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం ఆహహా.. లలలల్లా..
 

ఆదివారం, ఏప్రిల్ 01, 2018

మావి చిగురు తినగానే...

మొన్ననే ఉగాది వచ్చివెళ్ళింది కదా ఇక వసంతానికి, మల్లెలకి, మావిళ్ళకి ఆహ్వానం పలుకుదాం ఈ నెలంతా. ముందుగా సీతామాలక్ష్మి చిత్రంలోని ఓ అందమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కే. వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : బాలు, సుశీల

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా

తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల పలికేనా

ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఊయ్యాలా జంపాల జంపాల ఊయ్యాల
ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ

మావి చిగురు తినగానే కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని

మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆఆఆ..
కోయిల పలికేనా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.