బుధవారం, సెప్టెంబర్ 30, 2015

భామా ఈ తిప్పలు తప్పవు..

ఇళయరాజా సంగీత సారధ్యంలో బాలు జానకి గార్లు గానం చేసిన ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఛాలెంజ్ (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

తప్పంటూ చేయక పోతే తగలాటము..
నిప్పంటి వయసులతోనా చెలగాటము
ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటమే ఆరాటము
వానాకాలం ముసిరేస్తుంటే
వాటేసుకునే హక్కేఉంది
ఇదివానో గాలో పొంగో వరదో
రారా మలిపొద్దులు పుచ్చక
సుద్దులతో ఈ వేళా

మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

ఏదిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము
కవ్వింతల్లో కసిగా ఉంటే
కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో నైటో పగలో
రావే చెలి ఆకలి తీర్చకు 
చూపులతో ఈ వేళా

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా



మంగళవారం, సెప్టెంబర్ 29, 2015

ఇద్దరమే మనమిద్దరిమే..

కొల్లేటి కాపురం చిత్రం కోసం శ్రీశ్రీ గారు రాసిన ఒక చక్కని డ్యూయట్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు...


చిత్రం : కొల్లేటి కాపురం (1976)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : బాలు, సుశీల

ఇద్దరమే మనమిద్దరమే . . ఇద్దరమే
కొల్లేటి కొలనులో కులికేటి అలలమై
వలపించే భావాల వెలలేని కలలమై
 
ఇద్దరమే మనమిద్దరమే . . ఇద్దరమే

తొలిసంజ వెలుగులో కలువ పూబాటలో
తొలిసంజ వెలుగులో కలువ పూబాటలో

వికసించే ఎదలతో విడిపోని జంటగా
విడిపోని జంటగా .. 
 
ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే

గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
కువ కువల పిలుపులో పులకించే పాటగా  
 
ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే  

సరితోడు నీడగా పలికింది చేతగా
సరితోడు నీడగా పలికింది చేతగా

పదిమంది కోసమే బతకాలి నీతిగా
బ్రతకాలి నీతిగా . .
 
ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే



సోమవారం, సెప్టెంబర్ 28, 2015

ఎదురుగా నీవుంటే...

రామకృష్ణ గారు సుశీలమ్మ పాడిన ఒక మంచి మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మహాత్ముడు (1976)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే

నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో

నిత్యవసంతుడు నీడగవుంటే..
నిత్యవసంతుడు నీడగవుంటే..
చిత్రవర్ణ రాగాలెన్నో 

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే

కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో

వలచిన హృదయం పులకించునులే..
వలచిన హృదయం పులకించునులే..
చెలి వలపుల జోలలో   

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో..
ఎదురుగా నీవుంటే

మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె

ఆ అల్లికలో ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో.. 
అనురాగ వీణ మ్రోగె        

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే 


ఆదివారం, సెప్టెంబర్ 27, 2015

ఆమెతోటి మాటు౦ది..

అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి కె వెంకటేష్
సాహిత్యం : గోపి
గానం : బాలు

హే...ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది
ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది
ఏమున్నదో ఆ చూపులో

చిరుగాలి తరగల్లె నడకలు నేర్చిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
చిరుగాలి తరగల్లె నడకలు నేర్చిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
నవ్వు నన్ను పిలిచిందీ కళ్ళతోటి కాదందీ
హా..నవ్వు నన్ను పిలిచిందీ కళ్ళతోటి కాదందీ
దట్స్ లవ్ లవ్...లవ్...లవ్...లవ్...
 
హే హే హే హా..హా.హా.. రూ రూ రూ రూ
ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది
ఏమున్నదో ఆ చూపులో

 
తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
మనసు తెలుపనంటుందీ
మమత దాచుకుంటుందీ
మనసు తెలుపనంటుందీ
మమత దాచుకుంటుందీ
దట్స్ లవ్ లవ్...లవ్...లవ్...లవ్... 
 
హే హే హే హా..హా.హా.. రూ రూ రూ రూ
ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది
ఏమున్నదో ఆ చూపులో 
 
  

శనివారం, సెప్టెంబర్ 26, 2015

చుక్కల తోటలో ఎక్కడున్నావో..

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన కొన్ని చక్కన్ని మెలోడీస్ లో ఇదీ ఒకటి.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అల్లరి బుల్లోడు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక
నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో
ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆఆ.. ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి 

చుక్కల తోటలో ఎక్కడున్నావో.. ఆహాహా..
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను..ఆహాహా..
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను



శుక్రవారం, సెప్టెంబర్ 25, 2015

మ్రోగింది కళ్యాణ వీణా..

సాలూరి వారి స్వర రచనలో ఒక మధురమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో మిస్ అవకండి కృష్ణ గారి చూపులు.. ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రైస్ లెస్ అసలు :-)


చిత్రం : కురుక్షేత్రం (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

పిల్ల గాలితో నేనందించిన
పిలుపులే విన్నావో..ఓ..ఓ..
నీలి మబ్బుపై నే లిఖియించిన
లేఖలందుకున్నావో..
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
కల వరించి.. కలవరించి
కల వరించి.. కలవరించి..
పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

మత్త కోకిలలు ముత్తైదువులై
మంగళ గీతాలు పాడగా..ఆ..
మయూరాంగనలు ఆట వెలదులై..
లయ లహరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
సుమశరుడే పురోహితుడై..
సుమశరుడే పురోహితుడై..
శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

  

గురువారం, సెప్టెంబర్ 24, 2015

సిరిమల్లీ శుభలేఖా...

జంధ్యాల గారు తన చిత్రాలలోని పాటలకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో తెలియనిది కాదు హాస్య చిత్రాలే కదా అని ఆయన పాటలను ఎప్పుడూ అలుసుగా తీస్కోలేదు. చూపులుకలిసిన శుభవేళ చిత్రంలోని ఈ పాట కూడా వారి ఉత్తమాభిరుచికి అద్దం పడుతుంది. హీరో సైకిల్ షాప్ ఓనర్ కనుక సైకిల్ థీమ్ తో సింపుల్ గా అందంగా ఈ పాటను చిత్రీకరించిన విధానాన్ని భళా అని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చూపులు కలసిన శుభవేళ (1988)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ?? (సినారె,మల్లెమాల, 
జొన్నవిత్తుల, ముళ్ళపూడి శాస్త్రి)
గానం : బాలు, జానకి

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం

అక్షర లక్షా  ముద్దుల బిక్ష
కందిన మొగ్గా  కమ్మని బుగ్గా
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ

జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే

ఋతు పవనాలలో రస కవనాలతో
తీర్చాలి నా మోజులే
రాజీ లేని అల్లరి రోజాపూల పల్లవి
నీ పాట కావాలిలే

కధ రమణీయమై చిరస్మరణీయమై
సాగాలి సంగీతమై అనురాగ శ్రీగందమై

చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షర లక్షా  ముద్దుల బిక్ష
కందిన మొగ్గా  కమ్మని బుగ్గా

తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక


రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారమూ
కావాలి చేయూతగా

బుగ్గ బుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై
జరగాలి సుముహుర్తమే కళ్యాణ వైభోగమే

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం

లాలాలా ఆహాహాహా..లాలాలా ఆహాహాహ

బుధవారం, సెప్టెంబర్ 23, 2015

రేపే లోకం ముగిసే నంటే..

రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో కొంతే ఉంటుది పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : లవ్ బర్డ్స్(1996)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఉన్నికృష్ణన్, సుజాత
 
రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు  
రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు 
కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగీ ఆఖరిసారిగా ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే
 

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు 

రేపేలోకం.. రేపేలోకం ముగిసేనంటే నువ్వేం చేస్తావూ
ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతలు పంచి మరణాన్నే మరిపిస్తాలే 

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు 
రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు 
కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగీ ఆఖరిసారిగా ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే

వలపు అనేది నిలిచెవరకూ భూలోకం ముగియదులే
కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగగనం చీలదులే
ప్రణయాలెన్నో రానీపోనీ జీవన యానం సాగునులే
తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే 

రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు 
రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు 
నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటాలే

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు 

 

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

తొలి వలపు తొందరలు..

రాజన్ నాగేంద్ర గారి స్వరరచనలో వేటూరి వారు అంత్య ప్రాసలతో సరదాగా అల్లిన ఒక పసందైన పాట ఈ రోజు తలచు కుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.జానకి

తొలి వలపు తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు
చేసే అల్లరులు

ఆ..తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను
చేసే అల్లరులు

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు

పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు
కరగాలి కౌగిళ్ళలో
వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు
కదిలే పొదరిళ్ళలో  
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు
కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు
బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలు
నాకే చెందాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను..చలితో నీవు
చేసే అల్లరులు హా...

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా
రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన
నీవే ఆలాపనా
వణికే నీ మేన.. సణిగే నా వీణ..
పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు..
సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి
నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు..చలితో నేను
చేసే అల్లరులు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు

సోమవారం, సెప్టెంబర్ 21, 2015

నీ కోల కళ్ళకు నీరాజనాలు..

హేమాహేమీలు చిత్రం కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అందమైన ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : హేమా హేమీలు (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపులకు అభివందనాలు

కోటేరు లాంటి ఆ కొస ముక్కు
పొద్దు నిద్దర లేచినట్లు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టీ కసిపట్టి బుసగొట్టే
పడగెత్తు పైటున్న ఆ చీరకట్టు
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు
 
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు 
విడిచి పెడితే పెట్టు నా మీద ఒట్టు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
అందించనా నేను సుస్వాగతాలు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు


నీ వలపే ఉసి గొలుపు 
నా చెలిమే చెయిగలుపు
పొలిమేరలో పిలుపు పులకింతలే రేపు
జడలోని మల్లికలు జవరాలి అల్లికలు
చలిపెంచే కోరికలు జాబిలితో కలయికలు
ఈ ఆరుబయట అందాల అల్లరులు  
ఈ పుట నాలో పలికించే కిన్నెరలూ
కలిసిపోనా ఏరు నీరై 
నేనింక నీవై నీవింక నేనై

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.